ఆర్థిక మంత్రిత్వ శాఖ
రూ.38.5 కోట్ల పన్ను ఎగవేతతో కూడిన 611 కోట్ల రూపాయల నకిలీ ఇన్‌వాయిస్ రాకెట్‌ను ఢిల్లీ సౌత్ సిజిఎస్టీ వెలికితీసింది
Posted On:
24 FEB 2022 2:49PM by PIB Hyderabad
కేవలం నకిలీ ఇన్‌వాయిస్‌లను రూపొందించడం మరియు చైన్‌లో అనర్హమైన ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను పాస్ చేయడం కోసం మాత్రమే సృష్టించబడిన కొన్ని బోగస్ సంస్థల గురించి ఢిల్లీ సౌత్ సీజీఎస్టీ కమిషనరేట్ అధికారులు నిర్దిష్ట నిఘాను చేపట్టారు.
ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ ప్రాంతాల్లో సోదాలు మరియు తనిఖీలు నిర్వహించబడ్డాయి. నకిలీ ఇన్‌వాయిస్ మరియు సర్క్యులర్ ట్రేడింగ్‌లో నిమగ్నమై ఉన్న ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలో నమోదైన 54 బోగస్ సంస్థలను నడుపుతున్న కార్టెల్‌ను అధికారులు వెలికితీశారు. సెర్చ్ ప్రాంగణంలో రబ్బరు స్టాంపులు, వివిధ సంస్థల లెటర్ హెడ్‌లు, మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు మొదలైన నేరారోపణ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ లావాదేవీలపై ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక విచారణలో దాదాపు రూ. 611 కోట్లు మరియు పన్ను ఎగవేత రూ. 38.5 కోట్లను గుర్తించారు. కార్టెల్ సభ్యులు తమ నేర అంగీకార ప్రకటనలో ఈ బోగస్ సంస్థలను నిర్వహించడంలో తమ పాత్రలను అంగీకరించారు.
ఈ మోసపూరిత సంస్థల వెనుక ఉన్న వ్యక్తులు ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నారు మరియు సిజీఎస్టీ చట్టం 2017లోని సెక్షన్ 132(1)(బి) మరియు 132(1)(సి) కింద పేర్కొన్న నేరాలకు పాల్పడ్డారు. అవి గుర్తించదగినవి మరియు నాన్‌బెయిలబుల్. కార్టెల్ యొక్క ముగ్గురు ముఖ్య వ్యక్తుల్లో ఈ బూటకపు సంస్థల నిర్వహణ సూత్రధారి అంకిత్ గుప్తా మరియు అతని ఇద్దరు సహచరులు రబీంద్ర సింగ్ మరియు రాజేంద్ర సింగ్‌లను 23.02.2022న అరెస్టు చేశారు. నిందితులను డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించారు.
తదుపరి విచారణ పురోగతిలో ఉంది.
***
(Release ID: 1800866)
Visitor Counter : 142