వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పి.ఎం.జి) పోర్టల్ ద్వారా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ఫాస్ట్ ట్రాక్ అమలును సమీక్షించిన - శ్రీ పీయూష్ గోయల్
మౌలికసదుపాయాల ప్రాజెక్టులలో అవరోధాల పరిష్కారాన్ని, 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులతో సులభతరం చేయనున్న - పి.ఎం.జి. పోర్టల్
మొత్తం 48.94 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అమలవుతున్న 1,351 ప్రాజెక్టుల అమలును ప్రస్తుతం పర్యవేక్షిస్తున్న - పి.ఎం.జి.
2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో 22 సమావేశాలు నిర్వహించి, 389 సమస్యలను పరిష్కరించిన - డి.పి.ఐ.ఐ.టి.
Posted On:
25 JAN 2022 7:15PM by PIB Hyderabad
ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పి.ఎం.జి) పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు వేగాన్ని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమీక్షించారు. ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రాధాన్యతపై అమలు చేసే ఏజెన్సీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
ఇన్వెస్ట్ ఇండియా యొక్క పి.ఎం.జి. పోర్టల్ అనేది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలోని అడ్డంకుల పరిష్కారాన్ని సులభతరం చేయడంతో పాటు, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు పర్యవేక్షణను, 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడులతో సులభతరం చేయడానికి ఒక ప్రత్యేకమైన సంస్థాగత యంత్రాంగం. ప్రస్తుతం, పి.ఎం.జి., మొత్తం 48.94 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అమలవుతున్న 1,351 ప్రాజెక్టుల అమలును పర్యవేక్షిస్తోంది. రోడ్డు, రవాణా, రహదారులు; రైల్వేలు; పెట్రోలియం, సహజ వాయువు; నూతన మరియు పునరుత్పాదక శక్తి; విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖల ప్రాజెక్టులను ఈ పోర్టల్ లో పొందుపరచడం జరిగింది. ప్రాజెక్టుల అమలులో ఆటంకాలు కలిగించే సంబంధిత ప్రభుత్వ సంస్థలతో సమస్యలను ప్రస్తావించడానికి, ప్రాజెక్ట్ ప్రతిపాదకులను పి .ఎం.జి. యంత్రాంగం అనుమతిస్తుంది.
పి.ఎం.జి. పోర్టల్‌లో లేవనెత్తిన సమస్యల్లో ప్రధానంగా భూ సేకరణకు సంబంధించినవి (సుమారు 40 శాతం); వినియోగ హక్కు / మార్గాన్ని ఉపయోగించుకునే హక్కు మంజూరు (25 శాతం); అటవీ, పర్యావరణం, వన్యప్రాణుల అనుమతులు (14 శాతం) ఉన్నాయి. నిర్ణీత సమయంలో పూర్తి చేయవలసిన ప్రాజెక్టు ల పర్యవేక్షణను కూడా పి.ఎం.జి. 2021 లో చేర్చింది. సమయాన్ని, వ్యయాన్ని అధిగమించడానికి, అదేవిధంగా, ఆలస్యానికి బాధ్యత వహించే ఏజెన్సీలను, అధికారులను గుర్తించడానికి ప్రాజెక్తుల్లో జాప్యాన్ని అంచనా వేయడానికి, ఈ లక్షణం అనుమతిస్తుంది. ఒకసారి, పి.ఎం.జి. లో నమోదైన తర్వాత, ప్రాజెక్టులు, తత్సంబంధ సమస్యలను, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమావేశాల ద్వారా పరిష్కారించడం జరుగుతుంది. ఒక ప్రాజెక్టుకు సంబంధించిన భాగస్వాములందిరికీ, ఈ పోర్టల్ అందుబాటులో ఉన్నందువల్ల, సాధారణ నవీకరణలు, సమావేశాల ద్వారా, సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించడం వలన పోర్టల్ అతుకులు లేని సమాచారాన్ని అందిస్తుంది.
ప్రధానమంత్రి దార్శనికత లో భాగమైన ఆత్మనిర్భర్-భారత్ కు ప్రోత్సాహకరంగా, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి, ఈ పి.ఎం.జి. పోర్టల్ లో ఉన్న కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా, 2021 జూన్ నెలలో ఎంపిక చేసిన ప్రాజెక్టులను సమీక్షించడం జరిగింది. కేంద్ర మంత్రి మార్గదర్శకత్వంలో, 01.04.2021 నుంచి ఇప్పటివరకు, 17.9 లక్షల కోట్ల రూపాయల విలువైన 687 ప్రాజెక్టుల పర్యవేక్షణతో పాటు వాటిని సకాలంలో పూర్తి చేయడం కోసం, పి.ఎం.జి. పరిధిలోకి తీసుకురావడం జరిగింది. తద్వారా ప్రారంభం నుండి ఇప్పటివరకు పి.ఎం.జి. వద్ద నమోదైన మొత్తం ప్రాజెక్టుల సంఖ్య 1,726 కు చేరింది.
సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, నిన్నటి సమీక్షా సమావేశంలో, శ్రీ పీయూష్ గోయల్ ఆదేశించారు. డి.పి.ఐ.ఐ.టి., 2021 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో 22 సమావేశాలు నిర్వహించి, 389 సమస్యలను పరిష్కరించింది. పి.ఎం.జి. యంత్రాంగం ద్వారా, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అమలు చేసే ఏజెన్సీల మధ్య భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా సమన్వయం పెరిగింది.
*****
(Release ID: 1792730)
Visitor Counter : 162