ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో 6.2 కోట్ల‌కు పైగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్‌లు (ఐటిఆర్‌), దాదాపు 21 ల‌క్ష‌ల ప్ర‌ధాన ప‌న్ను ఆడిట్ నివేదిక‌లు (టిఎఆర్‌)ల దాఖ‌లు

Posted On: 11 FEB 2022 7:11PM by PIB Hyderabad

ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త‌ ఇ-ఫైలింగ్ పోర్ట‌ల్లో 6.2 కోట్ల‌కు పైగా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్ (ఐటిఆర్‌)ల‌ను, 21 ప్ర‌ధాన ప‌న్ను ఆడిట్ నివేదిక‌ల‌ను (టిఎఆర్‌)ల‌ను  10 ఫిబ్ర‌వ‌రి 2022 వ‌ర‌కు దాఖ‌లు చేశారు. 
ఆర్థిక ర‌సంవ‌త్స‌రం 2021-22లో దాఖ‌లు చేసిన 6.2 కోట్ల ఐటిఆర్‌ల‌లో 48% ఐటిఆర్‌- 1 (2.97 కోట్లు), 9% ఐటిఆర్‌-2 (56ల‌క్ష‌లు), 13% ఐటిఆర్ -3 (83 ల‌క్ష‌లు), 27% ఐటిఆర్- 4 (1.66 కోట్లు), ఐటిఆర్ - 5(11.3 ల‌క్ష‌లు), ఐటిఆర్‌-6 (5.2 ల‌క్ష‌లు), ఐటిఆర్‌-7 (1.41 ల‌క్ష‌లు) ఉన్నాయి.
దాదాపు 1.91 ల‌క్ష‌ల ఫార్మ్ 3 సిఎ- 3 సిడిలు, 17.26 ల‌క్ష‌ల ఫార్మ్ 3సిబి- 3 సిడిల‌ను ఆర్థిక సంవ‌త్స‌రం 21-22లో దాఖ‌లు అయ్యాయి. అలాగే, 1.84 ల‌క్ష‌ల‌కు పైగా ఇత‌ర ప‌న్ను ఆడిట్ నివేదిక‌లను (ఫార్మ్ 10బి, 29 బి, 29సి, 3 సిఇబి, 10 సిసిబి, 10 బిబి) 10.02.2022 వ‌ర‌కు దాఖ‌లు చేశారు.  
పన్ను చెల్లింపుదారుల‌కు ఇమెయిళ్ళు, ఎస్ఎంఎస్‌, ట్విట్ట‌ర్ ద్వారా శాఖ రిమైండ‌ర్ల‌ను జారీ చేస్తూ, టిఎఆర్‌లు / ఐటిఆర్‌ల‌ను దాఖ‌లు చేసేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కూ వేచి ఉండ‌వ‌ద్దంటూ ప‌న్ను చెల్లింపుదారుల‌ను, చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌ను ప్రోత్స‌హిస్తూ వ‌చ్చింది. అద‌నంగా, ఇ-ఫైలింగ్‌కు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని ప‌రిష్క‌రించ‌డంలో దాఖ‌లు చేసేవారికి సాయ‌ప‌డుతూ, రెండు ఇమెయిల్ ఐడిల‌ను టిఎఆర్‌. హెల్ప్‌డెస్క్ @ ఇన్‌క్‌మ్‌టాక్స్.జిఒవి. ఇన్‌, ఐటిఆర్‌. హెల్ప్‌డెస్క్ @ ఇన్‌క్‌మ్‌టాక్స్.జిఒవి. ఇన్‌ను అందించింది. ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22కు త‌మ ప‌న్ను ఆడిట్ నివేదిక‌ల‌ను లేదా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్‌ను దాఖ‌లు చేయ‌ని అంద‌రు ప‌న్ను చెల్లింపుదారులు/  టాక్స్ ప్రొఫెష‌న‌ళ్ళ‌ను చివ‌రి నిమిష‌పు ర‌ద్దీని నివారించేందుకు త‌మ టిఎఆర్‌ల‌ను/  రిట‌ర్న్‌ల‌ను దాఖ‌లు చేయ‌వ‌ల‌సిందిగా విజ్క్ష‌ప్తి చేసింది. 

***
 


(Release ID: 1797981) Visitor Counter : 131


Read this release in: English , Urdu , Hindi