సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శీతాకాలం నుంచి పర్యాటక ఆకర్షణగా లడఖ్‌లో మంచు శిల్ప కళాకృతుల ప్రదర్శన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


లడఖ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి "లేహ్ బెర్రీ" అని కూడా పిలువబడే సీ బక్‌థార్న్ బెర్రీ వాణిజ్య సాగు ప్రారంభం.. డాక్టర్ జితేంద్ర సింగ్

కేంద్రపాలిత లడఖ్ లోఅభివృద్ధి మరియు పరిపాలనకు సంబంధించిన వివిధ అంశాలపై డాక్టర్ జితేంద్ర సింగ్‌ తో చర్చించిన లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కే .మాథుర్

Posted On: 14 FEB 2022 5:49PM by PIB Hyderabad

పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ శీతాకాలం నుంచి లడఖ్ లో మంచు శిల్ప కళాకృతుల ప్రదర్శనను నిర్వహిస్తామని కేంద్ర శాస్త్ర, సాంకేతిక, సిబ్బంది వ్యవహారాల, పెన్షన్లు, అంతరిక్ష, అణుశక్తి మంత్రిత్వ శాఖ సహాయ (స్వతంత్ర బాధ్యత) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. కేంద్రపాలిత  లడఖ్‌   లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ ఆర్.కే .మాథుర్ తో లడఖ్ కు సంబంధించి పరిపాలన, అభివృద్ధి అంశాల పై డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన డాక్టర్ జితేంద్ర సింగ్  పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ శీతాకాలం నుంచి లడఖ్ లో మంచు శిల్ప కళాకృతుల ప్రదర్శనను నిర్వహిస్తామని తెలిపారు. దీనివల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. 

ప్రపంచంలో ఆదరణ పొందిన మంచు శిల్ప కళాకృతుల కళను లడఖ్‌లో నిర్వహించేందుకు సీఎస్ఐఆర్ నుంచి సహకారం అందించాలని మంత్రికి లెఫ్టినెంట్   గవర్నర్ శ్రీ ఆర్.కే .మాథుర్ విజ్ఞప్తి చేశారు. ఈ కళను స్థిరీకరించిన తర్వాత  రాబోయే సంవత్సరాల్లో  లడఖ్ లో ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఉత్సవాన్ని  నిర్వహిస్తామని  ఆయన చెప్పారు.

మంచు కళాకృతుల ఉత్సవ నిర్వహణపై నిర్వహించిన ముగింపు సమావేశం 2022 ఫిబ్రవరి 11న జరిగింది. లడఖ్ పోలీస్ సహకారంతో దీనిని కాంగ్సింగ్ స్నో అండ్ ఐస్ స్కల్ప్చర్ అసోసియేషన్ చిల్లింగ్‌కు వెళ్లే మార్గంలో సోగ్‌స్టి సమీపంలోని సంగ్‌తక్చాన్‌లో నిర్వహించింది. ముగింపు సమావేశంలో  లడఖ్ లెఫ్టినెంట్   గవర్నర్ శ్రీ ఆర్.కే .మాథుర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ మాథుర్ శీతాకాలంలో లడఖ్ ను వదిలి వెళ్లకుండా ఆదాయం ఆర్జించేందుకు ప్రయత్నించాలని అన్నారు. 

వాణిజ్య అవసరాల కోసం  "లేహ్ బెర్రీ" సాగును చేపట్టాలని నిర్ణయించిన లడఖ్ పరిపాలనా యంత్రాంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. "లేహ్ బెర్రీ" వాణిజ్య సాగు ఈ ఏడాది ఏప్రిల్-మే నెలలో ప్రారంభమవుతుంది. శీతల ప్రాంతాల్లో మాత్రమే పండే "లేహ్ బెర్రీ" ఉత్పత్తులను కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(  సీఎస్ఐఆర్ ) ప్రోత్సహిస్తోంది. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు అనేక అవకాశాలు లభించడంతో స్థానికులకు జీవనోపాధి లభిస్తుంది. "లేహ్ బెర్రీ"కు మూలాధారమైన 'సీ బక్‌థార్న్‌'ను విస్తృతంగా సాగు చేయాలని 2018 మే నెలలో తన లడఖ్ పర్యటనలో   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన అంశాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసారు. స్థానిక రైతులు, స్వయం సహాయక బృందాలు ఉపయోగించడానికి అనువుగా ఉండే పరికరాలను సీఎస్ఐఆర్  రూపొందించి అభివృద్ధి చేస్తుందని మంత్రి వెల్లడించారు.  ప్రస్తుతం వైల్డ్ సీ బక్‌థార్న్ ప్లాంట్ నుండి 10% కాయలు మాత్రమే తీస్తున్నారని మంత్రి అన్నారు. 

వైల్డ్ సీ బక్‌థార్న్ ఉపయోగించి జామ్‌లు, జ్యూస్‌లు, హెర్బల్ టీ, విటమిన్ సి పోషకాలు , హెల్తీ డ్రింక్, క్రీమ్, ఆయిల్, సబ్బులు వంటి 100 రకాల ఉత్పత్తులను ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు స్థానిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. సేంద్రీయ పద్ధతుల్లో సాగే ఈ కార్యక్రమాల వల్ల ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. 

 

 ఈ వసంత రుతువులో 15,000 అడుగుల ఎత్తులో వాణిజ్యపరంగా మూడు ఔషధ మొక్కల పెంపకం ప్రారంభమవుతుందని శ్రీ మాథుర్ తెలియజేశారు.  ఇందులో "సంజీవని బూటీ" కూడా ఉంది. దీనిని  స్థానికంగా "సోలా" అని పిలుస్తారుఇది చాలా  ప్రాణాలను రక్షించే మరియు చికిత్స లక్షణాలను కలిగి ఉంది.

పండ్లు మరియు కూరగాయల సంరక్షణ/జీవిత కాలం  పొడిగింపు కోసం  లడఖ్‌   లో   గామా రేడియేషన్ టెక్నాలజీ తో అణుశక్తి మంత్రిత్వ శాఖ   సౌకర్యాలను ఏర్పాటు చేస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్  తెలియజేశారు.  దుబాయ్‌కి తొలిసారిగా భారీ మొత్తంలో నేరేడు పండు ఎగుమతి కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

ప్రసిద్ధ పాష్మినా మేకల వ్యాధుల చికిత్స కోసం లేహ్ మరియు కార్గిల్‌లో ఒక్కొక్కటి రెండు చొప్పున 4 శిక్షణా వర్క్‌షాప్‌లను నిర్వహించిన  సీఎస్ఐఆర్ ను   డాక్టర్ జితేంద్ర సింగ్  అభినందించారు.  లడఖ్‌లోని చార్తాంగ్‌లో 4 లక్షలకు పైగా జంతువులు ప్రధానంగా పష్మినా మేకలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలు  జీవనోపాధికి ఎక్కువగా పొందుతున్నారు. 

పష్మినా మేకలు, గొర్రెలు మరియు జడల బర్రె లలో   జింక్ విలువలు  అంచనా వేయడానికి  సీఎస్ఐఆర్   సీనియర్ శాస్త్రవేత్తల ఉన్నత స్థాయి బృందం ఈ వేసవిలో లడఖ్‌ను సందర్శిస్తుందనిశ్రీ మాధుర్‌ కు  డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

కొత్తగా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.   లడఖ్‌ లో   విశ్వవిద్యాలయంవృత్తి విద్యా కళాశాలలు మరియు ఇతర సంస్థల ఏర్పాటుకు అనుమతులు  మంజూరు అయ్యాయని అన్నారు.   జోజిలా పాస్‌ను ప్రారంభించడం స్థానిక ప్రజలకు ఎంతో ఊరటనిస్తోందన్నారు.

సిబ్బంది వ్యవహారాలుప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ  ద్వారా అధికారులు మరియు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై సానుకూలంగా  స్పందించిన మంత్రికి లెఫ్టినెంట్ గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు సిబ్బంది వ్యవహారాలుప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ   ఇప్పటికే రెండు విస్తృతమైన శిక్షణా సమావేశాలు నిర్వహించింది.  కొత్త కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్ట్‌లు, పథకాలను  ప్రారంభించిన దృష్ట్యా లడఖ్‌లో ఎక్కువ సంఖ్యలో ఐఏఎస్  క్యాడర్ అధికారులను నియమించాలని కూడా ఆయన అభ్యర్థించారు.

 ప్రతి సమస్య పరిష్కారం కోసం సహకారం అందిస్తున్న  కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లెఫ్టినెంట్ గవర్నర్  కృతజ్ఞతలు తెలిపారు

***


(Release ID: 1798394) Visitor Counter : 142