వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చిరుధాన్యాలకు పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ఆహార, పోషకాహార, ఆర్థిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించవచ్చు.. శ్రీ పీయూష్ గోయల్


చిరుధాన్యాల ఎగుమతులను ఎక్కువ చేసేందుకు నాలుగు సూచనలు అందించిన శ్రీ పీయూష్ గోయల్

రానున్న అయిదు సంవత్సరాల్లో 20 లక్షల హెక్టార్ల భూమిలో అంతర పంటగా నూనెగింజల సాగు.. శ్రీ పీయూష్ గోయల్

Posted On: 24 FEB 2022 3:46PM by PIB Hyderabad

దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తికి ప్రోత్సాహం, ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీజౌళి, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. దేశంలో యోగా తరహాలో చిరుధాన్యాలకు గుర్తింపు రావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. " చిరుధాన్యాలకు పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ఆహారపోషకాహారఆర్థిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించవచ్చును" అని శ్రీ గోయల్ వ్యాఖ్యానించారు. 

వ్యవసాయ రంగానికి  కేంద్ర బడ్జెట్ 2022 లో  కల్పించిన అంశాలను వివరించేందుకు ఏర్పాటు చేసిన వెబినార్ లో ప్రధామంత్రి శ్రీ నరేంద్ర మోదీ తరువాత శ్రీ గోయల్ ప్రసంగించారు. " ఆకర్షణీయ వ్యవసాయం : చిరుధాన్యాలకు పూర్వ వైభవం: వంటనూనెలు రంగంలో స్వయం సమృద్ధి" అనే అంశంపై  వెబినార్ లో శ్రీ గోయల్ మాట్లాడారు. 

చిరుధాన్యాల ఎగుమతుల రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయవచ్చునని శ్రీ గోయల్ అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు నాలుగు అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. "1. చిరుధాన్యాలకు ప్రాధాన్యత ఇస్తూ పంటల వైవిధ్యీకరణ కోసం కర్నాటక అమలు చేసిన పళ్ళ పెంపకం విధానాన్ని రాష్ట్రాలు అమలు చేయాలి. 2. నాణ్యమైన చిరుధాన్యాల సాగుకు అవసరమైన సాంకేతిక సహకారం పొందేందుకు వ్యవసాయ అంకుర సంస్థల సహకారం తీసుకోవాలి. 3.చిరుధాన్యాల వల్ల లభించే పోషక విలువలు, ఇతర ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. 4. భారత చిరుధాన్యాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకుని రావాలి" అని శ్రీ గోయల్ తన ప్రసంగంలో వివరించారు.  

భారతదేశంలో తొమ్మిది రకాల చిరుధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయని శ్రీ గోయల్ అన్నారు. ప్రపంచంలో చిరుధాన్యాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల జాబితాలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని అన్నారు. అదేవిధంగా చిరుధాన్యాల ఎగుమతుల్లో కూడా భారత్ ప్రపంచంలో రెండవ స్థానంలో ఉందని మంత్రి వివరించారు. 

రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని శ్రీ గోయల్ తెలిపారు. కనీస మద్దతు ధర చెల్లించి రైతుల నుంచి ప్రభుత్వం ఆహారధాన్యాలను సేకరిస్తున్నదని అన్నారు. దీనివల్ల  2021-22 ఖరీఫ్ పంట కాలంలో 64 లక్షల మంది రైతులు, 2021-22 రబీ పంట కాలంలో దాదాపు 48 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని అన్నారు. 

పది రాష్ట్రాల్లోని 100 జిల్లాల్లో వరి సాగులో ఉన్న నాలుగు లక్షల హెక్టార్ల భూమిని నూనె గింజల సాగులోకి తీసుకు రావాలని నిర్ణయించామని శ్రీ గోయల్ తెలిపారు. నూనె గింజల దిగుబడి 230 జిల్లాల్లో ఎక్కువగా ఉందని గుర్తించామని వివరించారు.  రానున్న అయిదు సంవత్సరాల్లో 20 లక్షల హెక్టార్ల భూమిలో అంతర పంటగా నూనెగింజల సాగు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి అన్నారు. 

'అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో భారతదేశం పనిచేస్తోంది. దీనిలో భాగంలో ప్రతి రైతు స్వావలంబన సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం" అని శ్రీ గోయల్ ప్రకటించారు. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి సాంకేతిక అంశాలతో వ్యవసాయాన్ని ఆకర్షణీయ రంగంగా అభివృద్ధి చేస్తామని శ్రీ గోయల్ అన్నారు. 

వ్యవసాయ పరిశోధన , విద్య విభాగం  కార్యదర్శి మరియు భారత వ్యవసాయ పరిశోధన మండలి  డైరెక్టర్ జనరల్  డాక్టర్. టి మహపాత్ర   మాట్లాడుతూ,2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించారని అన్నారు.  కోతల తరువాత  విలువ జోడింపుదేశీయ వినియోగాన్ని పెంపొందించడం మరియు జాతీయంగా మరియు అంతర్జాతీయంగాచిరుధాన్యాల ఉత్పత్తులను బ్రాండింగ్ చేయడం కోసం సహకారం అందిస్తామని ఆయన అన్నారు.   

 

చిరుధాన్యాల ప్రపంచ స్థితి: ప్రాంతం మరియు ఉత్పత్తి ప్రాంతాల వారీగా (2019)

 

ప్రాంతాలు

విస్తీర్ణం (లక్ష హెక్టార్లు)

ఉత్పత్తి (లక్ష టన్నులు) 

ఆఫ్రికా

489

423

అమెరికాలు

53

193

ఆసియా

162

215

యూరోప్

8

20

ఆస్ట్రేలియా  న్యూజిలాండ్

6

12

భారతదేశం

138

173

ప్రపంచం

718

863

·         భారతదేశం  170 లక్షల టన్నులకు పైగా  (ఆసియాలో 80% & ప్రపంచ ఉత్పత్తిలో 20%) ఉత్పత్తి చేస్తుంది.

·         ప్రపంచ సగటు దిగుబడి: హెక్టారుకు 1229 కేజీలుభారతదేశం (హెక్టారుకు 1239 కేజీలు).

 

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ డైరెక్టర్ విలాస్ టోనాపి 'అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి బ్లూప్రింట్ 2023' వివరించారునేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత ' చిరుధాన్యాల ఉత్పత్తుల పోషక విలువలు'పై మాట్లాడారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ క్యులినరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మంజిత్ గిల్ చిరుధాన్యాల వంటలు, వంటల ప్రచారం 'ఆనే ఆంశంపై ప్రసంగించారు. ఎన్‌ఐఎఫ్‌టిఎం డైరెక్టర్ డాక్టర్ సి. అనంత రామకృష్ణన్ ' చిరుధాన్యాల ఉత్పత్తుల విలువ జోడింపు, వంట నూనె రంగంలో ఆత్మనిర్భారత పై అతుల్ చతుర్వేది. 'సోయాబీన్‌లో స్వయం సమృద్ధౌపై ఎస్‌ఓపిఎ అధ్యక్షుడు  డేవిష్ జైన్,  ఆయిల్ పామ్ భవిష్యత్తు'పై గోద్రెజ్ ఆగ్రోవెట్ ఎండీ డాక్టర్ బలరామ్ సింగ్ యాదవ్ ప్రసంగించారు. 

***


(Release ID: 1800873) Visitor Counter : 222