పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఐఎండబ్ల్యుబిఇఎస్‌కు నిధుల కేటాయింపు
Posted On:
10 FEB 2022 1:31PM by PIB Hyderabad
అంతర్జాతీయ పర్యావరణ సదుపాయం (గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ఫెసిలిటీ -జిఇఎఫ్) కింద ఐఎండబ్ల్యుబిఇఎస్ ప్రాజెక్టుకు నిధులు సమకూరుతున్నాయి. ఈ క్రమంలో జిఇఎఫ్ ట్రస్ట్ ఫండ్ (జిఇటిఎఫ్) ఐదేళ్ళ కాలానికి రూ. 31.13 కోట్లకు సమానమైన బడ్జెట్‌ను మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులో జోడించిన మాగాణి నేలలలో కేరళలలోని సస్థామ్‌కొత్త చెరువు, పంజాబ్‌లోని హరికే చెరువు, బీహార్‌లోని కబర్తాల్ ఉన్నాయి. జిఇఎఫ్‌టిఎఫ్లో రూ. 19.02 కోట్లతో సమానమైన మొత్తం బడ్జెట్ నిధులను ఈ మూడు మాగాణి నేలలకు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని మూడు రాష్ట్రాలకూ సమానంగా కేటాయించనున్నారు.
నేటి వరకూ దిగువన పేర్కొన్న కార్యకలాపాలను చేపట్టడం జరిగిందిః
ప్రాజెక్టు ఆరంభించడంలో భాగంగా, ప్రాజెక్టు ఫలితాల చట్రాన్ని, పర్యవేక్షణా సూచీలను, కార్యాచరణ ప్రణాళికను ప్రాజెక్టు ఆమోదించినప్పటి నుంచి జరుగుతున్న అభివృద్ధిని పొందుపరచడానికి తాజాపరచడం జరిగింది. ప్రాజెక్టు మూలరేఖలను (బేస్‌లైన్స్)ను కూడా తాజాపరిచారు. వీటితో పాటుగా ప్రాజెక్టు నిర్వహణ యూనిట్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్- పిఎంయు), జాతీయ ప్రాజెక్టు క్రియాశీలక కమిటీ (స్టీరింగ్ కమిటీ= ఎన్‌పిఎస్‌సి)ని ఏర్పాటు చేయడం జరిగింది.
రెండు బ్రోచర్లను రూపొందించారు - ఎ) కీలక ప్రాజెక్టు అంశాల సారాంశంతో ఐఎండబ్ల్యుబిఇఎస్ ప్రాజెక్టు బ్రోచర్ బి) అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన మాగాణి నేలల గుర్తింపు, నిర్వహణ (రామార్ సైట్) పై బ్రోచర్‌ను కూర్చారు.
రామ్‌సార్ ప్రాంతీయ బృందానికి 16 రామ్‌సార్ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని తాజాపరచి. రామ్‌సార్ సమాచార పత్రాలు (ఆర్ఐఎస్) సమర్పించడం జరిగింది.
రాష్ట్ర ప్రభ/త‌్వాలు సమర్పించిన సమగ్ర నిర్వహణ ప్రణాళికలను పిఎంయు సాంకేతిక మదింపును నిర్వహించింది. ముఖ్యంగా, పర్యావరణ వ్యవస్థల సేవలను, జీవ వైవిధ్య విలువలను పొందుపరచడాన్ని, రాబోయే ముప్పుతో సహా చొరవలను మ్యాపింగ్ చేయడాన్ని విశ్లేషించింది.
అదనంగా, ప్రస్తుతమున్న నిర్వహణ ప్రణాళికలను, మూడు ప్రతిపాదిత స్థలాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులను విడుదల చేయడానికి మూడు ప్రతిపాదిత స్థలాలలో పనులు తాజాపరిచేందుకు రూపకల్పన చేయడం జరిగింది.
ఈ సమాచారాన్ని పర్యావరణ, ఆటవీ, వాతావరణ మార్పు శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే రాజ్యసభలో గురువారం వెల్లడించారు.
***
(Release ID: 1797289)
Visitor Counter : 114