రైల్వే మంత్రిత్వ శాఖ
సూరత్ మరియు వాపి మధ్య జరుగుతున్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ కార్యకలాపాలను శ్రీమతి దర్శన జర్దోష్ పరిశీలించారు
Posted On:
17 FEB 2022 7:25PM by PIB Hyderabad
రైల్వేలు మరియు జౌళి శాఖ సహాయ మంత్రి శ్రీమతి దర్శన జర్దోష్ సూరత్ మరియు వాపి మధ్య ఉన్న ప్రాజెక్ట్ సైట్ వద్ద ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్వే పనులను ఈరోజు పరిశీలించారు.
గౌరవ మంత్రి గారు నవ్‌సారి జిల్లా పద్గా గ్రామం వద్ద సిహెచ్ 243 దగ్గర ఉన్న కాస్టింగ్ యార్డ్‌తో పర్యటనను ప్రారంభించారు. ఇందులో భాగంగా సీహెచ్ పి42 మరియు పి23 వద్ద పైల్ క్యాప్ కాస్టింగ్‌తో సహా కాస్టింగ్‌ల కోసం ప్లాన్ చేయబడిన గిర్డర్ కాస్టింగ్ సన్నాహక పనులను పరిశీలించారు.
తదుపరి స్టాప్ కాస్టింగ్ యార్డ్ సిహెచ్.238 (విలేజ్ నాసిల్‌పోర్, జిల్లా నవ్‌సారి) అక్కడ ఆమె 1100 టి కెపాసిటీ గల స్ట్రాడిల్ క్యారియర్ మరియు బ్రిడ్జ్ గ్యాంట్రీల వంటి భారీ పరికరాలను చూశారు.
గౌరవనీయ మంత్రి సందర్శించిన మరొక కాస్టింగ్ యార్డు సిహెచ్ 232 (కచ్చోల్ గ్రామం, నవ్‌సారి జిల్లా) పూర్తి స్పాన్ గిర్డర్‌ను కాస్టింగ్ చేయడం, రెడీమేడ్ స్టీల్ ప్లాంట్ (ఆర్ఎంఎస్) ప్లాంట్ ఆపరేషన్, స్టీల్ మరియు రింగ్/స్టిరప్ మేకింగ్ ప్లాంట్‌ను ఆటోమేటిక్ కటింగ్ మరియు పత్రి జిల్లా వల్సాద్ గ్రామంలో సిహెచ్ 197 నుండి 195 వరకూ ఉన్న వయాడక్ట్ పైర్‌లను తనిఖీ చేశారు.
గౌరవనీయులైన మంత్రి తన పర్యటనలో చివరగా దామన్ గంగా నది బ్రిడ్జి శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశాన్ని కూడా సందర్శించారు.
అదనపు సమాచారం:
ఎంఏహెచ్ఎస్ఆర్ నిర్మాణ కార్యకలాపాల్లో కొన్ని ముఖ్యమైన అంశాలు:
- గుజరాత్ రాష్ట్రంలో (352కిమీ) 100% సివిల్ టెండర్లు భారతీయ కాంట్రాక్టర్లకు ఇవ్వబడ్డాయి.
- 98.6% భూమిని సేకరించారు మరియు మొత్తం 352కి.మీలో సివిల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
- గుజరాత్ రాష్ట్రంలో (352 కి.మీ), 98.6% భూమిని సేకరించారు మరియు మొత్తం 352 కి.మీలో సివిల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో 62% భూమిని సేకరించారు.
- పైల్స్, పునాదులు, పీర్స్, పైర్ క్యాప్స్, వయాడక్ట్ & స్టేషన్ల కోసం గిర్డర్‌ల కాస్టింగ్ & ఎరక్షన్‌పై పనులు గుజరాత్‌లోని 8 జిల్లాల గుండా వెళుతున్నాయి.
- 352 కి.మీలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ పని 325 కి.మీ పొడవులో పూర్తయింది.
- జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడం కోసం ఆసియాలోనే అతిపెద్ద జియోటెక్నికల్ ల్యాబ్ సూరత్‌లో అభివృద్ధి చేయబడింది.
- 110 కి.మీ పొడవునా పైల్స్, పైల్ క్యాప్స్, ఓపెన్ ఫౌండేషన్స్, వెల్ ఫౌండేషన్స్, పీర్స్, పీర్ క్యాప్స్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
- 352 కి.మీలలో, 81 కి.మీ పొడవులో శంకుస్థాపన పూర్తయింది, 30 కి.మీ పొడవులో ఫౌండేషన్ పూర్తయింది మరియు 20 కి.మీ పొడవులో పీర్ పూర్తయింది.
***
(Release ID: 1799177)
Visitor Counter : 185