మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (ఆర్‌యుఎస్ఎ) పథకాన్ని మార్చి 31, 2026 వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
Posted On:
18 FEB 2022 5:07PM by PIB Hyderabad
రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (ఆర్‌యుఎస్ఎ)ను 31.03.2026 లేదా తదుపరి సమీక్ష వరకు, ఏది ముందు అయితే దానిని కొనసాగించడాన్ని
అమలు చేసేందుకు ప్రభుత్వం అంగీకారాన్ని తెలిపింది. ఈ ప్రతిపాదనను రూ 1229.16 కోట్ల వ్యయంతో అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ. ర8120.97 కాగా, రాష్ట్ర వాటా రూ. 4808.19 కోట్లుగా ఉండనుంది. ఈ పథఖం నూతన దశ కింద 1600 ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుందని అంచనా.
రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలలో సమానత్వం, అందుబాటు, శ్రేష్టతను సాధించాలన్న లక్ష్యంతో నిధులను అందించేందుకు మిషన్ మోడ్‌లో నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం (సిఎస్ఎస్) అయిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (ఆర్‌యుఎస్ఎ) ఒక విస్త్రత పథకం.
ఆర్‌యుఎస్ఎ నూతన పథకం ఇంతవరకూ సేవలు అందించని, తక్కువ సేవలు అందిస్తున్న ప్రాంతాలు, మారుమూల, గ్రామీణ ప్రాంతాలు, క్లిష్టతరమైన భౌగోళిక ప్రాంతాలు, ఎల్‌డబ్ల్యు ప్రాంతాలు, ఎన్ ఇఆర్, ఆకాంక్షాత్మక జిల్లాలు, టైర్-2 నగరాలు, జిఇఆర్ తక్కువగా ఉన్న ప్రాంతాలను చేరుకుని, అత్యంత వెనుకబడిన ప్రాంతాలు, ఎస్ ఇడిజిలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో పని చేస్తుంది.
నూతన విద్యా విధానంలోని కొన్ని సూచనలను అమలు చేసే లక్ష్యంతో పథకంలోని నూతన దశను రూపకల్పన చేశారు. నూతన విద్యా విధానం ప్రస్తుత ఉన్నత విద్యా వ్యవస్థను పునరుద్ధరించి, తిరిగి శక్తివంతం చేయడం ద్వారా సమానత్వం, కలుపుకుపోతూ నాణ్యమైన ఉన్నత విద్యను అందించడానికి కొన్ని కీలక మార్పులను సూచించింది. \
పథకంలోని నూతన దశ కింద జెండర్‌ను కలుపుకుపోవడం, సమానత్వ చొరవలు, ఐసిటి, వృత్తివిద్యలు, స్కిల్ అప్ గ్రడేషన్ ద్వారా ఉపాధిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతును అందించనున్నారు. అంతేకాకుండా నూతన మోడల్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలకు తోడ్పాటును అందించనున్నారు. అలాగే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బహుశాస్త్ర సంబంధిత విద్య, పరిశోధనను పెంచేందుకు సాయం చేయనున్నారు. భారతీయ భాషలలో బోధన- అభ్యాసంతో సహా పలు కార్యకలాపాలను చేపట్టేందుకు గుర్తింపు ఉన్న, గుర్తింపు లేని విశ్వవిద్యాలయాలు, కళాశాలలను బలోపేతం చే సేందుకు గ్రాంట్లను అందించనున్నారు.
***
(Release ID: 1799571)
Visitor Counter : 196