జల శక్తి మంత్రిత్వ శాఖ

తాగునీటి నాణ్య‌త‌ను త‌నిఖీ చేసేందుకు ప్ర‌యోగ‌శాల‌లు

Posted On: 03 FEB 2022 5:10PM by PIB Hyderabad

రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించిన‌ట్టుగా దేశ‌వ్యాప్తంగా రాష్ట్ర‌, జిల్లా, స‌బ్ డివిజ‌న్‌, లేదా బ్లాక్ స్థాయిలో ఇప్ప‌టి వ‌ర‌కూ 2021 మంచినీటి నాణ్య‌త త‌నిఖీ ప్ర‌యోగ‌శాల‌ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. మంచినీటి నాణ్య‌త ప‌రీక్ష ప్ర‌యోగ‌శాల‌ల రాష్ట్రాల వారీ వివ‌రాలు అనెక్చ‌ర్‌- 1లో ఇవ్వ‌డం జ‌రిగింది. 
2024 నాటికి ప్ర‌తి గ్రామీణ ఆవాసానికీ త‌గిన ప‌రిమాణంలో, నిర్ణీత నాణ్య‌త‌తో, క్ర‌మ‌బ‌ద్ధ‌మైన‌, దీర్ఘ‌కాలిక ప్రాతిపదిక‌న ర‌క్షిత మంచి నీటి ని కుళాయి ద్వారా  స‌ర‌ఫ‌రా చేయ‌డానికి ఆగ‌స్టు 2019 నుంచి భార‌త ప్ర‌భుత్వం రాష్ట్రాల భాగ‌స్వామ్యంతో జ‌ల జీవ‌న్ మిష‌న్ (జెజెఎం) - హ‌ర్‌ఘ‌ర్ జ‌ల్ ను అమ‌లు చేస్తోంది. త‌ద్వారా నేటి వ‌ర‌కు, దేశంలో ఉన్న మొత్తం 19,27 కోట్ల గ్రామీణ ఆవాసాల‌లో 8.88 కోట్ల (46.09%) ఆవాసాల‌కు కుళాయి ద్వారా త‌మ ఇళ్ళ‌లో నీటి స‌ర‌ఫ‌రా జ‌రుగుతున్న‌ట్టు పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్రాల వారీ వివ‌రాలు అనెక్చ‌ర్ - II లో ఇవ్వ‌డం జ‌రిగింది.  
గ్రామీణ ఆవాసాలలో, అంగ‌న్‌వాడీ కేంద్రాలలో  కుళాయి నీటి క‌నెక్ష‌న్ల రాష్ట్రాలు /  కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లా, గ్రామాల వారీగా స్థితిగ‌తులు గురించి రాష్ట్రాలు/  కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఇచ్చిన స‌మాచారం పబ్లిక్ డొమైన్‌లో ఉంది. ఆ వివ‌రాల‌ను జెజెఎం డాష్‌బోర్డ్ లో దిగువ‌న పేర్కొన్న లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా తెలుసుకోవ‌చ్చుః 
https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx
ఈ స‌మాచారాన్ని జ‌ల‌శ‌క్తి మంత్రిత్వ శాఖ స‌హాయ మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ సింగ్ ప‌టేల్ లోక్‌స‌భ‌లో నేడు లిఖితపూర్వ‌కంగా ఇచ్చిన స‌మాచారం ద్వారా వెల్ల‌డించారు. 

***



(Release ID: 1795275) Visitor Counter : 92


Read this release in: English , Urdu , Tamil