శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ప్రజా ఆరోగ్య రంగంలో శాస్త్ర సాంకేతిక సహకారాన్ని మరింత పెంపొందించేందుకు వీలు కల్పించే అవగాహన ఒప్పదంపై సంతకాలు చేసిన సీఎస్ఐఆర్ , ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్

Posted On: 26 JAN 2022 3:07PM by PIB Hyderabad

ఆరోగ్య పరిశోధన రంగంలో పరస్పర సహకారంతో పని చేసేందుకు వీలు కల్పించే అవగాహనా ఒప్పందంపై నిన్న సీఎస్ఐఆర్ , ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ సంతకాలు చేసాయి. ఇరు దేశాల శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో  ఈ ఒప్పందం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం కొత్తగా అభివృద్ధి చెందుతున్న, పునరావృతం అవుతున్న అంటువ్యాధులు, వంశపారంపర్యంగా సంక్రమిస్తున్న రుగ్మతలపై భారత్, ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా పరిశోధనలు నిర్వహించి వీటి నివారణకు సమర్ధంగా పనిచేసి, అందరికీ అందుబాటులో విధంగా పరిష్కార మార్గాలను అభివృద్ధి చేస్తాయి. వీటివల్ల రెండు దేశాల ప్రజలకు మాత్రమే కాకుండా  యావత్తు మానవాళికి ప్రయోజనం కలుగుతుంది. ప్రజా ఆరోగ్య రంగంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో  చోటు చేసుకుంటున్న మార్పులు పై దృష్టి సారించి పరిశోధనలు చేపట్టి అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి సీఎస్ఐఆర్ , ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ కలిసి పనిచేస్తాయి. సీఎస్ఐఆర్ , ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ ల శాస్త్రవేత్తలు, రెండు సంస్థలకు చెందిన సంస్థలు, పరిశోధన శాలలు సంయుక్తంగా పరిశోధనలు చేపడతాయి. 

అవగాహన ఒప్పందంపై భారత్ తరఫున  సీఎస్ఐఆర్ డీజీ, డిఎస్ఐఆర్ కార్యదర్శి   డాక్టర్ శేఖర్ సి. మాండే ,ఫ్రాన్స్ తరఫున  ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ అధ్యక్షుడు ప్రొఫెసర్ స్టీవార్ట్ కోలే సంతకాలు చేశారు. రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం పట్ల భారతదేశంలో ఫ్రాన్స్ రాయబారి శ్రీ ఇమ్మాన్యుయేల్ లెనైన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందంతో రెండు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని ఆయన అన్నారు. కార్యక్రమానికి ఫ్రాన్స్ లో భారత రాయబారి, భారత రాయబార కార్యాలయ ప్రతినిధిగా హాజరైన డిప్యూటీ చీఫ్ అఫ్ మిషన్ డాక్టర్ ప్రఫుల్ల చంద్ర మిశ్రా కార్యక్రమం అమలుకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ప్రపంచాన్ని మహమ్మారి పట్టి పీడిస్తున్న సమయంలో మానవాళి ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడిందని అన్నారు. రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహన సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరైన భారత, ఫ్రాన్స్ దేశాల విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఒప్పందం నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందనిదీనిని విజయవంతం చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. 

 ఎంఓయు కింద చేపట్టనున్న కార్యక్రమాలను  సీఎస్ఐఆర్  -సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి)  డాక్టర్ వినయ్ కె. నందికూరి, పాశ్చర్ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సైంటిఫిక్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ క్రిస్టోఫే డిఎంఫెర్ట్  వివరించారు. సీఎస్ఐఆర్,  పాశ్చర్ సంస్థలు ఒకేవిధమైన అంశాలపై పరిశోధన అభివృద్ధి అంశాలపై దృష్టి సారించి పనిచేస్తూ అపారమైన అనుభవాన్ని కలిగి ఉన్నాయని ఫ్రాన్స్ ఉన్నత విద్య, పరిశోధన ఆవిష్కరణల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ క్లారియే గిరై  అన్నారు. ఒప్పందంపై హర్షం వ్యక్తం చేసిన డాక్టర్ క్లారియే గిరై  ఇది పూర్తి స్థాయిలో అమలు జరిగేందుకు సహకరిస్తామని అన్నారు.   నుండి ఆరోగ్య సంరక్షణ డొమైన్‌లోని సీనియర్ నాయకత్వం సీఎస్ఐఆర్ , పాశ్చర్ సంస్థలకు చెందిన ఆరోగ్య రంగ నిపుణులు, రెండు సంస్థలకు చెందిన  14 మంది సభ్యులతో కూడిన  ప్రతినిధి బృందం,  భారతదేశం మరియు ఫ్రెంచ్ మిషన్ మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి 10 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు (హైబ్రిడ్ ఆన్  భారతదేశం వైపు).

2019లో ఒప్పందంపై రెండు దేశాల మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. దీనిపై రెండు దేశాలు 2020లో సంయుక్తంగా ఒక వర్కుషాప్ నిర్వహించాయి. రెండు సంస్థల్లో పనిచేస్తున్న అనుభవం కలిగిన యువ శాస్త్రవేత్తలు కలిసి పని చేస్తే మరిన్ని  ఆవిష్కరణలు, పరిష్కార మార్గాలను అభివృద్ధి చేయవచ్చునని గుర్తించారు. కణ అభివృద్ధి వైరాలజీటీకా అభివృద్ధిఅంటు వ్యాధులుమరియు కంప్యూటేషనల్ బయాలజీ మరియు హ్యూమన్ ఎవల్యూషనరీ జెనెటిక్స్ స్టడీస్‌పై పనిచేస్తున్న సంస్థలు ఈ అంశాలపై సంయుక్త పరిశోధనలు చేపడతాయి. మానవాళికి ప్రయోజనం కలిగించే అంశాల అభివృద్ధికి  పాశ్చర్ సంస్థ తో కలిసి చేసే కృషి ఫలిస్తుందన్న ధీమాను సీఎస్ఐఆర్ వ్యక్తం చేసింది. 

కార్యక్రమంలో సీఎస్ఐఆర్  -సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబి)  డాక్టర్ వినయ్ కె. నందికూరి,  సీఎస్ఐఆర్ డీజీ, డిఎస్ఐఆర్ కార్యదర్శి   డాక్టర్ శేఖర్ సి. మాండే, సీఎస్ఐఆర్ చీఫ్  సైంటిస్ట్ డాక్టర్ రామస్వామి బన్సల్, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ చీఫ్  సైంటిస్ట్ శ్రీ ఎస్.కె. వర్షన్, భారతదేశంలో ఫ్రాన్స్ రాయబార కార్యాలయ విద్య, సైన్స్, కల్చర్ డిప్యూటీ కౌన్సిలర్ డాక్టర్ నికోలస్ గెరార్ది, భారతదేశం ఫ్రాన్స్ రాయబారి  శ్రీ ఇమ్మాన్యుయేల్ లెనైన్, ఇన్‌స్టిట్యూట్ పాశ్చర్ ప్రొఫెసర్ స్టీవార్ట్ కోలే పాల్గొన్నారు. 



(Release ID: 1792860) Visitor Counter : 166