రక్షణ మంత్రిత్వ శాఖ
ఇఎన్‌సిలో రిపబ్లిక్ దినోత్సవ కవాతు
Posted On:
26 JAN 2022 2:02PM by PIB Hyderabad
ఐఎన్ ఎస్ సర్కార్స్ వద్ద తూర్పు నావల్ కమాండ్ (ఇఎన్ సి) పరేడ్ గ్రౌండ్‌లో 73 వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా గణతంత్రదినోత్సవ పరేడ్‌జరిగింది. వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్త ,ఎవిఎస్ఎం, వైఎస్ఎం, విఎస్ఎం,ఇఎన్‌సి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ ఈ సందర్భంగా 50మెన్ గార్డ్ నుంచి వందనం స్వీకరించి పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన వివిధ నౌకలు, సబ్ మెరైన్‌లు, ఎస్టాబ్లిష్‌మెంట్లకు చెందిన నౌకాదళానికి చెందిన ప్లటూన్ల ను సమీక్షించారు. వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, ఎవిఎస్ ఎం, ఎన్ఎం ఛీఫ్ ఆఫ్ స్టాఫ్, ఇఎన్‌సి పరేడ్‌కు నిర్వాహక అధికారిగా ఉన్నారు. ఈ కవాతుకు అందరు ఫ్లాగ్ ఆఫీసర్లు, అన్ని నౌకల, సబ్ మెరైన్ల కమాండింగ్ అధికారులు విశాఖపట్నంలోని ఎస్టాబ్లిష్ మెంట్‌లకు చెందిన వారందరూ హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా అన్ని కోవిడ్ నిబంధనలు ప్రొటోకాల్స్ పాటించారు.
నావల్ ఇన్వెస్టిట్యూర్ ఉత్సవం కూడా ఈ పరేడ్ సందర్బంగా నిర్వహించారు వైస్ అడ్మిరల్ దాస్ గుప్త , ప్రముఖ సీమాన్ నవీన్ కుమార్ కు నవ్‌సేనా మెడల్ (గ్యాలంటరీ)ని బహుకరించారు. కాశ్మీర్ లో ఇద్దరు కరడుగట్టిన ఉగ్రవాదులను హతమార్చడంలో విధినిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించినందుకు ఈ మెడల్ బహుకరించారు., కమాండర్ ఇన్ ఛీఫ్, విధినిర్వహణలో అంకిత భావం ప్రదర్శించినందుకు నవ్‌సేనా మెడల్‌ను సిఎండిఇ రాహుల్ విలాస్ గోఖలేకు బహుకరించారు. 29 సంవత్సరాలు నౌకాదళానికి అందించిన అద్భుత సేవలకు ఈ మెడల్ బహుకరించారు.
లెఫ్టినెంట్ కమాండర్ తుషార్ బహల్ (రిటైర్డ్)కు లెఫ్టినెంట్ వి.కె.జైన్ స్మారక అవార్డును బహుకరించారు. ఎంబెడెడ్ టెక్నాలజీలలో అనువర్తిత అద్భుత పరిశోధనకు గాను ఈ అవార్డును ఆయనకు బహుకరించారు.
ఎస్ ఎ వి ఎల్ హరనంద్ పి.ఒ.ఎ (ఎ.హెచ్) కి కెప్టెన్ రవి ధిర్ మెమోరియల్ స్వర్ణపతకం బహుకరించారు. నావల్ కార్యకలాపాలలో ఫ్లైట్ సేఫ్టీకి ఈ పతకం బహుకరించారు. కమాండర్ ఇన్ ఛీఫ్2020 సంవత్సరానికి విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌కు , ఐఎన్ ఎస్ జలాశ్వకు అద్భుత పనితీరు కనబరిచినందుకు యూనిట్ సైటేషన్లు బహుకరించారు.
పరేడ్ లోని వారినుద్దేశించి ప్రసంగిస్తూ కమాండర్ ఇన్ ఛీఫ్, నావికాదళానికి చెందిన డిఫెన్స్ సివిలియన్స్, వారి కుటుంబ సభ్యులు అందరికీ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ దినోత్సవ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావించారు అలాగే ప్రాథమిక హక్కులు అందరికీ తెలుసునని, రాజ్యాంగంలోని ప్రాధమిక విధులను కూడా తెలుసుకుని వాటికి కట్టుబడి ఉండాల్సిన ఆవశ్యకత గురించి నొక్కిచెప్పారు.
వైస్ అడ్మిరల్ దాస్ గుప్త మాట్లాడుతూ ప్రస్తుత కోవిడ్ మూడో వేవ్ మహమ్మారి సందర్భంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని, సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్కు ధరించాలని , కోవిడ్ కు సంబంధించిన ప్రొటోకాల్స్‌ను పాటించడం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, అలాగే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకు విశాఖపట్నంలో మల్టీలేటర్ నావల్ ఎక్సర్‌సైజ్ మిలన్ జరుగుతుందని చెప్పారు. ఈ రెండు ఈవెంట్‌లు విజయవంతం గా నిర్వహించేందుకు ప్రతిఒక్కరూ శ్రద్ధతో పనిచేయాలని కమాండింగ్ ఇన్ ఛీఫ్ అన్నారు. ఈ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున అతిథులు హాజరౌతున్నారు. గౌరవ రాష్ట్రపతి,ప్రధానమంత్రి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రక్షణ మంత్రి, ఇంకా పెద్ద సంఖ్యలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
అవార్డులు గెలుచుకున్న వారందరికి, వారి కుటుంబ సభ్యులకు కమాండర్ ఇన్ ఛీఫ్ శుభాకాంక్షలు తెలిపారు. పరేడ్ లోని వారు, అతిథుల జాతీయగీతాలాపనతో ఈ ఉత్సవం ముగిసింది.
***
(Release ID: 1793010)
Visitor Counter : 236