పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్ రంగంలో ఉపాధి అవకాశాలు
Posted On:
03 FEB 2022 5:29PM by PIB Hyderabad
డ్రోన్ రూల్స్, 2021 ప్రకారం, రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఆర్‌పీటీఓ)ని స్థాపించే అధికారాన్ని పొందాలనుకునే ఎవరైనా నిర్దిష్ట రుసుములతో పాటుగా డిజిటల్ స్కై ప్లాట్‌ఫారమ్‌లో ఫారం డీ5లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు దరఖాస్తును సమర్పించాలి. 31 డిసెంబర్ 2021 నాటికి, ప్రభుత్వ లేదా ప్రైవేట్ యాజమాన్యం కింద ఉన్న సంస్థల ద్వారా తొమ్మిది రిమోట్ పైలట్ శిక్షణా సంస్థలేర్పాటు చేయబడ్డాయి. రాష్ట్రాల వారీగా ఆర్‌పీటీఓల జాబితా అనుబంధం -I గా జోడించబడింది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల మరియు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి సర్టిఫికేట్ ఉన్న ఎవరైనా అధీకృత రిమోట్ పైలట్ శిక్షణా సంస్థ నుండి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత రిమోట్ పైలట్ లైసెన్స్‌ని పొందవచ్చు. డ్రోన్ పాఠశాలల నుండి ఉత్తీర్ణులైన విద్యార్థులు వారు విజయవంతంగా పూర్తి చేసిన కోర్సులను బట్టి డ్రోన్ కార్యకలాపాలు, నిర్వహణ, డిజైన్, తయారీ మరియు డేటా అనలిటిక్స్ మొదలైన వాటిలో ఉపాధి అవకాశాల కోసం వెతకవచ్చు. అధీకృత రిమోట్ పైలట్ శిక్షణా సంస్థ శిక్షణ సిలబస్, మౌలిక సదుపాయాలు, బోధకులు, పరికరాలు. మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన అవసరాలకు అనుగుణంగా ఖచ్చితంగా ఉండేలా విదేశీ సంస్థలతో సహకారం కలిగి ఉండేలా వెసులుబాటును కల్పిస్తుంది.
అనుబంధం-- I
రాష్ట్రాల వారీగా రిమోట్ పైలట్ శిక్షణా సంస్థల జాబితా
క్రమ సంఖ్య
|
రాష్ట్రం
|
రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ పేరు
|
1
|
జార్ఖ్ండ్
|
ఆల్కెమిస్ట్ ఏవియేషన్ ప్రయివేట్ లిమిటెడ్
|
2
|
మహారాష్ట్ర
|
రెడ్‌బర్డ్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ ప్రయివేట్ లిమిటెడ్
|
3
|
మహారాష్ట్ర
|
ది బాంబే ఫ్లయింగ్ క్లబ్
|
4
|
తమిళనాడు
|
సీఏఎస్ఆర్ అన్నా యూనివర్శిటీ
|
5
|
తెలంగాణ
|
ప్లయిటెక్ ఏవియేషన్ అకాడమీ
|
6
|
తెలంగాణ
|
తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ
|
7
|
ఉత్తర్ ప్రదేశ్
|
యాంబిషన్స్ ఫ్లయింగ్ క్లబ్ ప్రై. లిమిటెడ్
|
8
|
ఉత్తర్ ప్రదేశ్
|
ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ
|
9
|
ఉత్తర్ ప్రదేశ్
|
పయనీర్ ఫ్లయింగ్ అకాడమీ ప్రై. లిమిటెడ్
|
ఈ రోజు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (జనరల్ (డా) వి.కె.సింగ్ (రిటైర్డ్) ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1795286)
Visitor Counter : 161