సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

విజయ గాథ: వ్యాపార‌వేత్త‌లుగా మారేందుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న పీఎంఈజీపీ పథకం

Posted On: 17 FEB 2022 3:22PM by PIB Hyderabad

పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) పథకం నర్దీప్ సింగ్ విజయవంతమైన వ్యాపారవేత్తగా మారడానికి సహాయపడింది. తన విజయం గురించి గర్వంగా నర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. “నేను ఉద్యోగం కోసం చాలా కష్టపడ్డాను కానీ విజయం సాధించలేకపోయాను. విసిగిపోయి, నేను జమ్మూ మరియు కాశ్మీర్ ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డు, ఉధంపూర్ శాఖ‌ను సంప్రదించాను, అందులో జిల్లా అధికారి నాకు  పీఎంఈజీపీ స్కీమ్ గురించి వివరించారు. నన్ను ఒప్పించి, నాలోని వ్యవస్థాపకుడిని ఉత్తేజపరిచారు. నేను హైడ్రాలిక్ ఎక్విప్‌మెంట్ యూనిట్ తయారీకి రూ. 24.96 లక్షల రుణ సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఈ కేసును చివరికి డీఎల్‌టీఎఫ్‌సీ (జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ) ఆమోదించింది. జీవితంలో అపజయాలు ఎదురైనప్పటికీ, నా మనస్సాక్షితో నేనెప్పుడూ రాజీపడలేదు. నేను రిస్క్ తీసుకున్నాను. చివరికి అది ఫలించింది. ఈ రోజు, నేను నా స్వంత సరిహద్దులను నిరంతరం ముందుకు తీసుకువెళ్ల‌డానికి  ప్రయత్నిస్తున్నాను." ప్రస్తుతం నర్దీప్ సింగ్ స్థానికంగా 25 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారు. ఎంఎస్ఎంఈ  మంత్రిత్వ శాఖ 2008-09 నుండి ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంను (పీఎంఈజీపీ) ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కేవీఐసీ)  జాతీయ స్థాయిలో నోడల్ ఏజెన్సీగా నిర్వ‌హిస‌స్తోంది. దేశంలో వ్యవసాయేతర రంగాలలో సూక్ష్మ-సంస్థలను స్థాపించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ఈ ప‌థ‌కాన్ని అమలు చేస్తోంది.
                                                                                 

****


(Release ID: 1799151) Visitor Counter : 206