ఆయుష్
azadi ka amrit mahotsav

Amazon.inలో ఆయుర్వేద ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టోర్ ఫ్రంట్‌ను ప్రారంభించిన ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 08 FEB 2022 7:07PM by PIB Hyderabad

Amazon.in మార్కెట్‌ప్లేస్‌లో ఆయుర్వేద ఉత్పత్తుల కోసం ప్రత్యేక స్టోర్ ఫ్రంట్‌ను కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈరోజు జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ఎంఓఎస్  శ్రీ ముంజ్‌పరా మహేంద్రభాయ్ మరియు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆయుర్వేదం మరియు దాని ప్రయోజనాలపై రూపొందించిన ఒక షార్ట్ వీడియో ఫిల్మ్‌తో కార్యక్రమం ప్రారంభమైంది.

ఈ ఆయుర్వేద ఉత్పత్తుల స్టోర్ ఫ్రంట్ చిన్న వ్యాపారాలు మరియు స్టార్టప్ బ్రాండ్‌ల నుండి వివిధ రకాల జ్యూస్‌లు, చర్మ సంరక్షణ సప్లిమెంట్‌లు, రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులు, నూనెలు మరియు మరిన్ని  ప్రత్యేకమైన ఆయుర్వేద ఉత్పత్తుల దృశ్యమానతను మెరుగుపరుస్తుంది. ఫోకస్ ఏరియాలు మరియు పెయిన్ మేనేజ్‌మెంట్, ఇమ్యూనిటీ బూస్టర్‌లు, బ్లడ్ ప్యూరిఫైయర్‌లు, మహిళల ఆరోగ్యం, వెయిట్ మేనేజ్‌మెంట్, మెంటల్ వెల్నెస్ వంటి ఆరోగ్య ప్రయోజనాలకు అనుగుణంగా ఉత్పత్తి ఎంపిక నిర్వహించబడినందున ఇది షాపింగ్‌ను సులభతరం చేస్తుంది.

వర్చువల్ లాంచ్ కార్యక్రమంలో శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ, “కొవిడ్-19 కోసం ఆయుర్వేదం, సిద్ధ, హోమియోపతి మందులను శాస్త్రీయంగా అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. ఈ ఉత్పత్తులకు చెందిన బలమైన మార్కెటింగ్ నెట్‌వర్క్‌ను ప్రజలకు చేరవేయడం కూడా అంతే ముఖ్యం. అమెజాన్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉత్పత్తుల డెలివరీని నిర్ధారించడం ద్వారా సరఫరా గొలుసును బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అది చెవాన్‌ప్రాష్, ఆయుష్ కధా లేదా ఆయుష్ -64 ఏదైనా కావచ్చు.  భారతదేశ ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను నెరవేర్చే దిశగా ముందడుగు వేస్తున్న ఆయుష్‌ను మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడంపై దృష్టి సారించేందుకు చిన్న మరియు పెద్ద కంపెనీలతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి."అని తెలిపారు.

 

image.png

కోవిడ్ నుండి ప్రజలను రక్షించడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అభివృద్ధి చేసిన ఆయు రక్ష కిట్, బాలరక్ష కిట్ మరియు స్వాస్త్య రక్ష కిట్‌లను కూడా మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. ఈ కిట్‌లు 3-4 ఆయుర్వేద ఔషధాల కాంబో-ప్యాక్, ఉదా. సంశమణి వతి, అను తైలా, ఆయుష్ క్వాత్ మరియు చయన్‌ప్రాష్ ఉన్నాయని తెలిపారు.ఈ కిట్‌లను ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా అమెజాన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచవచ్చని  చెప్పారు.

2014 సంవత్సరంలో 3 బిలియన్ డాలర్ల  విలువ ఉన్న ఆయుష్ మార్కెట్ పరిమాణం ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన వివిధ కార్యక్రమాల కారణంగా 18 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఆయుష్ మార్కెట్‌ను మరింత పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఆయుష్ తయారీ రంగం అలాగే సేవా రంగం ప్రారంభించిన వివిధ ప్రమోషనల్ స్కీమ్‌ల గరిష్ట ప్రయోజనాన్ని పొందాలని శ్రీ సోనోవాల్ సూచించారు.

ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా ఇండియా కన్స్యూమర్ బిజినెస్ కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ " భారతీయ జీవన విధానంలో ఆయుర్వేదం ఎప్పుడూ భాగమని, ఈ ప్రత్యేక స్టోర్ ఫ్రంట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఆయుర్వేదం గురించి అవగాహన కల్పించడంపై భారత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఈ దార్శనికతకు దోహదపడేందుకు మరియు ఆయుర్వేద ఉత్పత్తులను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రయత్నాల్లో ఈ స్టోర్‌ఫ్రంట్ ఒక భాగమని' ఆయన అన్నారు.

***


(Release ID: 1796688) Visitor Counter : 202