పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని వివిధ మంత్రిత్వ శాఖలను కోరిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
Posted On:
03 FEB 2022 5:30PM by PIB Hyderabad
డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తమ పరిపాలనా నియంత్రణలో ఉన్న వివిధ సంస్థలను ప్రోత్సహించాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)తో సహా పలు మంత్రిత్వ శాఖలను అభ్యర్థించింది. వ్యవసాయం, ఔషధ పంపిణీ, మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిఘా, అత్యవసర ప్రతిస్పందన, రవాణా, జియో-స్పేషియల్ మ్యాపింగ్, రక్షణ మరియు చట్ట అమలు వంటి ఆర్థిక వ్యవస్థలోని దాదాపు అన్ని రంగాలకు డ్రోన్‌లు అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. వివిధ మంత్రిత్వ శాఖల క్రింద ఉన్న వివిధ డ్రోన్ అప్లికేషన్‌ల జాబితా అనుబంధం- Iలో తెలపడం జరిగింది. డ్రోన్ రూల్స్, 2021 ప్రకారం, డ్రోన్ ఎయిర్‌స్పేస్ మ్యాప్ జోన్‌లలో ఎరుపు మరియు పసుపు రంగులో ఉన్న జోన్‌లలో డ్రోన్‌ల ఆపరేషన్‌కు వరుసగా కేంద్ర ప్రభుత్వం మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అథారిటీ నుండి అనుమతి అవసరం. ప్రస్తుతం డ్రోన్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్న గ్రీన్ జోన్‌లో డ్రోన్‌ను ఆపరేట్ చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు.
***
(Release ID: 1795273)