సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన సర్వత్ర పూజ్యతేలో భాగంగా ధార- భారతీయ విజ్ఞాన వ్యవస్థకు ఆధారం - ఉపన్యాస ప్రదర్శనలు రేపటి నుంచి ప్రారంభం


సీరీస్ లో ముందుగా గణితానికి తరతరాలుగా భారతదేశం అందించిన సహకారంపై దృష్టి సారిస్తూ 'భారతదేశంలో గణిత శాస్త్రం ‘

Posted On: 24 FEB 2022 5:50PM by PIB Hyderabad

కీలక ప్రధానాంశాలు

2022 ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు సైన్స్ వీక్ లో భాగంగా ధార- భారతీయ విజ్ఞాన వ్యవస్థకు ఆధారం - అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పురాతన కాలం,  క్లాసికల్ పీరియడ్ , కేరళ స్కూల్ సేవలు, ముగింపు సెషన్ అనే నాలుగు సమాచార సెషన్ లు ఇందులో ఉన్నాయి.

2022 ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు జరుగుతున్న సైన్స్ వీక్ -విజ్ఞాన సర్వత్ర పూజ్యతే లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 'ధార, భారతీయ జ్ఞాన వ్యవస్థకు ఆధారం '  కార్యక్రమాన్ని ప్రకటించింది.  విజ్ఞాన సర్వత్ర పూజ్యతే అనే సైన్స్ పండుగ ను  ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఏర్పాటు చేశారు. మన చరిత్ర అవలోకనానికి  , భారతదేశం సాధించిన విజయాలను , గొప్ప పండితులు, గణిత శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు నాయకుల సేవలను తన వారసులకు తెలియ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఉద్దండ మేధావులు చేసిన ఉపన్యాస ప్రదర్శనల పరంపరను ధార కలిగి ఉంది. 'భారతదేశంలో గణితం'తో ఫిబ్రవరి 25న ధార ప్రారంభం కానుంది, ఇది తరతరాలుగా గణితానికి భారతదేశం అందించిన సేవలపై దృష్టి సారిస్తుంది.

ప్రారంభ సమావేశం ప్రేక్షకులకు  ‘ధార‘ పరిచయంతో మొదలవుతుంది. తరువాత ముఖ్య అతిథి ప్రసంగం , ప్రధాన వక్త శ్రీ మంజుల్ భార్గవ ప్రసంగం ఉంటాయి.

ప్రాచీన కాలం (జీరో & డెసిమల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, సులభ సూత్రాలలో జామిట్రీ, పింగళ చందస్ -శాస్త్ర లో కాంబినేషన్స్), క్లాసికల్ పీరియడ్ (భారతీయ ఆల్ జీబ్రా లో ల్యాండ్‌మార్క్‌లు, భారతదేశంలో ట్రీగ్నోమీట్రీ, భారత ఆల్జీబ్రాలో అనిర్దిష్ట సమీకరణాలు) , కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేరళ స్కూల్ (మాధవాస్ ఇన్ఫినిట్ సీరీస్ π (C) , కేలిక్యులస్ ఆఫ్

ట్రీగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ), ముగింపు సెషన్ (భారత గణిత శాస్త్రానికి మార్గదర్శక చరిత్రకారులు).అనే మొత్తం నాలుగు ఇన్ఫర్మేటివ్ సెషన్‌లు ఉంటాయి.

భారతదేశంలో గణితం చాలా సంపన్న, , సుదీర్ఘమైన , పవిత్రమైన చరిత్రను కలిగి ఉంది. గణితంలో అత్యంత ప్రాథమిక అంశమైన సంఖ్యల ప్రాతినిధ్యం నుండి, పునరావృత సంబంధాలను వ్యక్తీకరించడం ద్వారా, అనిశ్చిత సమీకరణాల పరిష్కారాలను చేరుకోవడం వరకు, అనంతమైన వాటిని నిర్వహించడంలో అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేయడం వరకు, భారతీయ గణిత శాస్త్రజ్ఞులు గణనీయమైన సహకారం అందించారు.

75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని, దాని ప్రజలు, సంస్కృతి విజయాల అద్భుతమైన చరిత్రను జరుపుకోవడానికి స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ ను  2021 మార్చి 12న ప్రారంభించింది. ఇది మన 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి 75 వారాల కౌంట్ డౌన్ ను ప్రారంభించింది. ఇది 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది.

ఈ ముఖ్యమైన సందర్భాన్ని పురస్కరించుకొని, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను దేశవ్యాప్తంగా , ప్రపంచవ్యాప్తంగా అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు విదేశాలలో ఉన్న మన సహచరుల భాగస్వామ్యంతో జరుపుకుంటున్నాము. ఈ వేడుక 'మొత్తం ప్రభుత్వం' (వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య సహకారం) అనే సూత్రం పై పలు కార్యక్రమాల రూపంలో జరుగుతోంది.  ఇంకా పూర్తి 'జన్ భాగిదారి‘ (ప్రజల భాగస్వామ్యం) తో వివిధ వేడుకలు జరుగుతున్నాయి.

ఇంకా చదవండి- నమోదు చేయండి: ధార | ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

మరిన్ని వివరాలను చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

                                                                

****


(Release ID: 1800927) Visitor Counter : 160