రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బస్సులలో ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లో ఫైర్ అలారం సిస్టమ్‌, అగ్నిమాప‌క వ్య‌వ‌స్థ ఏర్పాటు నోటిఫికేషన్ జారీ

Posted On: 29 JAN 2022 3:02PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, జనవరి 27, 2022 నాటి నోటిఫికేషన్ ప్రకారం, ఏఐఎస్ (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్)-135లో సవరణ చేసింది. దీని ప్ర‌కారం బస్సులలోని ప్యాసింజర్ (లేదా, ఆక్యుపెంట్) కంపార్ట్‌మెంట్‌లు అగ్ని మాప‌క  అలారం వ్య‌వ‌స్థ‌,  ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. టైప్ III బస్సులు ['టైప్ III' వాహనాలు సుదూర ప్రయాణీకుల రవాణాకు కూర్చున్న ప్రయాణీకుల కోసం రూపొందించబ‌డి నిర్మించబడ్డాయి] మరియు స్కూల్ బస్సులలో ఈ వ్య‌వ‌స్థ ఏర్పాటు చేసేలా స‌వ‌ర‌ణ చేయ‌డ‌మైంది. ప్రస్తుతం, ఏఐఎస్‌-135 ప్రకారం, ఇంజిన్ కంపార్ట్‌మెంట్ నుండి ఉత్పన్నమయ్యే మంటల కోసం అగ్ని గుర్తింపు, అలారం మరియు అగ్నిమాప‌క  వ్యవస్థలు నోటిఫై చేయ‌డం జ‌రిగింది. అగ్ని ప్రమాదాలపై అధ్యయనాల ప్ర‌కారం ప్రయాణీకులు ప్రధానంగా గాయాలు  కంపార్ట్మెంట్‌ల‌లో అగ్నికార‌ణంగా వెలువ‌డే ఎక్కువ వేడిమి,  పొగ కారణంగా చాలా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌వుతున్నారు.  అగ్ని ప్రమాదాల సమయంలో థర్మల్ మేనేజ్‌మెంట్ ద్వారా ప్రయాణికులు ప్రమాదాల‌ను నుంచి త‌రలి దూరంగాపోయే సమయాన్ని అందించడం ద్వారా ప్రయాణీకుల కంపార్ట్‌మెంట్‌లోని వేడి మరియు పొగను నియంత్రించినట్లయితే ఈ గాయాలను నివారించవచ్చు. నీటి పొగమంచు ఆధారిత యాక్టివ్ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ మరియు బస్సుల కోసం ఒక స్వతంత్ర ఫైర్ అలారం సిస్టమ్ ప్యాసింజర్ కంపార్ట్‌మెంట్‌లోని ఉష్ణోగ్రతను 50 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల నిర్వహించేలా రూపొందించబడ్డాయి. డీఆర్‌డీఓకు చెందిన సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సేఫ్టీ (సీఎఫ్ఈఈఎస్‌) సంస్థ‌తో క‌లిసి ప‌ని చేస్తున్న ఫైర్ రిస్క్ అసెస్‌మెంట్, ఫైర్ సప్రెషన్ టెక్నాలజీస్, మోడలింగ్ మరియు సిమ్యులేషన్ మొదలైన రంగాలలో భాగస్వామ్య‌ప‌క్షాలు, నిపుణులతో సంప్రదించిన త‌రువాత ఏఐఎస్ (ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్)-135 సవరణ చేయ‌డ‌మైంది.

***


(Release ID: 1793622) Visitor Counter : 127