రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

రేపు మూడ‌వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకోనున్న జాతీయ యుద్ధ స్మార‌క చిహ్నం

Posted On: 24 FEB 2022 1:18PM by PIB Hyderabad

జాతీయ యుద్ధ స్మార‌క చిహ్నం (నేష‌న‌ల్ వార్ మెమోరియ‌ల్ - ఎన్‌డ‌బ్ల్యుఎం) 25 ఫిబ్ర‌వ‌రి 2022న త‌న మూడ‌వ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకోనుంది. ఈ సంద‌ర్భంగా దేశం కోసం ప్రాణాల‌ను అర్పించిన అమ‌ర‌వీరులకు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ టు ది చైర్మ‌న్‌, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క‌మిటి (సిఐఎస్‌సి) ఎయిర్ మార్ష‌ల్ బి.ఆర్‌. కృష్ణ‌, భార‌త సైన్యం, భార‌తీయ నావికాద‌ళం, వైమానిక ద‌ళ వైస్ చీఫ్‌ల‌తో క‌లిసి ఎన్‌డ‌బ్ల్యుఎం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛాల‌ను ఉంచి నివాళులు అర్పించ‌నున్నారు. న్యూఢిల్లీలోని రోహిణికి చెందిన విఎస్‌పికె ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ విద్యార్ధుల‌తో క‌లిసి ఇంట‌ర్ సర్వీసెస్ బ్యాండ్‌ను ప్ర‌ద‌ర్శించి ప్రేక్ష‌కుల‌ను ముగ్ధుల‌ను చేయ‌నున్నారు. సాయంత్రం నెక్ట్స్ ఆఫ్ కిన్ ( స‌మీప బంధువు-ఎన్ఒకె) కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. అందులో మృతి చెందిన అమ‌ర‌వీరుని స‌మీప బంధువు లేదా కుటుంబ స‌భ్యులు ఆ సైనికుడు చేసిన అత్యున్న‌త త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ స్మార‌క చిహ్నం వ‌ద్ద పుష్ప‌గుచ్చాన్ని ఉంచుతారు. 
ఎన్‌డ‌బ్ల్యుఎం వ‌ద్ద పాఠ‌శాల విద్యార్ధులతో బ్యాండ్‌ను ప్ర‌ద‌ర్శింప‌చేయాల‌న్న నిర్ణ‌యాన్ని, చొర‌వ‌ను పాఠ‌శాల విద్యార్ధ‌/ల‌లో దేశ‌భ‌క్తి, విధుల ప‌ట్ల అంకిత భావం, సాహ‌సం, త్యాగాన్ని పెంపొందింప చేయాల‌న్న ల‌క్ష్యంతో జ‌రిగింది. పాఠ‌శాల పిల్ల‌లే కాక వ్య‌క్తులు, ముఖ్యంగా యువ‌త ఈ కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ‌డం ద్వారా యుద్ధ స్మార‌క చిహ్నానికి సంబంధించిన బ‌హు కోణాల‌ను అనుభూతిస్తార‌న్న భావ‌న‌తో ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. 
ఎన్‌డ‌బ్ల్యుఎం వ‌ద్ద 23 ఫిబ్ర‌వ‌రి 2022న బ్యాండ్ ప్ర‌ద‌ర్శ‌న‌ను నిర్వ‌హించిన తొలి ద‌పాఠ‌శాల శ్రీ థాకుర్ద్వారా బాలిక విద్యాల‌య‌, ఘాజియాబాద్‌. కోవిడ్‌-19  కార‌ణంగా నిలిపివేసిన ఎన్ఒకె కార్య‌క్ర‌మాన్ని 23 ఫిబ్ర‌వ‌రి 2022న తిరిగి ప్రారంభించారు. 
ఎన్‌డ‌బ్ల్యుఎంను 25 ఫిబ్ర‌వ‌రి 2019న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. స్వాతంత్య్రం  సాధించిన‌ప్ప‌టి నుంచీ  వీర సైనికులు చేసిన‌ సాహ‌సోపేత‌మైన త్యాగాల‌కు సాక్షిగా ఈ ప్ర‌దేశం నిలుస్తుంది. ఈ స్మార‌క చిహ్నంలో త‌మ విధుల‌లో భాగంగా చేసిన అత్యున్న‌త త్యాగానికి తార్కాణంగా శాశ్వ‌త జ్వాల అమ‌ర్ జ‌వాన్ జ్యోతి జ్వ‌లిస్తూ అత‌డిని అమ‌రుడిని చేస్తుంది. ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచీ, జాతీయ దినోత్స‌వాలు స‌హా నివాళులు అర్పించే కార్య‌క్ర‌మాలు అన్నీ ఎన్‌డ‌బ్ల్యుఎం వ‌ద్ద నిర్వ‌హిస్తున్నారు. 

***



(Release ID: 1800870) Visitor Counter : 115