వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ల‌ఉమ్మ‌డి ఫ‌లిత (ఔట్‌క‌మ్‌) ప్ర‌క‌ట‌నః భార‌త రిప‌బ్లిక్‌, యునైటెడ్ కింగ్డ‌మ్ మ‌ధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం తొలి విడ‌త చ‌ర్చ‌లు

Posted On: 28 JAN 2022 9:02PM by PIB Hyderabad

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టిఎ) కోసం భార‌త్ రిపబ్లిక్‌, యునైటెడ్ కింగ్డ‌మ్ మ‌ధ్య తొలి విడ‌త చ‌ర్చ‌లు ముగిశాయి.  కోవిడ్ మ‌హ‌మ్మారి స‌వాళ్ళు విసిరిన‌ప్ప‌టికీ దాదాపు 2 వారాల పాటు దృశ్య‌మాధ్య‌మం ద్వారా  ఈ చ‌ర్చ‌లు న‌డ‌వ‌డంతో తొలి విడ‌త చ‌ర్చ‌ల ప్రాముఖ్య‌త‌ను ఇరు ప‌క్షాలూ గుర్తించాయి. 
ఈ విడ‌త‌లో రెండు ప‌క్షాల‌కు చెందిన సాంకేతిక నిపుణులు ఒక ద‌గ్గ‌ర కూడి 36 వేర్వేరు సెష‌న్ల‌లో 26 విధాన‌ప‌ర‌మైన రంగాల‌కు సంబంధించిన అంశాలు చ‌ర్చించారు. ఇందులో వ‌స్తువుల వ్యాపారం, ఆర్థిక సేవ‌లు, టెలిక‌మ్యూనికేష‌న్లు స‌హా సేవ‌ల‌లో వాణిజ్యం, పెట్టుబ‌డులు, మేథో సంప‌త్తి, క‌స్ట‌మ్స్‌, ట్రేడ్ ఫెసిలిటేష‌న్‌, పారిశుద్ధ్యం, ఫైటో శానిట‌రీ చ‌ర్య‌లు, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, పోటీ, జెండ‌ర్‌, ప్ర‌భుత్వ సేక‌ర‌ణ‌, ఎస్ఎంఇలు, నిల‌క‌డ‌, పార‌ద‌ర్శ‌క‌త‌, వాణిజ్యం & అభివృద్ధి, భౌగోళిక సూచీలు, డిజిట‌ల్ త‌దిత‌ర అంశాలు ఉన్నాయి.  చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌వంతం అవ‌డ‌మే కాక‌, ప్ర‌పంచంలోని వ‌రుస‌గా 5వ‌, 6వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య వాణిజ్యాన్ని ప్రోత్స‌హించ‌డానికి స‌మ‌గ్ర ఒప్పందాన్ని సాధించాల‌నే ఉమ్మ‌డి ఆశ‌యాన్ని ప్ర‌తిబింబించాయి. తొలి రౌండ్‌లో జ‌రిగిన సానుకూల చ‌ర్చ‌లు యుకె, భార‌త్‌లు సానుకూల‌, స‌మ‌ర్ధ‌వంత‌మైన పురోగ‌తిని సాధించ‌డానికి పునాది వేశాయి.
రెండ‌వ విడ‌త చ‌ర్చ‌లు 7-18 మార్చి 2022 మ‌ధ్య చోటు చేసుకోనున్నాయి. ఇరు ప‌క్షాలూ కూడా ఈ చ‌ర్చ‌ల‌ను 2022 చివ‌రి నాటికి ముగించాల‌నే ఉమ్మ‌డి ఆశ‌యంతో ఉన్నాయి. ఒక స‌మ‌గ్ర ఒప్పందాన్ని సాధించాల‌ని ఇరు ప‌క్షాలు చేస్తున్న కృషిలో భాగంగా, ప్ర‌ధాన సంధాన‌క‌ర్త‌లు తాత్కాలిక ఒప్పందం వ‌ల్ల లాభాల‌ను ప‌రిశీలిస్తారు. 

***



(Release ID: 1793465) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Hindi