నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

ఏసియాన్‌- ఇండియా పున‌రుత్పాద‌క ఇంధ‌న ఉన్పత‌స్తాయి సద‌స్సు ప్రారంభం.


స‌మీకృత పున‌రుత్పాద‌క మార్కెట్ కోసం అనుభ‌వం, ఆవిష్కరణలు"

ఏసియాన్ ప‌వ‌ర్‌గ్రిడ్ అభివృద్ధికి ఏసియాన్ సాగిస్తున్న కృషిని అభినందించిన విద్యుత్, ఎన్ ఆర్ ఇ మంత్రి

పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో విజ్ఞానాన్ని పంచుకోవడం, సామర్థ్యం పెంపొందించడం సాంకేతిక సహాయాన్ని
ప్రోత్సహించే పునరుత్పాదక ఇంధనాల కోసం మొత్తం పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఏసియాన్ కలిసి పని చేయవచ్చు;

అలాగే ఈ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన తయారీ కేంద్రాల అభివృద్ధికి ,ఉమ్మడి కార్యక్రమాలను అన్వేషించవచ్చు" : శ్రీ ఆర్‌.కె. సింగ్

పున‌రుత్పాద‌క రంగంలో మ‌రింత స‌హ‌కారానికి ,నిర్దిష్ట అంశాలు, కార్య‌క్ర‌మాల గుర్తింపున‌కు స‌మావేశంలో పాల్గొన్న మంత్రుల పిలుపు.

Posted On: 07 FEB 2022 6:31PM by PIB Hyderabad

పున‌రుత్పాద‌క ఇంధ‌నానికి సంబంధించి  ఏసియాన్ - ఇండియా ఉన్న‌త‌స్థాయి స‌ద‌స్సు ను నూత‌న పున‌రుత్పాద‌క ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ‌, భార‌త ప్ర‌భుత్వానికి చెందిన విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ 2022 ఫిబ్ర‌వ‌రి 7-8 తేదీల‌లో నిర్వ‌హిస్తోంది. రెండు రోజుల‌పాటు నిర్వ‌హించే ఈ ఉన్న‌త స్థాయి స‌దస్సు స‌మీకృత పున‌రుత్పాద‌క మార్కెట్ కోసం అనుభ‌వం, ఆవిష్క‌ర‌ణ అన్న‌ది స‌మావేశ ఇతివృత్తంగా ఉంది.

నూత‌న‌, పున‌రుత్పాద‌క ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ కార్య‌ద‌ర్శి, ఏసియాన్ సభ్య దేశాల ఉన్న‌త స్థాయి   ప్ర‌తినిధుల‌ను ప్రారంభ మినిస్టీరియ‌ల్ సెష‌న్‌కు స్వాగ‌తం ప‌లికారు. స‌మ‌వేశ చ‌ర్చ‌లకు ప్రాతిప‌దిక ఏర్ప‌ర‌చారు. కంబోడియా గ‌నులు ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన మంత్రి,  ఏసియాన్ ప్ర‌స్తుత చెయిర్‌,హిజ్ ఎక్స‌లెన్సీ టున్ లీన్‌, భార‌త ప్ర‌భుత్వానికి చెందిన నూత‌న , పున‌రుత్పాద‌క ఇంధ‌నం ఎరువుల మంత్రిత్వ‌శాఖ‌ స‌హాయ‌మంత్రి గౌర‌వ‌నీయ శ్రీ భ‌గ‌వంత్ క్యూబాలు పున‌రుత్పాద‌క ఇంధ‌న ప్ర‌ణాళికల గురించి , ఏసియాన్ , ఇండియాలు సాధించిన విజ‌యాల గురించి మాట్లాడారు. పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో ఇండియా- ఏయిస‌యాన్ మద్య స‌హ‌కారాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌ని ,వాతావ‌ర‌ణ మార్పుల‌పై పోరాటానికి ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌కు వీలు క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

మంత్రుల స్థాయి స‌మావేశాన్ని ఉద్దేశించి ఏసియాన్ స‌భ్య దేశాలకు చెందిన‌ ఇంధ‌న శాఖ మంత్రులు ప్ర‌సంగించారు.  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ముఖులు పున‌రుత్పాద‌క ఇంధ‌న ఆకాంక్ష‌లు, ఈ రంగంలో సాధించిన పురోగ‌తి, ఆయా దేశాల‌కు ప్రాధాన్య‌తా అంశాలు, ఈ రంగంలో ఇండియా - ఏసియాన్ స‌హ‌కారాన్ని మ‌రింత ముందుకు తీసుకుపోవడం వంటి వాటి గురించి పున‌రుద్ఘాటించారు. అంత‌ర్జాతీయ‌య‌య సౌర కూట‌మి ( ఇంట‌ర్నేష‌న‌ల్ సోలార్ అల‌యెన్స్ -ఐఎస్ ఎ) డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ , మాట్లాడుతూ ఐఎస్ఎ  ప్ర‌ణాళిక‌లు, దార్శ‌నిక‌త గురించి వివ‌రించారు. అలాగే ఎసియాన్ స‌భ్య దేశాలు ఈ కూట‌మిలో చేర‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత ఫ‌లితాల గురించి తెలియ‌జేశారు.


భార‌త ప్ర‌భుత్వానికి చెందిన విద్యుత్‌, నూత‌న పున‌రుత్పాద‌క ఇంధ‌న శాఖ మంత్రి శ్రీ ఆర్‌.కె.సింగ్ ఈ స‌మావేశంలో కీల‌కోప‌న్యాసం చేశారు. పున‌రుత్పాద‌క ఇంధ‌నానికి సంబంధించి ఇండియా- ఏసియాన్‌లు విజ్ఞాన మార్పిడికి ప్రోత్సాహం, సామ‌ర్ధ్యాల పెంపు, సాంకేతిక స‌హాయం, పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగానికి సంబంధించి సంయుక్త కార్య‌క‌లాపాల అభివృద్ధి, ఈ ప్రాంతంలో పునరుత్పాద‌క ఇంధ‌న త‌యారీ హ‌బ్‌ల ఏర్పాటుకు క‌ల‌సి ప‌నిచేయ‌వ‌చ్చ‌ని అన్నారు. ఏసియాన్ ప‌వ‌ర్ గ్రిడ్ ను సాధించేందుకు ఏసియాన్ కృషిని ఆయ‌న అభినందించారు. ఈ గ్రిడ్ ఇంటిగ్రేష‌న్‌ను ఏసియాన్ దేశాలే కాకుండా భార‌త ఉప‌ఖండంలో  ఒక సూర్యుడు, ఒక ప్ర‌పంచం, ఒక గ్రిడ్ చొర‌వ కు అనుగునంగా దీనిని విస్త‌రింప చేసేందుకు త‌గిన అవ‌కాశాల కోసం ఇండియా ఎదురు చూస్తుంద‌ని ఆయ‌న అన్నారు.
2022లో జి20 అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను ఇండొనేసియా చేప‌ట్ట‌డం ప‌ట్ల మంత్రి ఆ దేశాన్ని అభినందించారు. , ప్రపంచ ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌కు వీలు క‌ల్పించ‌డం, దీనిని మ‌రింత వేగ‌వంతం చేయ‌డానికి ఇండియా  ఇండొనేసియా తో స‌న్నిహితంగా క‌లిసి ప‌నిచేస్తుంద‌ని అన్నారు. ఏసియాన్ తో క‌లిసి పనిచేయ‌డానికి ఇండియా చిత్త‌శుద్ధిని ఆయ‌న పున‌రుద్ఘాటించారు. అలాగే ఏసియాన్ తో బ‌ల‌మైన సంబంధాలు నెల‌కొల్పుకోవ‌డం, ఇండియా,ఏసియాన్ ల‌మ‌ధ్య చారిత్ర‌క‌, సాంస్కృతిక సంబంధాలు బ‌లోపేతం చేసుకోవ‌డం, పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలో బ‌ల‌మైన సంబంధాన్ని నెల‌కొల్పుకోవ‌డానికి ఇండియా క‌ట్టుబ‌డి ఉంద‌ని అన్నారు.

ద ఎన‌ర్జీ రిసొర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (టిఇఆర్ ఐ)  డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ విభా దావ‌న్ వంద‌న స‌మ‌ర్ప‌ణ‌తో మినిస్టీరియ‌ల్ సెష‌న్ ముగిసింది. డాక్ట‌ర్ విభా ధావ‌న్

స‌ద‌స్సు గురించి :
ఏసియాన ్ - ఇండియా ఉన్న‌త‌స్థాయి స‌ద‌స్సులో 5 టెక్నిక‌ల్ సెష‌న్ లు ఉన్నాయి. ఇవి ఇండియా -ఏసియాన్ దేశాల‌కు చెందిన నిపుణుల మధ్య , ప‌ర‌స్ప‌రం ఆస‌క్తి ఉన్న అంశాల‌పై నేరుగా చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించేంది. ఈ సెషన్‌లు, విధాన రూపకర్తలు, నిపుణులు, విద్యావేత్తలు  ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో సహా పునరుత్పాదకతలో ప్రపంచ ప్ర‌జ‌ల‌కు  సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి భారతదేశం-ఆసియాన్ ప్రణాళికలను పరిశీలించడానికి  అవకాశం కల్పిస్తాయి.
ఈ స‌ద‌స్సు లో పాల్గొన‌డానికి అంద‌రికీ అవ‌కాశం ఉంది. ఆస‌క్తిగ‌ల వారు దిగువ ఇచ్చిన లింక్ ద్వారా కాన్ఫ‌రెన్సుకు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌చ్చు.
  https://aseanindiareconference-teri.webconevents.com/

 

***



(Release ID: 1796704) Visitor Counter : 163


Read this release in: English , Urdu , Hindi , Kannada