శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో వెయ్యిడ్రోన్ల ప్రదర్శన!

ఢిల్లీకి స్టార్టప్ "బాట్.ల్యాబ్స్" ఆధ్వర్యంలో నిర్వహణ..

వెయ్యి డ్రోన్ల భారీ ప్రదర్శన జరిపిన 4వ దేశంగా,
చైనా, రష్యా, యు.కె. సరసన ఇక భారత్.కూ స్థానం...

టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు (టి.డి.బి.)నుంచి
పూర్తి స్థాయి ఆర్థిక సాయం పొందిన ప్రాజెక్టు..

"బాట్.ల్యాబ్స్" ఎం.డి., ఇంజినీర్లతో తన నివాసంలో
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ భేటీ..

స్టార్టప్ కంపెనీలకు ప్రపంచ కేంద్రంగా భారత్.ను
తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి కలను
సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి...

Posted On: 28 JAN 2022 4:20PM by PIB Hyderabad

   గణతంత్ర దినోత్సవ సంరంభంతో పాటుగా,.. దాదాపు వారం రోజుల పాటు జరిగిన కార్యక్రమాల ముగింపునకు సూచనగా రేపు సాయంత్రం నిర్వహించే బీటింగ్ రిట్రీట్ వేడుకల్లో "బాట్.ల్యాబ్స్" అనే భారతీయ స్టార్టప్ కంపెనీ ఆధ్వర్యంలో ఆకాశంలో వెయ్యి డ్రోన్లతో ప్రదర్శనను నిర్వహించనున్నట్టు కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ (స్వతంత్ర హోదా) సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు చెప్పారు. లేజర్ వెలుగులు విరజిమ్మే డ్రోన్ల ప్రదర్శనతో కూడిన బీటింగ్ రిట్రీట్ వేడుకలతో గణతంత్రదినోత్సవ కార్యక్రమాలన్నీ ముగిసిపోతాయని ఆయన అన్నారు.

కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ (టి.డి.బి.) ఆర్థిక సహాయంతో ఢిల్లీ ఐ.ఐ.టి. పూర్వ విద్యార్థుల నేతృత్వంలో ఇండియన్ స్టార్టప్ కంపెనీ అయిన బాట్.ల్యాబ్స్ రూపుదిద్దుకుంది.

  దీనితో వెయ్యి డ్రోన్లతో ఇంత భారీస్థాయిలో లేజర్ వెలుగుల ప్రదర్శనను నిర్వహిస్తున్న 4వ దేశంగా భారతదేశం అవతరించనుందని, ఈ ఘనతను ఇదివరకే సాధించిన  చైనా, రష్యా, యునైటెడ్ కింగ్ డమ్ దేశాల సరసన భారతదేశం కూడా నిలువనుందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు..

 

    https://ci5.googleusercontent.com/proxy/fGgE1MMYSb8YmEohjCGs_vvKYU8OF0Q_oEXqgg9usJhL-1tFnJhcYB47QVAK1O0bIsRMnIu6ZK0dyZq5b3awH6qzVBmayuVyBbi0mKI_RDaW9ZxIbt1l_TJ1Kg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RG3H.jpg

   డ్రోన్ల ప్రదర్శనకు సంబంధిం కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఈ రోజు తన నివాసంలో "బాట్‌ల్యాబ్" స్టార్టప్ బృందం సభ్యులైన తన్మయ్ బంకర్, సరితా అహ్లావత్, సుజిత్ రాణా, మోహిత్ శర్మ, హర్షిత్ బాత్రా, కునాల్ మీనా తదితరులతో సంభాషించారు. దేశంలోనే తొలిసారిగా, ఒకేసారి వెయ్యి డ్రోన్ల ప్రదర్శనతో ఆకాశాన్ని మిరుమిట్లు గొలింపించ బోతున్నామనే భావోద్వేగం బాట్.ల్యాబ్ డైనమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఇంజనీర్లలో కనిపించిందని మంత్రి తెలిపారు.

https://ci3.googleusercontent.com/proxy/meQUsG8YdPpDMm03squUEZ6P0UxhH2zBDVhIAe2AD-4pCTUMWXYTMbAGTXWYjMtze3BP_0oAE81YoSdssAgJdRuIxegmRZ9QliLXne11Mqfw8nUsvhOBEJb0Gw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002L05Z.jpg

   కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి.) నుంచి బాట్‌ల్యాబ్ డైనమిక్స్‌ సంస్థకు  తొలుతగా కోటి రూపాయల సీడ్ ఫండ్‌ను అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ తర్వాత వాణిజ్య కార్యకలాపాల  ప్రోత్సాహం కోసం సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి బోర్డు ద్వారా రూ. 2.5 కోట్లు ఇచ్చామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. స్టార్టప్ సంస్థల సానుకూల వ్యవస్థలో ప్రపంచ స్థాయి  కేంద్రంగా  భారతదేశాన్ని తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆకాంక్షలకు, కలలకు అనుగుణంగా స్టార్టప్‌లకు ఇలా మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

https://ci6.googleusercontent.com/proxy/8bXL3IJ_RySwHF6IqWsB2zyo_6etbqckuJu8JqEL-bnePJQqCdcUnoZb3ZVSR3pYJhgjc1-I430-K_A7jy-j8xQdShoreXhLxQZSb9bS1QYT9XvyZuVBRA0EWg=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003WO69.jpg

   బాట్.ల్యాబ్ డైనమిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సరితా అహ్లావత్ మాట్లాడుతూ, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంపూర్ణ మద్దతు, ఆర్థిక సహకారం కారణంగానే ఈ డ్రోన్ ప్రాజెక్టు విజయవంతమైందని అన్నారు. హార్డ్ వేర్ కు సంబంధించిన స్టార్టప్ కార్యకలాపాలపట్ల ప్రైవేటు రంగం సంస్థలన్నీ విముఖంగా ఉన్న తరుణంలో తమకు ఈ ప్రాజెక్టు బాధ్యతను అప్పగించారని ఆమె అన్నారు. బహుళ జాతి సంస్థలనుంచి వచ్చిన లాభదాయకమైన అవకాశాలను పక్కన బెట్టి మరీ ఈ  ప్రాజెక్టుకోసం పనిచేసిన ఇంజినీర్లందరీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “3డి కొరియాగ్రాఫ్ ద్వారా డ్రోన్ వెలుగుల ప్రదర్శన కోసం 500నుంచి1000 డ్రోన్‌లతో రీకాన్ఫిగరబుల్ స్వార్మింగ్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్” ప్రాజెక్టుకు అన్ని విధాలా మద్దతును, ప్రోత్సాహాన్ని అందించినందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌కి సరిత కృతజ్ఞతలు తెలిపారు.

  ఇండియన్ ఇన్.స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రూపుదిద్దుకున్న బాట్‌ల్యాబ్ డైనమిక్స్ సంస్థ, తనకు ఆర్థిక సహాయం అందిన  6 నెలల తక్కువ వ్యవధిలోనే ఫ్లీట్ 1000 స్వార్మ్ డ్రోన్లను అభివృద్ధి చేయగలగడం సంతోషదాయకమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఫ్లైట్ కంట్రోలర్ (డ్రోన్.కు  మెదడు వంటి వ్యవస్థ), ప్రిసిషన్ జి.పి.ఎస్., మోటార్ కంట్రోలర్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్,.. తదితర హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఉపకరణాలు,  అన్ని ఇతర భాగాల అభివృద్ధితో కూడిన ఈ ప్రాజెక్టును స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేయడం మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి, బాట్‌ల్యాబ్ కంపెనీ ఈ వినూత్నమైన ‘డ్రోన్ షో’ను రూపొందించినట్లు జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ డ్రోన్ల ప్రదర్శన 10 నిమిషాల వ్యవధితో ఉంటుందని , గత 75 ఏళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను ఇది పలు సృజనాత్మక రూపాలతో ఆకాశంలో కన్నుల పండువగా ప్రదర్శిస్తుందని ఆయన చెప్పారు.

  కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయానికి ఈ ప్రాజెక్టు చక్కని తార్కాణమని జితేంద్ర సింగ్ అన్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి,.. రక్షణ మంత్రిత్వ శాఖ, సైన్స్ టెక్నాలజీ శాఖ, సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి బోర్డు, ఢిల్లీ ఐ.ఐ.టి.లకు చెందిన సీనియర్ అధికారులనుంచి అందరూ కృషి చేశారని, ఆత్మనిర్భర భారత్  లక్ష్య సాధనలో భాగంగా భారతీయ స్టార్టప్ కంపెనీకి అందరూ సహకరించారని ఆయన అన్నారు.  

  కొత్త అవకాశాలను, సృజనాత్మక రంగాలను అందుబాటులోకి తెచ్చేందుకు, అందుకు అవసరమైన సానుకూల వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర సైన్స్ టెక్నాలజీ శాఖ పరిధిలోని సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి బోర్డు (టి.డి.బి.) ఎప్పుడూ కీలకంగా వ్యవహరిస్తూ వస్తోందని ఆయన అన్నారు. రానున్న దశాబ్ద కాలంలో దేశం ఆర్థిక, వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి సాధించడంలో కొత్త టెక్నాలజీలే కీలకపాత్ర పోషిస్తాయని టి.డి.బి. భావిస్తున్నట్టు ఆయన చెప్పారు.

   టి.డి.బి. కార్యదర్శి రాజేశ్ కుమార్ పాఠక్ మాట్లాడుతూ, సమయాభావం కారణంగా డ్రోన్ల ప్రదర్శన ప్రాజెక్టు టి.డి.బి.కి ఒక సవాలుగా మారిందని, అయితే ఈ  ప్రాజెక్టు సృజనాత్మక స్వభావం, జాతి నిర్మాణానికి గల అవకాశం కారణంగా దీన్ని టి.డి.బి. చేపట్టిందని అన్నారు. అయితే, సకాలంలో తాము తగిన సహాయం అందించగలగడం తమకు సంతోషం కలిగించిందని అన్నారు. ప్రాజెక్టుకు సకాలంలో అందించిన మద్దతుకుగాను, టి.డి.బి. మాజీ చైర్ పర్సన్, సైన్స్ టెక్నాలజీ శాఖ మాజీ కార్యదర్శి అయిన ప్రొఫెసర్ అశుతోష్ శర్మకు పాఠక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాధాన్యతను అర్థం చేసుకున్న టి.డి.బి. మాజీ కార్యదర్శి డాక్టర్ నీరజ్ శర్మకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

  స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధి, వినియోగంలో కృషి చేయడానికి ప్రయత్నించే భారతీయ పారిశ్రామిక సంస్థలకు, ఇతర ఏజెన్సీలకు టి.డి.బి. ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తోంది. విస్తృతస్థాయిలో దేశీయ వినియోగం కోసం దిగుమతి చేసుకున్న టెక్నాలజీలను సానుకూలం చేసుకునేందుకు కూడా టి.డి.బి. తగిన ఆర్థిక సహకారం అందిస్తుంది. హై రిస్క్ తో కూడిన టెక్నాలజీతో ప్రమేయం ఉన్న కంపెనీలకు కూడా ఈ బోర్డు తగిన ఆర్థిక సహాయం అందిస్తుంది.

 

<><><>(Release ID: 1793559) Visitor Counter : 59


Read this release in: English , Urdu , Hindi , Tamil