బొగ్గు మంత్రిత్వ శాఖ
కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క నిలిపివేయబడిన/మూసివేయబడిన బొగ్గు గనుల ఆదాయ భాగస్వామ్య నమూనాపై వాటాదారులతో సంప్రదింపులకు ఉత్సాహభరితమైన ప్రతిస్పందన
- కోల్ ఇండియా అటువంటి 100 కంటే ఎక్కువ గనులను ప్రైవేట్ రంగానికి అందించడాన్ని పరిశీలిస్తోంది
Posted On:
24 FEB 2022 6:29PM by PIB Hyderabad
కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) తగిన సమయంలో రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ రంగానికి మరియు ఇటువంటి 100 కంటే ఎక్కువ గనులను అందించాలని చూస్తోంది. సీఐఎల్ నిలిపివేయబడిన/మూసివేయబడిన గనుల కోసం ఆదాయ భాగస్వామ్య నమూనాపై బొగ్గు మంత్రిత్వ శాఖ.. ఈ రోజు న్యూఢిల్లీలో ప్రైవేట్ రంగంతో ఒక వాటాదారుల సంప్రదింపులను నిర్వహించింది. ప్రభుత్వ జరిపిన సంప్రదింపుల్లో ఎస్సెల్ మైనింగ్, అదానీ, టాటా, జేఎస్‌డబ్ల్యు, జేఎస్‌పీఎల్ మొదలైన ప్రైవేట్ రంగం నుండి భారీ భాగస్వామ్యాన్ని ఆకర్షించాయి. ఈ సంప్రదింపుల ప్రతిపాదనకు ఉత్సాహభరితమైన మద్దతునిచ్చాయి. నిలిపివేయబడిన/మూసివేయబడిన గనుల నుండి బొగ్గును ఉత్పత్తి చేయడానికి రెవెన్యూ షేరింగ్ మోడల్‌లో ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అనేక కారణాల వల్ల సీఐఎల్ ద్వారా గతంలో నిలిపివేయబడిన/మూసివేయబడిన వివిధ గనులు ఉన్నాయి. వీటిని ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో తిరిగి తెరవవచ్చు మరియు ఉత్పాదకంగా అమలులోకి తీసుకురావచ్చు. ప్రైవేట్ రంగం సహకారంతో ఉత్పాదకత, సామర్థ్య లాభాలు పెరుగుతాయని, దేశాభివృద్ధికి అవసరమైన అదనపు బొగ్గును ఉత్పత్తి చేయవచ్చని బొగ్గు మంత్రిత్వ శాఖ చాలా ఆశాభావం వ్యక్తం చేసింది. సీఐఎల్ తగిన సమయంలో రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ప్రైవేట్ రంగానికి ఇటువంటి 100 కంటే ఎక్కువ గనులను అందించాలని చూస్తోంది.
******
(Release ID: 1800929)
Visitor Counter : 173