సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
దూరదర్శన్ ద్వారా గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం
Posted On:
24 JAN 2022 6:08PM by PIB Hyderabad
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారతదేశం ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్ ను జరుపుకుంటున్న సందర్భంగా, దూరదర్శన్ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం కేవలం మెగా స్థాయిలోనే కాకుండా, లక్షణాలలో కూడా ప్రత్యేకమైనది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి, 75 సంవత్సరాలైన సందర్భంగా, వివిధ ఆకృతులలో 75 పెద్ద విమానాల విన్యాసాల ప్రత్యక్ష ప్రసారాలతో పాటు, గగనతలంలో విమాన సమూహాలు "ఫ్లై-పాస్ట్" ప్రదర్శించే నూతన అంశాలను ప్రసారం చేయడానికి, భారత వైమానిక దళంతో కలిసి దూరదర్శన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యక్ష ప్రసారం కోసం 59 కెమెరాల తో 160 మందికి పైగా సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్రపతి భవన్ నుండి రాజ్-పథ్ మీదుగా ఇండియా గేట్ వద్ద ఉన్న జాతీయ యుద్ధ స్మారకం వరకు దూరదర్శన్ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసింది.
గణతంత్ర దినోత్సవం రోజున జరిగే ప్రతి అంశానికి సంబంధించిన అన్ని దృశ్యాలను 360 డిగ్రీల పరిధిలో ప్రసారం చేసే విధంగా ఏర్పాట్లను నిర్ధారించడానికి 2021 నవంబర్ నుండి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. రాజ్-పథ్ పొడవునా రాష్ట్రపతి భవన్ గోపురం నుండి నేషనల్ స్టేడియం గోపురం వరకు దూరదర్శన్ 59 కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటిలో, రాజ్-పథ్ లో 33 కెమెరాలు; జాతీయ యుద్ధ స్మారకం; ఇండియా గేట్, నేషనల్ స్టేడియంల వద్ద 16 కెమెరాలు; రాష్ట్రపతి భవన్ వద్ద 10 కెమెరాల చొప్పున ఏర్పాటు చేశారు.
మొత్తం వేడుకలను ప్రజలకు విహంగవీక్షణం గా చూపించడానికి వీలుగా, 360 డిగ్రీల పరిధిలో దృశ్యాలను చిత్రీకరించే రెండు కెమెరాలను, ఒకటి రాజ్-పథ్ వద్ద; మరొకటి ఇండియా గేట్ పై భాగంలో, ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల పరిధిలో ఈ రెండు కెమెరాలు చిత్రీకరించే దృశ్యాలను డి.డి. నేషనల్ యూట్యూబ్ ఛానెల్ లో రెండు వేర్వేరు స్ట్రీమ్ ల ద్వారా నిర్విరామంగా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది.
https://www.youtube.com/watch?v=SWWpb9ZDUII&list=PLUiMfS6qzIMx0yBaj1nzjLevzheuTOcc_&index=3
భూ ఉపరితలంపై కన్నుల పండువగా సైనిక దళాలు చేసే కవాతు తో పాటు, గగనతలంలో విమాన సమూహాలు వళ్ళు గగుర్పొడిచే విధంగా చేసే రకరకాల విన్యాసాలను ప్రతి క్షణం ప్రసారం చేయడం కోసం, ఐదు జిమ్మీ జిబ్ లు, 100 ఎక్స్ మరియు 86 ఎక్స్ Tally లెన్స్ లతో పాటు, 15 కంటే ఎక్కువ వైడ్ యాంగిల్ లెన్స్ లు, అబాకస్ లెన్స్ లు మొదలైన వాటిని దూరదర్శన్ అమర్చింది.
అదేవిధంగా, జాతీయ యుద్ధ స్మారకం మరియు ఇండియా గేట్ మధ్య అందంగా అలంకరించబడిన రాజ్-పథ్ కు చెందిన ఉత్కంఠభరితమైన దృశ్యాలను ప్రసారం చేయడం కోసం ప్రత్యేకంగా 120 అడుగుల హైడ్రాలిక్ క్రేన్ పై ఒక కెమెరాను దూరదర్శన్ ఏర్పాటు చేసింది. వీటితో పాటు, రాజ్-పథ్ మార్గం ద్వారా రాష్ట్రపతి కార్యక్రమానికి చేరుకునే ప్రవేశ ద్వారం వద్ద కూడా సుదూర ప్రాంతం నుండి దృశ్యాలను చిత్రీకరించే ప్రత్యేక పి.టి.జెడ్. కెమెరాలను దూరదర్శన్ ఏర్పాటు చేసింది.
https://www.youtube.com/watch?v=7EsU3zKZ7u4&list=PLUiMfS6qzIMx0yBaj1nzjLevzheuTOcc_&index=2
ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని సమగ్రంగా ప్రసారం చేయడానికి వీలుగా, అన్ని ప్రధాన ప్రదేశాలను, "డార్క్-ఫైబర్-ఆప్టికల్-కనెక్టివిటీ"; "శాటిలైట్ కనెక్టివిటీ" మరియు "బ్యాక్-ప్యాక్-కనెక్టివిటీ" ద్వారా అనుసంధానం చేయడం జరిగింది. భూమి నుండి ప్రభావవంతమైన ప్రసారాన్ని నిర్ధారించడానికి, దూరదర్శన్ రాజ్-పథ్ లో ఒక తాత్కాలిక ఉత్పత్తి నియంత్రణ గదిని నిర్మించింది.
కార్యక్రమం జరుగుతున్నంత సేపూ, అత్యున్నత స్పష్టత కలిగిన దృశ్యాలు, యానిమేటెడ్ గ్రాఫిక్స్ తో ఎంతో ఆకట్టుకునే విధంగా, ప్రముఖ వ్యాఖ్యాతలు ప్రతి విషయాన్ని చక్కగా వివరిస్తారు. అందరూ, స్పష్టంగా అర్ధం చేసుకోడానికి వీలుగా, ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని, డి.డి. న్యూస్ ఛానల్ సంకేత భాష ద్వారా కూడా ప్రసారం చేస్తుంది.
https://www.youtube.com/watch?v=YdPTWNlmbMA&list=PLUiMfS6qzIMx0yBaj1nzjLevzheuTOcc_&index=4
గణతంత్ర దినోత్సవ ప్రత్యక్ష ప్రసారం, జనవరి 26వ తేదీ ఉదయం 9 గంటల 15 నిముషాల నుండి రాజ్‌పథ్ లో కార్యక్రమం ముగిసే వరకు దేశవ్యాప్తంగా దూరదర్శన్ కు చెందిన అన్ని ఛానళ్ళ ద్వారా ప్రసారమవుతుంది. డి.డి. నేషనల్; డి.డి. న్యూస్ యూట్యూబ్ ఛానెళ్ళతో పాటు "న్యూస్-ఆన్-ఎయిర్" (NewsOnAir) యాప్ మరియు వెబ్-సైట్ ద్వారా కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు.
https://www.youtube.com/playlist?list=PLUiMfS6qzIMx0yBaj1nzjLevzheuTOcc_
*****
(Release ID: 1792379)
Visitor Counter : 215