పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఏఏఐ, ఇతర ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సంస్థలు విమానాశ్రయ రంగ అభివృద్ధికి రూ. 91000 కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టకున్నాయి
Posted On:
10 FEB 2022 3:50PM by PIB Hyderabad
విమానాశ్రయాల సామర్థ్య పెంపు/ ఆధునీకరణ అనేది నిరంతర ప్రక్రియ. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సంస్థలు ఎప్పటికప్పుడు భూమి లభ్యత, వాణిజ్య సాధ్యత, సామాజిక-ఆర్థిక పరిగణనలు, ట్రాఫిక్ డిమాండ్/ విమానయాన సంస్థల సుముఖత ఆధారంగా ఆయా విమానాశ్రయాల నిర్వహణ, తగిన విధంగా ఆపరేట్ చేయడం వంటి వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఏఏఐ,ఇతర ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి సంస్థలు దాదాపు రూ.రూ. 91000 కోట్ల మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టకున్నాయి. ప్రస్తుత టెర్మినల్స్, కొత్త టెర్మినల్స్ మరియు రన్‌వేలను బలోపేతం చేయడం మరియు ఇతర కార్యకలాపాలను విస్తరించడం, సవరించడం కోసం రాబోయే ఐదేళ్లలో విమానాశ్రయ రంగంలో రూ.91000 కోట్ల మేర మూలధన వ్యయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ పాలసీ-2008 ప్రకారం, గోవా, నవీ ముంబయి, షిర్డీ, మహారాష్ట్రలోని సిం ధుదుర్గ్, కలబురగి, బీజాపూర్, హాసన్‌లలో మోపా అనే మొత్తం 21 గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు భారత ప్రభుత్వం ఇప్పటివరకు 'సూత్రప్రాయంగా' ఆమోదం తెలిపింది. వీటికి తోడు కర్ణాటకలోని షిమోగా, మధ్యప్రదేశ్‌లోని డాటియా (గ్వాలియర్), ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఖుషినగర్ మరియు నోయిడా (జేవార్), గుజరాత్‌లోని ధోలేరా, హిరాసర్, పుదుచ్చేరిలోని కారైకల్, ఆంధ్ర ప్రదేశ్‌లోని దగదర్తి, భోగాపురం, ఒరవకల్, పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్, సిక్కింలో పాక్యోంగ్, కేరళలోని కన్నూర్, అరుణాచల్ ప్రదేశ్‌లోని హోలోంగి (ఈటానగర్) తదితర విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటికే దుర్గాపూర్, షిర్డీ, సింధుదుర్గ్, పాక్యోంగ్, కన్నూర్, కలబురగి, ఒరవకల్, ఖుషీనగర్ వంటి 8 విమానాశ్రయాలు ప్రారంభించబడ్డాయి. బీహార్‌లోని బిహ్తా విమానాశ్రయంలో సివిల్ ఎన్‌క్లేవ్ అభివృద్ధికి 108 ఎకరాల భూమి అవసరమని ఏఏఐ అంచనా వేసింది. ఆ భూమిని (108 ఎకరాలు) ఇప్పటికే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ఏఏఐకి అప్పగించింది. ఏదేమైనప్పటికీ విమానాశ్రయంలో అంతర్జాతీయ కార్యకలాపాల కోసం వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఏర్పాటు చేయడానికి రన్‌వే పొడిగింపు & అప్రోచ్ లైట్‌ను ఏర్పాటు చేయడానికి 191.5 ఎకరాలు మరియు సిటీ సైడ్ డెవలప్‌మెంట్ కోసం 8 ఎకరాల అదనపు భూమి అవసరమని ఏఏఐ అంచనా వేసింది. బిహ్తా విమానాశ్రయంలో అదనపు భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏఏఐకి అప్పగించలేదు. భూమి అందుబాటులో లేని పక్షంలో, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అవసరాలకు అనుగుణంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించాలి. పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1797431)
Visitor Counter : 129