వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
షాలోట్స్ ఎగుమతులు 2013 నుండి 487% వృద్ధితో జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
పైనాపిల్ ఎగుమతులు 2013 నుండి 100% వృద్ధితో విజృంభించాయి
భారతదేశ సరుకుల ఎగుమతులు జనవరి 2022లో సుమారు యూఎస్‌డీ 336 బిలియన్లను తాకాయి
ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు తీసుకుంటోంది
Posted On:
14 FEB 2022 4:31PM by PIB Hyderabad
భారతదేశ షాలోట్స్ ఎగుమతి 2013 నుండి 487% వృద్ధిని సాధించింది. 2013 ఏప్రిల్-డిసెంబర్‌లో ఎగుమతులు 2 మిలియన్ల అమెరికన్ డాలర్లు ఉండగా నుండి 2021 ఏప్రిల్-డిసెంబర్ లో అవి 11.6 యూఎస్‌డీ మిలియన్లకు పెరిగాయి.
ఏప్రిల్-డిసెంబర్ 2021లో ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు శ్రీలంక (35.9%), మలేషియా (29.4%), థాయిలాండ్ (12%), యు అరబ్ ఇ (7.5%) & సింగపూర్ (5.8%).
భారతదేశం యొక్క పైనాపిల్ ఎగుమతి కూడా ఏప్రిల్-డిసెంబర్ 2013లో యూఎస్‌డీ 1.63 మిలియన్లతో పోలిస్తే ఏప్రిల్-డిసెంబర్ 2021లో దాదాపు 100% పెరిగి యూఎస్‌డి 3.26 మిలియన్లకు చేరుకుంది.
ఏప్రిల్-డిసెంబర్ 2021లో పైనాపిల్ ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలు యూఏఈ (32.2%), నేపాల్ (22.7%), ఖతార్ (16.6%), మాల్దీవులు (13.2%) మరియు యూఎస్‌ఏ (7.1%).
భారతదేశం ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. జనవరి 2021లో భారతదేశ సరుకుల ఎగుమతి యూఎస్‌డి 27.54 బిలియన్లు ఉంటే అది జనవరి 2022లో 23.69% పెరిగి యూఎస్‌డి 34.06 బిలియన్లకు చేరిందని గమనించవచ్చు; జనవరి 2020లో యూఎస్‌డి 25.85 బిలియన్ల కంటే 31.75% పెరుగుదలను నమోదు చేసింది.
2021-22 (ఏప్రిల్-జనవరి)లో భారతదేశ సరుకుల ఎగుమతి 2020-21 (ఏప్రిల్-జనవరి)లో యూఎస్‌డి 228.9 బిలియన్ల కంటే 46.53% పెరిగి యూఎస్‌డి 335.44 బిలియన్లకు చేరుకుంది; 2019-20 (ఏప్రిల్-జనవరి)లో యూఎస్‌డి 264.13 బిలియన్ల కంటే 27.0% పెరుగుదలను సూచిస్తుంది.
ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం అనేక చురుకైన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మహమ్మారి సమయంలో ఎగుమతి రంగం ఎదుర్కొంటున్న అవరోధాలు, అడ్డంకులు మరియు ఇబ్బందులను తొలగించడంలో సహాయపడటానికి ఎగుమతి పర్యవేక్షణ డెస్క్ ఏర్పాటు చేయబడింది.
రిడెండెన్సీలు మరియు కాలం చెల్లిన నిబంధనలను తొలగించడానికి వాణిజ్య శాఖ ఆధ్వర్యంలోని వివిధ చట్టాలు సమీక్షించబడుతున్నాయి.
అనేక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కొనసాగిస్తున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి (ఓడిఓపీ) వంటి కార్యక్రమాల ద్వారా భారతదేశంలోని ప్రతి జిల్లాను ఎగుమతి కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొదటి మరియు చివరి మైలు కనెక్టివిటీ సమస్యలను పరిష్కరించడానికి పేలోడ్ మోసే డ్రోన్‌లను ఉపయోగించడం వంటి వినూత్న చర్యలు తీసుకోబడుతున్నాయి.
రేషనలైజేషన్ మరియు డీక్రిమినలైజేషన్ ద్వారా సమ్మతి భారాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టబడుతున్నాయి.
వివిధ ఎగుమతిదారుల-ఆధారిత పథకాల ద్వారా ఎగుమతిదారులకు మద్దతు కూడా అందించబడుతోంది.
విశ్వసనీయ సరఫరాదారుగా భారతదేశం యొక్క గ్లోబల్ స్టాండింగ్‌ను మెరుగుపరచడానికి భారత ఎగుమతుల బ్రాండింగ్ విలువను పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది మరియు ప్రపంచ విలువ గొలుసుతో దేశాన్ని సమం చేయడానికి చురుకైన చర్యలు చేపట్టడం జరిగింది.
ఎగుమతిదారులకు లైసెన్సింగ్ అందించడానికి మరియు వారి ఫిర్యాదులను పరిష్కరించడానికి ఐటీ ఆధారిత ప్లాట్‌ఫారమ్ కూడా పనిలో ఉంది.
****
(Release ID: 1798321)
Visitor Counter : 129