సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ సహకారంతో విజయ పథంలో ....

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2022 3:46PM by PIB Hyderabad

నావెల్ కిశోర్ ఒక  ఔత్సాహిక పారిశ్రామికవేత్త. పాలరాయితో వివిధ వస్తువులను తయారు చేసి ఒక యూనిట్ ను ఆయన నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో పాలరాయి తో చేసిన వస్తువులకు మంచి మార్కెట్ ఉంది. దీనిని గుర్తించిన కిషోర్ తాను రూపొందించి తయారు చేస్తున్న వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలని అనుకున్నారు. తన ప్రతిపాదనతో కిషోర్ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖను సంప్రదించి సహకారం కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ వీటిని ప్రదర్శించేందుకు అవకాశం కల్పించింది. " నోయిడా లో జరిగిన # ఇండోఎక్స్పోమార్ట్' లో నేను తొలిసారిగా పాల్గొని నా ఉత్పత్తులను ప్రదర్శించాను. అమెరికా, యూకే, మాస్కో లకు చెందిన ఏడుగురు కొనుగోలుదారులు నా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఈ రోజు నేను మరో ప్రదర్శనలో పాల్గొన్నాను. దీనితో న్ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించేందుకు అవకాశం కలిగింది." అని కిషోర్ ఆనందంగా చెప్పారు. వినూత్నంగా తయారవుతున్న వస్తువులతో అనేకమంది స్థానికంగా ఉపాధి పొందుతున్నారు. దీంతో స్థానికులకు సాధికారత కల్పించడం సాధ్యమవుతోంది.

***


(రిలీజ్ ఐడి: 1796675) సందర్శకుల సూచీ సంఖ్య : : 171
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी