సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్ కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలుసుకుని రాష్ట్రానికి చెందిన సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
గత ఆరు నెలల్లో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ పై వాటి ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ ఒక పుస్తకాన్ని అందజేశారు.
Posted On:
07 FEB 2022 4:27PM by PIB Hyderabad
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్ , ఈ రోజు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞాన మంత్రిత్వశాఖ సహాయమంత్రి( స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్, అణుఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌ను కలుసుకున్నారు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన వివిధ ప్లాగ్‌షిప్ పథకాలను సమర్ధంగా అమలు చేసేందుకు ఆలిండియా సర్వీసు అధికారులు, ప్రత్యేకించి ఐఎఎస్ అధికారుల పోస్టింగ్‌కు డిపార్టమెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ను కోరారు.

సిపి గ్రామ్స్ గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి, ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరిండంతోపాటు, కోవిడ్ 19 కేటగిరీలోని ఫిర్యాదులను ప్రాధాన్యతా ప్రాతిపదికన స్వీకరించి వాటిని గరిష్ఠంగా 3 రోజులలో పరిష్కరించడం జరుగుతోందన్నారు.
.రాష్ట్రాలలో సుపరిపాలన పద్ధతులకు సంబంధించిన నమూనాలతో కూడిన సంచికను డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వ పరిపాలనా విధానంలో పౌర కేంద్రిత పాలన అనేది వారి పాలనా నమూనాకు గుండెకాయ అన్నారు. పాలన నాణ్యత మెరుగుదల దిశగా చేపట్టే మార్పుల ప్రభావం రాష్ట్రాలు, జిల్లాలలో కనిపించాలని, అవినీతి రహిత, పారదర్శక విధానం దీని లక్ష్యమని ఆయన అన్నారు.
మానవసహిత అంతరిక్ష మిషన్ గగన్ యాన్ పురోగతి గురించి వారు ప్రస్తావించారు.
గత ఆరు నెలలో తమ ప్రభుత్వం సాధించచిన విజయాలు, భవిష్యత్ పై వాటి ప్రభావం గురించి బొమ్మయ్ ఒక బుక్ లెట్‌ను డాక్టర్ జితేంద్ర సింగ్‌కు అందజేశారు

శ్రీ బొమ్మయ్ ముఖ్యమంత్రిగా ఆరు నెలల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ స్వల్ప వ్యవధిలో తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు, పథకాలను రైతులు, విద్యార్థులు, పట్టణ ప్రాంతాలలోని వారు, అసంఘటిత రంగ కార్మికులు, వయోధికులు, వితంతువులు, దివ్యాంగుల కోసం తీసుకువచ్చిందన్నారు.
శ్రీ బొమ్మై తన రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజధానిలో ఉన్నారు, ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రితో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై కేంద్ర ప్రాజెక్టులు , వచ్చే నెలలో సమర్పించనున్న రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నారు..
***
(Release ID: 1796401)