రక్షణ మంత్రిత్వ శాఖ
గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న అండమాన్ & నికోబార్ కమాండ్
Posted On:
26 JAN 2022 3:00PM by PIB Hyderabad
26 జనవరి 2022న నేతాజీ స్టేడియం, పోర్ట్ బ్లెయిర్, అండమాన్ మరియు నికోబార్ దీవులలో 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సవ పరేడ్ నిర్వహించబడింది. అండమాన్ మరియు నికోబార్ దీవుల కవాతుకు ముఖ్య అతిథిగా వచ్చిన లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డికె జోషి (రిటైర్డ్) పరేడ్‌ను సమీక్షించారు. ఈ కవాతుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ మరియు ఏ&ఎన్ పోలీస్‌లకు చెందిన కంటెంజెంట్స్‌తో కూడిన ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ సీడీఆర్ సందీప్ ఆర్ నాయకత్వం వహించారు.
కవాతులో ముఖ్య అతిథి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో ఎంఐ-17వి5 హెలికాప్టర్ ద్వారా పూల వర్షం మరియు జెండా ట్రూపింగ్ జరిగింది. ప్రతి కవాతు బృందంలో ఒక అధికారి, ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి మరియు పదిహేను మంది ఇతర ర్యాంకులు ప్రాతినిధ్యం వహించారు. పాల్గొన్న ప్రతి బృందం గర్వం మరియు ఉత్సాహం అండమాన్ నికోబార్ కమాండ్‌లో ఆయుధాల యొక్క ఉన్నత స్థాయి ఏకీకరణ మరియు ఉమ్మడి సంస్కృతి యొక్క పరిణామాన్ని ప్రతిబింబించింది. కార్యక్రమ నిర్వహణ సమయంలో అన్ని ప్రభుత్వ మార్గదర్శకాలు మరియు కోవిడ్ ప్రోటోకాల్‌లు పాటించబడ్డాయి
***
(Release ID: 1793007)
Visitor Counter : 164