రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావికాదళపు బహు జాతీయ విన్యాసాలు మిలన్-2022 25 ఫిబ్రవరి 2022న ప్రారంభం
Posted On:
23 FEB 2022 6:26PM by PIB Hyderabad
భారతీయ నావికాదళ బహువిధ విన్యాసాలు, మిలన్ (ఎంఐఎల్ఎఎన్) 2022, సిటీ ఆప్ డెస్టినీగా ప్రాచుర్యం పొందిన విశాఖపట్నంలో 25 పిబ్రవరి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. మిలన్ 22ను 9 వ్యవధిలో రెండు దశలలో నిర్వహించనున్నారు. తొలి దశ నౌకాశ్రయం దశ (హార్బర్ ఫేజ్) 25 నుంచి 28 ఫిబ్రవరి వరకు, సముద్ర దశ 01 నుంచి 04 మార్చి వరకు సాగనున్నాయి. భారత్ 2022లో స్వాతంత్య్రం సాధించిన 75 సంవత్సరాల సందర్భంగా వేడుకలను జరుపుకుంటోంది. మిత్రులు, భాగస్వాములతో ఈ మైలు రాయిని స్మారకోత్సవంగా జరుపుకునేందుకు మిలన్ 22 అవకాశాన్ని అందిస్తోంది. మిలన్ 2022 ఇతివృత్తం- మిత్రత్వం- ఐక్యత- సహకారం (కామ్రేడరీ- కోహెషన్- కొలాబొరేషన్) భారత్‌ను ప్రపంచంలోనే బాధ్యత కలిగిన సముద్ర శక్తిగా చూపడం అన్న లక్ష్యంతో రూపొందిచారు. మిత్రత్వం కలిగిన నౌకాదళాల మధ్య వృత్తిపరమైన పరస్పర చర్య ద్వారా, కార్యాచరణ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఉత్తమ అభ్యాసాలను, విధానాలను గ్రహించడం, సముద్ర పరిధిలో సిద్ధాంతపరమైన అభ్యాసాన్ని ప్రారంభించడం ఈ విన్యాసాల లక్ష్యం.
మిలన్ గురించి
భారతీయ నావికాదళం 1995లో అండమాన్, నికోబార్ దీవులలో మిలన్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇది ద్వైవార్షిక బహుళ విధ నౌకాదళ విన్యాసంగా సాగుతోంది. ఈ విన్యాసాలను ఒక్క 2001, 2005, 2016, 2020 మినహా వరుసగా నిర్వహించారు. అంతర్జాతీయ నౌకాదళ సమీక్షల కారణంగా 2001, 2016 ఎడిషన్లను నిర్వహించలేదు, 2005లో జరుగవలసిన విన్యాసాలను 2004లో సంభవించిన సునామీ కారణంగా 2006వరకు వాయిదా వేశారు. కాగా, 2020 ఎడిషన్‌ను కోవిడ్-19 కారణంగా 2022కు వాయిదా వేశారు.
కేవలం నాలుగు దేశాలు- ఇండినేషియా, సింగపూర్, శ్రీలంక్, థాయ్‌లాండ్‌ల భాగస్వామ్యంతో 1995లో ప్రారంభమైన ఈ విన్యాసాలు భాగస్వామ్య సభ్యుల సంఖ్యలు, విన్యాసాల సంక్లిష్టతల పరంగా పలు రెట్లు పెరిగాయి.
వాస్తవంలో భారతదేశ విధానమైన లుక్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా రూపొందించిన మిలన్, తర్వాత సంవత్సరాలలో పశ్చిమ ఐఒఆర్, ఐఒఆర్ సముద్రతీరాలను కూడా భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ పాలసీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ రీజియన్స్ (అన్ని ప్రాంతాల భద్రత, వృద్ధి- ఎస్ఎజిఎఆర్) చొరవ కలుపుకుపోయింది. కేవలం ఆరు దేశాల భాగస్వామ్యం నుంచి 2014 నాటికి ఐఒఆర్ సముద్రతీరాలు సహా18 దేశాలకు పెరిగింది. స్నేహపూర్వకమైన విదేశాలతో (ఎఫ్ఎఫ్‌సిలు) భారతీయ నావికాదళ ప్రయత్నాల కారణంగా, దశబ్దాలలో విస్తరించడం ద్వారా మిలన్ విన్యాసాల స్థాయిని, సంక్లిష్టతను మెరుగుపరచడమే కాక, ప్రంపంచంలోని ప్రాంతీయ, విస్తరిత ప్రాంతీయ నావికాదళలతో సహకారాన్ని మరింత పటిష్టం చేయవలసిన అవసరం ఏర్పడింది. పెద్ద స్థాయిలో నౌకాదళాలను ఒక చోటకు తీసుకువచ్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను పరిగణనలోకి తీసుకొని విన్యాసాల వేదికను మార్చాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈస్టర్న్ నావల్ కమాండ్ కేంద్ర కార్యాలయం అయిన విశాఖపట్నం ఆతిథ్యం ఇచ్చేందుకు నామినేట్ అయింది.
ప్రస్తుత ఎడిషన్
దాదాపు 40కి పైగా దేశాలు యుద్ధనౌకలను, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల భాగస్వామ్యంతో మిలన్ 22 అతి భారీ కార్యక్రమంగా సాగనుంది. ఈసారి మిలన్ ఎడిషన్ పరిధి &సంక్లిష్టతల పరంగా భారీగా ఉండటమే కాక, ఉపరితల, ఉప-ఉపరిత, ఆకాశం, ఆయుధాల ప్రయోగాలతో కూడిన విన్యాసాలుగా నిర్వహించడంపై దృష్టి పెట్టారు. తమ సముద్ర తీర భద్రతపై తమ అభిప్రాయాలను పాలుపంచుకుంటున్న నౌకాదళాలు/ ప్రతినిధులు వెల్లడించడానికి అవకాశాన్ని కల్పించే విధంగా కార్యాచరణ సమావేశాలు, సెమినార్లను కూడా నిర్వహించనున్నారు. ఉన్నత స్థాయి విదేశీ ప్రతినిధులలో నావికాదళ అత్యున్నత స్థాయి అధికారులు, ఏజెన్సీ అధిపతులు, రాయబారులు, ఆ స్థాయికి సమానమైనవారు పాల్గొననున్నారు.
కీలక కార్యక్రమాలు
ఫిబ్రవరి 26న మిలన్ 22 ప్రారంభ వేడుకల అనంతరం మిలన్ గ్రామాన్ని ప్రారంభించే విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక ఫిబ్రవరి 27 సాయంత్రం విదేశీ నౌకాదళాల భాగస్వామ్యంతో అంతర్జాతీయ నగర కవాతు, అనంతరం నావికాదళ కార్యకలాపాల ప్రదర్శనను నిర్వహించనున్నారు. మిలన్ 22లో భాగంగా 27-28న సహకారం ద్వారా సామూహిక సముద్ర సామర్ధ్య వినియోగం అన్న ఇతివృత్తంపై అంతర్జాతీయ నౌకాదళ సెమినార్‌ను నిర్వహించనున్నారు. దీనితో పాటుగా వృత్తిపరమైన / విషయాంశంలో నిపుణుల మధ్య అభిప్రాయాల మార్పిడి, డిఎస్ఆర్‌వి ప్రదర్శనలు, యువ అధికారుల మిలన్, క్రీడలు, విదేశీ పర్యాటకులకు ఆగ్రా, బోధగయకు సాంస్కృతిక పర్యటనలు కూడా ఇతర కార్యకలాపాలలో భాగంగా ఉండనున్నాయి. తమ నౌకలు, విమానాలతో పాలుపంచుకుంటున్న దేశాలతో కూడిన విన్యాసాలు 01-04 మార్చి వరకు జరుగనున్నాయి.
సముద్రాల వ్యాప్తంగా బంధాలను ప్రోత్సహించడం
భారతీయ నావికాదళం అన్నది కేవలం శక్తిని ప్రదర్శించేందుకు మాత్రమే కాక దౌత్యపరమైన విస్తరణకు ఒక పరికరం. ఈ క్రమంలో వివిధ నావికాదళాలను ఒక చోటకు చేర్చడం కోసం సంయుక్త/ బహువిధ విన్యాసాలను నిర్వహించడం ఒక అంశం. నావికాదళాలు భిన్న ప్రాంతాలలో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, అందరికీ సమస్య అయిన సముద్రపు దోపిడీదొంగలకు వ్యతిరేకంగా, హెచ్ ఎడిఆర్ మిషన్లు, సముద్ర తీర భద్రత తదితర అంశాలలో సహకరించుకోవడం ఎప్పుడూ అవసరం. నౌకాదళాల మధ్య పరస్పర చర్య అన్నది సముద్ర దళాల మధ్య పరస్పర అవగాహనను, సహకారాన్ని, పరస్పర మద్దతును పెంచుతాయి. మహా సముద్రాల వ్యప్తంగా తీరప్రాంత సౌభ్రత్వాన్ని పెంపొందించేందుకు మిలన్ 22 అన్నది అమూల్యమైన అవకాశాన్ని అందిస్తుంది.
***
(Release ID: 1800663)
Visitor Counter : 332