వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
స్థాయి, నాణ్యత, ఉపాధి కల్పన కేంద్ర బిందువుగా అన్ని ప్రయత్నాలు సాగాలి... ఐఐటీ విద్యార్థులకు శ్రీ పీయూష్ గోయల్ సూచన
"రైతులు, చేతివృత్తులు, నేత కార్మికులు, చిన్న చిల్లర వ్యాపారులు మొదలైన వారికి వినూత్న పరిష్కారాలను అందించి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను సాధించడంలో సహాయపడండి" -ఐఐటీ కాన్పూర్ విద్యార్థులకు శ్రీ గోయల్ పిలుపు
"డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను అధ్యయనం చేసి (ఉదా. సింగిల్ విండో, పిఎం గతిశక్తి, ఓఎన్‌డిసి) చేసి సలహాలు అందించండి " - శ్రీ గోయల్
భారత దేశంలోని మారుమూల ప్రాంతాలకు సంక్షేమ ఫలాలు అందించడంలో సాంకేతికత పెద్ద పాత్ర పోషిస్తుంది: శ్రీ పీయూష్ గోయల్
“ప్రధాని మోదీ ప్రసంగాలు యువత ఆలోచనా దృక్పధంలో మార్పులు తెచ్చింది”: శ్రీ గోయల్
ఐఐటీ కాన్పూర్ విధాన రూపకల్పన సదస్సులో ప్రసంగించిన శ్రీ గోయల్
Posted On:
13 FEB 2022 5:10PM by PIB Hyderabad
దేశంలో మారుమూల ప్రాంతాలకు సంక్షేమ పథకాల ఫలాలు అందించడంలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుందని కేంద్ర వాణిజ్యం , పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం , ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. టెలిమెడిసిన్ ద్వారా ఆరోగ్య సంరక్షణ, ఎడ్టెక్ ద్వారా విద్య వంటి ప్రాథమిక సౌకర్యాలను ప్రజలందరికి అందించే అంశంలో సాంకేతికత సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఈరోజు జరిగిన ఐఐటి కాన్పూర్ విధాన రూపకల్పన సదస్సులో శ్రీ గోయల్ పాల్గొన్నారు . సదస్సు అనంతరం శ్రీ గోయల్ విద్యార్థులతో మాట్లాడారు. వివిధ సాంకేతిక అంశాలు, వాటి ప్రయోజనాలపై ఆయన మాట్లాడారు. “ఉదాహరణకు, డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌వర్క్ అయిన ఓఎన్‌డిసి ని ఎందుకు అభివృద్ధి చేస్తున్నాము? దీని వెనుక చిన్న చిల్లర వ్యాపారులకు కూడా రక్షణ కల్పించాలనే ఆలోచన ఉంది. పెద్ద ఇ-కామర్స్ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతోంది. ఈ దిశలో పరిస్ధితులు సజావుగా సాగుతున్నాయి. అయితే, చిన్న వ్యాపారుల సంక్షేమం కోసం కూడా ఆలోచించాలి. పాశ్చాత్య దేశాలలో మామ్ అండ్ పాప్ స్టోర్లు దాదాపుగా కనుమరుగు అయ్యాయి. మన దేశంలో కూడా చిన్న చిల్లర వ్యాపారాలు అంతరించి పోకుండా చూసేందుకు వారి జీవనోపాధిని రక్షించాలి ”అని శ్రీ గోయల్ అన్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 135 కోట్ల మంది భారతీయుల సంక్షేమం గురించి ఆలోచిస్తూ 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలి అనే అంశంపై ఒక విజన్ ఇచ్చారని శ్రీ గోయల్ అన్నారు. దీనిని అమృత కాలంగా భావించి పని చేయాలని శ్రీ గోయల్ అన్నారు.
విద్యార్థులు స్పష్టమైన ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు వరకు విశ్రమించరాదని శ్రీ గోయల్ సూచించారు. ఆశలు, ఆకాంక్షలు, కోరికలు లేకపోతే జీవితంలో ఎదగడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు మన జనాభాని శాపంగా భావించేవారని మంత్రి పేర్కొన్నారు. అయితే, ప్రధానమంత్రి శ్రీ మోదీ ఆ ఆలోచనలో నిజం లేదని రుజువు చేశారని అన్నారు. యువత దేశానికి పెద్ద ఆస్తి అని నమ్మిన ప్రధానమంత్రి దేశ ప్రజల ఆలోచనా సరళిలో మార్పు తెచ్చారని శ్రీ గోయల్ అన్నారు. భౌగోళిక పరిస్థితులు దేశానికి వరం గా ఉంటాయని తెలిపారు. అభివృద్ధి సాధనకు దేశ భౌగోళిక పరిస్థితులు ఉపకరిస్తాయని తెలిపారు. వీటిని ఉపయోగించి దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందని శ్రీ గోయల్ వివరించారు. అన్ని రంగాల్లో వృద్ధి సాధించి, వ్యాపారాన్ని సులభతరం చేసే, ఆవిష్కరణలు, పరిశోధనలు, అభివృద్ధి, ఆధునికతను ప్రోత్సహిచేందుకు సాంకేతిక అంశాలు దోహదపడతాయని వివరించారు. కుటుంబ విలువలు, దేశ సంస్కృతిని గౌరవిస్తూ, జీవన సౌలభ్యాన్ని అందించేందుకు సమగ్ర హేతుబద్ధమైన అభివృద్ధి అవసరమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు
అభివృద్ధి సాధించాలన్న ఆలోచనతో జీవించకుండా కాలక్షేపం చేయకూడదని విద్యార్ధులకు శ్రీ గోయల్ హితవు పలికారు. ఆలోచనలు, ఆకాంక్షలకు కార్యరూపం ఇచ్చి భారతదేశం శ్రేయస్సు, పురోగతి, అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించేందుకు విద్యార్ధులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. విద్యార్థుల పురోగతిలో ఐఐటీ కాన్పూర్ తో సహా అన్ని ఐఐటీలు ముందంజలో ఉంటాయన్న ధీమాను మంత్రి వ్యక్తం చేశారు.
భారతదేశ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించేందుకు శ్రీ గోయల్ ఐఐటీ విద్యార్థులకు ఐదు అంశాల కార్యాచరణ ప్రణాళికను అందించారు:
· స్థాయి, నాణ్యత, ఉపాధి కల్పన కేంద్ర బిందువుగా అన్ని ప్రయత్నాలు సాగాలి
· రైతులు, చేతివృత్తులు , నేత కార్మికులు, చిన్న చిల్లర వ్యాపారులు మొదలైన వారికి వినూత్న పరిష్కారాలను అందించండి. ప్రపంచానికి ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను అందించడంలో సహాయపడండి
· డిజిటల్ వేదికలను (ఉదా. సింగిల్ విండో, పిఎం గతిశక్తి, ఓఎన్‌డిసి) అధ్యయనం చేసి, సౌకర్యాలను మెరుగుపరచడానికి ఆలోచనలను అందించండి
* డిసెంబర్ 22 నుంcచి భారతదేశం అధ్యక్షతన జరగనున్న జి20 సదస్సుకు సంబంధించిన అంశాలు, ఇతివృత్తాలను సిద్ధం చేయడంలో సహాయపడండి
· సేవ, సమర్పణ తత్వాలను అలవరచుకుని దేశానికి మీ సహకారం అందించండి.
భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్ధగా ఐఐటి కాన్పూర్ గుర్తింపు పొందిదని శ్రీ గోయల్ అన్నారు. నారాయణ మూర్తి (వ్యవస్థాపకుడు, ఇన్ఫోసిస్), అరవింద్ కృష్ణ (సిఈఓ, ఐబిఎం), ముఖేష్ బన్సల్ (స్థాపకుడు, మైన్త్రా, సిఈఓ క్యూర్ ఫిట్) లాంటివారు ఇక్కడ కంప్యూటర్ విద్యను అభ్యసించి ప్రపంచ గుర్తింపు పొందారని ఆయన అన్నారు.
కాన్పూర్ నగరం చరిత్ర , సంస్కృతి గొప్పదని శ్రీ గోయల్ అన్నారు.
మహర్షి వాల్మీకి ని 'రామాయణం' రాయడానికి ప్రేరేపించడం నుంచి ప్రపంచ స్థాయి ఇంజనీర్లను తీర్చిదిద్దే వరకు కాన్పూర్ భారతదేశ పురోగతికి అంతర్భాగంగా ఉంది" అని ఆయన అన్నారు.
***
(Release ID: 1798288)
Visitor Counter : 166