ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో 27 సంస్థల సేవలు సమీకృతం!


ఎ.బి.డి.ఎం. డిజిటల్ వేదికతో మమేకమైన
ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యసేవా సంస్థలు

Posted On: 08 FEB 2022 5:43PM by PIB Hyderabad

    ఆరోగ్య రక్షణ, ఆరోగ్యపరమైన సాంకేతిక సేవలను అందించే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని 27 సంస్థలు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎ.బి.డి.ఎం.) పథకంలో సమీకృతమయ్యాయి. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.) ఈ మేరకు ప్రకటన చేసింది. దేశంలోని ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థలు (హెచ్.ఎం.ఐ.ఎస్.), లేబరేటరీ మేనేజ్మెంట్ సమాచార వ్యవస్థ (ఎల్.ఎం.ఐ.ఎస్.), హెల్త్ లాకర్ సేవలు, ఆరోగ్య సాంకేతిక సేవలు అందించే సంస్థలు, ఇతర డిజిటల్ సేవల సంస్థలన్నీ ఎ.బి.డి.ఎం.తో సమీకృతమయ్యాయి. దీనితో దేశంలో నిర్వహణా సౌలభ్యంతో కూడిన డిజిటల్ ఆరోగ్య రక్షణ వ్యవస్థ రూపకల్పనకు తగిన సానుకూల పరిణామాలు ఏర్పడ్డాయి.

   డిజిటల్ ఆరోగ్య రక్షణ వ్యవస్థ పరిధిలో నిర్వహణాపరమైన సౌలభ్యంతో నిరాటంకంగా పనిచేసే ఒక ఆన్.లైన్ వేదికను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎ.బి.డి.ఎం.) పేరిట దేశవ్యాప్తంగా ఒక పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 సెప్టెంబరు 27న ప్రారంభించారు. ఆరోగ్య రక్షణ వ్యవస్థలో పనిచేసే అన్ని భాగస్వామ్య వర్గాలకూ డిజిటల్ ఆరోగ్య రక్షణ నిర్వహణా అనుభవాన్ని, ఫలితాలను అందించే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ (ఎ.పి.ఐ.)ను ఎ.బి.డి.ఎం. విజయవంతంగా రూపొందించింది. ఆరోగ్య రక్షణ రంగంలోని ఆరోగ్య సదుపాయాలు, రోగులు, ఆరోగ్య రక్షణ నిపుణులను భాగస్వామ్య వర్గాలుగా పరిగణిస్తారు.  ఎ.బి.డి.ఎం. పరిధిలో రూపుదిద్దుకున్న డిజిటల్ సానుకూల వ్యవస్థ ప్రస్తుతం ఆరోగ్య సదుపాయాలకు, ఆరోగ్య సాంకేతిక సేవలను అందించే సంస్థలకు  అనుసంధానమై పోయింది.

    ఆరోగ్య రక్షణ వ్యవస్థలోని వివిద భాగస్వామ్య వర్గాల మధ్య అంతరాన్ని పూడ్చివేసేందుకు కొత్తగా ఏర్పడిన వ్యవస్థ దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ కింది భాగస్వామ్య సంస్థలు ఎ.బి.డి.ఎం.తో సమీకృతమైన నేపథ్యంలో జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.)నుంచి ఆయా సంస్థలు ‘ఎ.బి.డి.ఎం.-సమీకృత’ యోగ్యతా పత్రాలు అందుకున్నాయి.  తమతమ సమీకృత ప్రక్రియ పూర్తయిన తేదీల ప్రాతిపదికగా వివిధ వర్గాల వారీగా ఈ జాబితాను తయారు చేశారు.

 

• ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థలు (హెచ్.ఐ.ఎం.ఎస్.) ఎన్.ఐ.సి. ఆధ్వర్యంలోని ఇ-హాస్పిటల్, సి-డాక్ పరిధిలోని ఇ-శుశ్రుత్, అపోలో ఆసుపత్రుల పరిధిలోని మెడ్.మంత్రా, ప్లస్.91 టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ పరిధిలోని మెడిఎక్సెల్, ఆర్బీ హెల్త్ పరిధిలోని ఎకాకేర్, థాట్.వర్క్ టెక్నాలజీస్ పరిధిలోని బాహ్మినీ, డాకాన్ టెక్నాలజీస్ పరిధిలోని డాకాన్ ఉన్నాయి. ఇంకా వైద్యులకోసం బజాజ్ ఫిన్.సర్వ్ హెల్త్, బజాజ్ ఫిన్.సర్వ్ హెల్త్ యాప్ ఉన్నాయి. ఇవి బజాజ్ ఫిన్.సర్వ్ లిమిటెడ్ సంస్థ నిర్వహణలో ఉన్నాయి.

 

• లేబరేటరీ మేనేజ్మెంట్ సమాచార వ్యవస్థలు (ఎల్.ఎం.ఐ.ఎస్.లు)—ఎస్.ఆర్.ఎల్ లిమిటెడ్ సంస్థ పరిధిలోని  సెంట్రలైజ్డ్ లేబరేటరీ నిర్వహణా సమాచార వ్యవస్థ, క్రెలియో హెల్త్ సాఫ్ట్.వేర్ పరిధిలోని క్రెలియో హెల్త్.

• హెల్త్ లాకర్ సేవల సంస్థలు---డిజి లాకర్ (నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్), డిరీఫ్ కేస్ (డిరీఫ్.కేస్ హెల్త్,.టెక్ ప్రైవేట్ లిమిటెడ్), డాక్.ప్రైమ్ (డాక్ ప్రైమ్ టెక్నాలజీస్)

• ఆరోగ్య సాంకేతిక సేవల సంస్థలు---ప్రాక్టో (ప్రాక్టో టెక్నాలజీస్), వెరటోన్ హెల్త్ (వెరటోన్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్), మార్.షా హెల్త్ క్లినికల్ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ –సి.డి.ఎస్.ఎస్. (మార్.షా హెల్త్ కేర్), ఇండియన్ జాయింట్ రిజిస్ట్రీ-ఐ.జె.ఆర్. (ఎన్.ఇ.సి. సాఫ్ట్.వేర్ సొల్యూషన్స్ ఇండియా), పేటిఎం (వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్), జియోహెల్త్.హబ్ (రిలయన్స్ డిజిటల్ హెల్త్ లిమిటెడ్), రాక్సా (రాక్సా హెల్త్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), డాక్స్.పర్ (ఇన్ఫార్మ్.డి.ఎస్. టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్)

• కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ఇతర ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞాన పరిష్కారాలు---కోవిన్ (కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ), నిక్.షే (సెంట్రల్ టి.బి. డివిజన్), ఇ-ఆరోగ్య (హెల్త్ డిపార్ట్.మెంట్-డి.ఎన్.హెచ్., డి.డి.) ఎన్.ఎన్.ఎం., ఎ.పి. హెల్త్ యాప్ (ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ సిబ్బంది), ఇ.హెచ్.ఆర్. (ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ), సి.పి.హెచ్.సి.-ఎన్.సి.డి. సాఫ్ట్.వేర్ (జాతీయ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంస్థ-ఎన్.ఐ.హెచ్.ఎఫ్.డబ్ల్య.), ట్రాన్సాక్ష్న్ మేనేజ్మెంట్ సిస్టమ్-టి.ఎం.స్., లబ్ధిదారుల గుర్తింపు వ్యవస్థ-బి.ఐ.ఎస్.(ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-పి.ఎం.-జె.ఎ.వై.)

   ఎ.బి.డి.ఎం. శాండ్ బాక్స్ అనే ప్రత్యేక వ్యవస్థ ద్వారా ఈ వ్యవస్థలన్నీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. పథకంతో సమీకృతమయ్యాయి. ఇప్పటిదాకా, 745 సంస్థలు ఎ.బి.డి.ఎం. శాండ్ బాక్స్ అనే వ్యవస్థతో రిజిస్టరయ్యాయి.

   ఆరోగ్య రక్షణ వ్యవస్థ నిర్వహణలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎ.బి.డి.ఎం.) నిర్వహించే పాత్ర గురించి ఎన్.హెచ్.ఎ. చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (సి.ఇ.ఒ.) డాక్టర్ ఆర్.ఎస్. శర్మ వివరించారు. అందుబాటు యోగ్యమైన రీతిలో నాణ్యమైన ఆరోగ్య రక్షణ సేవలను అందించడమే ఎ.బి.డి.ఎం. లక్ష్యమని ఆయన అన్నారు. ”ఈ ఆరోగ్యసేవలు దేశంలో అన్ని చోట్లా అందుబాటులో ఉండాలి. అంటే, దూరం అనే భావననను ఆరోగ్యరంగంలోని ఈ సాంకేతిక ఉపకరణాలు గణనీయంగా తగ్గించాలి. నిర్వహణాపరంగా ఎంతో సౌలభ్యంతో కూడిన ఈ వ్యవస్థ, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది.” అని ఆయన అన్నారు.

   ఆయష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పథకంతో ఇప్పటివరకూ సమీకృతమైన 27 ఆరోగ్య రక్షణ, ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞాన సేవల సంస్థల్లో 17 సంస్థలు ప్రైవేటు రంగానికి చెందినవవని డాక్టర్ శర్మ  అన్నారు. ఎ.బి.డి.ఎం. వ్యవస్థకు అనుగుణమైన రీతిలో అవి ఆశించిన పరిష్కారాలను అందించగలుగుతున్నాయని చెప్పారు. ఇది చాలా అద్భుతమైన వ్యవస్థ అని ఆయన అన్నారు.

  ఎ.బి.డి.ఎం. భాగస్వామ్య సంస్థల పూర్తి జాబితా, వాటికి సంబంధించిన సమీకృత ప్రక్రియ గురించి ఈ వెబ్ లింకులో పొందుపరిచారు. https://abdm.gov.in/home/partners .

ఎ.బి.డి.ఎం. శాండ్ బాక్స్ వ్యవస్థకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకును సంప్రదించవచ్చు: https://sandbox.abdm.gov.in/

 

***(Release ID: 1796706) Visitor Counter : 184


Read this release in: English , Urdu , Hindi