శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్రీయ దృక్పథంతో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందింది-- డాక్టర్ జితేంద్ర సింగ్ బడ్జెట్ లో అంకుర సంస్థలకు ప్రోత్సాహం -- డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 01 FEB 2022 5:02PM by PIB Hyderabad

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా శాస్త్రీయ దృక్పథంతో  బడ్జెట్ కు రూపకల్పన జరిగిందని  కేంద్ర శాస్త్ర సాంకేతిక,భూగర్భ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు , ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర బాధ్యత ) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. తన మంత్రిత్వ శాఖలు, శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులు, వీటిపై బడ్జెట్ చూపించే ప్రభావం, ప్రయోజనాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ఇక్కడ మీడియాకు వివరించారు. "ఒక్క మాటలో చెప్పాలంటే' అంకుర సంస్థలకు ప్రోత్సాహం అందిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ 2022-23 రూపుదిద్దుకుంది." అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

రానున్న దశాబ్దం  భారతదేశానికి అత్యంత కీలకమైనవదని  డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈ దశాబ్దంలో రెండు అంశాలు కీలకంగా ఉంటాయని అన్నారు. ఆర్థిక అంశాలు, శాస్త్ర సాంకేతిక, ఆవిష్కరణ రంగాలు రానున్న దశాబ్ద కాలంలో పరిమాణాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు.  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందిస్తున్న సమర్ధ నాయకత్వంలో అభివృద్ధి సాదించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. భారత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ సమగ్ర బడ్జెట్ ను రూపొందించారని అన్నారు. గ్రామీణ, ఆరోగ్య, వ్యవసాయం, పారిశుధ్యంతో సహా అన్ని రంగాలకు బడ్జెట్ లో తగిన కేటాయింపులు జరిగాయని మంత్రి అన్నారు. 

బడ్జెట్ లో ప్రతి అంశం లేదా ప్రస్తావించిన ప్రతి అంశం శాస్త్రీయ పరిజ్ఞానం ఆవిష్కరణ రంగాలతో ముడి పడి ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం తో ముడిపడి ఉన్న డిజిటల్ రూపీ, 75 జిల్లాల్లో ఏర్పాటు చేయ తలపెట్టిన డిజిటల్ బ్యాంకులుడిజిటల్ విశ్వవిద్యాలయంకృత్రిమ మేధస్సుఅంతరిక్ష పరిజ్ఞానం తదితర అంశాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు. 

అంకుర సంస్థలకు ఆర్థిక మంత్రి  ప్రకటించిన ప్రోత్సాహకాలు దేశ భవిష్యత్తును నిర్దేశించే విధంగా ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. మరో ఏడాది పాటు ( 2024 వరకు) అంకుర సంస్థలకు పన్ను రాయితీ ఇవ్వాలని ఆర్థిక మంత్రి  తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ స్వాగతించారు. 

అంకుర సంస్థల ద్వారా ' డ్రోన్ శక్తి' కార్యక్రమాన్ని అమలు చేయడం, వ్యవసాయ రంగంలో కిసాన్ డ్రోన్ వినియోగాన్ని ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో మిగిలిన దేశాల కంటే భారతదేశం సాంకేతిక అంశాల అమలులో ముందు ఉంటుందని ఆయన అన్నారు. 

అంకుర సంస్థలను ప్రోత్సహించేందుకు ఎగుమతుల ప్రోత్సాహకాలను, దేశంలో ఉత్పత్తులకు ప్రోత్సాహకాలను అందించేందుకు బడ్జెట్ ప్రతిపాదించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

భూ శాస్త్ర మంత్రిత్వ శాఖకు భారీగా నిధులు కేటాయించడం పట్ల డాక్టర్ జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఒక చిన్న మంత్రిత్వ శాఖకు బడ్జెట్ లో 2,653.51 కోట్ల రూపాయలను కేటాయించి కేంద్ర ప్రభుత్వం సముద్ర జలాల అన్వేషణకు ఇస్తున్న ప్రాధాన్యతను వెల్లడించిందని అన్నారు. గతంలో డీప్ సీ మిషన్ కోసం కేటాయించిన 4,000 కోట్ల రూపాయలకు అదనంగా ప్రస్తుత కేటాయింపులు జరిగాయని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సముద్రాలు, సముద్ర సంపదపై ఆధారపడి ఉంటుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నమ్ముతున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు 6,000 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిలో గతంలో డిఎన్ఏ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసి ప్రస్తుతం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న బయోటెక్నాలజీ శాఖకు 2,581 కోట్ల రూపాయలను కేటాయించారని వివరించారు. 

కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న కాప్ 20 నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనిలో భాగంగా ఈ అంశాన్ని బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగిందని అన్నారు. హైడ్రోజన్ మిషన్ అమలు ద్వారా శాస్త్రీయ అంశాలకు ప్రధానమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.    

 

***


(రిలీజ్ ఐడి: 1794560) సందర్శకుల సూచీ సంఖ్య : : 203
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil