విద్యుత్తు మంత్రిత్వ శాఖ
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతిని జరుపుకున్న - ఎన్.టి.పి.సి.
"స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర" అనే అంశంపై వివిధ ఆన్-లైన్ పోటీలు నిర్వహించిన - ఎన్.టి.పి.సి.
Posted On:
24 JAN 2022 5:27PM by PIB Hyderabad
భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్"గా జరుపుకుంటోంది. ఈ వేడుకల పరంపరలో భాగంగా, 2022 జనవరి, 23వ తేదీన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 వ జయంతి వేడుకలతో పాటు, గణతంత్ర దినోత్సవ వేడుకలను కూడా కలుపుకుని, ఎన్.టి.పి.సి., దాద్రి, వారోత్సవాలను ప్రారంభించింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా, ఎన్.టి.పి.సి., దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ ప్రాంగణాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు, ఘనంగా నివాళులర్పించింది. మహానేత స్మారకార్థం కొన్ని క్రీడా సముదాయాలు, పార్కులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టేడియం అని పేరు పెట్టారు. 125 వ జయంతి వేడుకలకు, సి.జి.ఎం. (ఎన్.టి.పి.సి., దాద్రి) శ్రీ బి. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై, వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా, ఎన్.టి.పి.సి., దాద్రి పరిపాలనా భవనం ఆడిటోరియం కు "నేతాజీ భవన్" అని పేరు పెట్టారు.
కోవిడ్ నియంత్రణలను పరిగణనలోకి తీసుకుని, దేశంలోని వివిధ ఎన్.టి.పి.సి., కార్యలయాల్లో ప్రారంభమైన నేతాజీ జన్మదిన వేడుకల్లో భాగంగా, ఉద్యోగులకు వ్యాసరచన; చిత్రలేఖనం; పెయింటింగ్; క్విజ్ మొదలైన విభాగాలలో, ఆన్-లైన్ లో పోటీలు నిర్వహిస్తున్నారు. "స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర" అనే ఇతివృత్తంతో ఈ పోటీలు జరుగుతున్నాయి.
నేతాజీ జీవితం నుండి దేశభక్తితో కూడిన దార్శనికత, నీతిని పొందేందుకు, అదేవిధంగా నేతాజీ కి గౌరవం, కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు వ్యాసరచన పోటీ కూడా నిర్వహించారు. "స్వాతంత్య్ర ఉద్యమంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ పాత్ర" అనే ఇతివృత్తంతో ఈ పోటీ జరిగింది.
బొగ్గు గనుల ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారి పిల్లలందరి కోసం, ఎన్.టి.పి.సి. కి చెందిన బొగ్గు గనుల ప్రధాన కార్యాలయం నేతాజీ గురించి, స్వాతంత్య్ర ఉద్యమం గురించి, ఆన్-లైన్ క్విజ్ నిర్వహించింది. నేతాజీ మరియు స్వాతంత్య్ర ఉద్యమం పై నిర్వహించిన ఆన్-లైన్ క్విజ్ పోటీకి, పక్రి బార్‌వాడీ సి.ఎం.పి; కేరెందారీ, చట్టిబరియాతు సి.ఎం.పి; దులంగా సి.ఎం.పి; కెరేదారీ సి.ఎం.పి; సి.ఎం.హెచ్.క్యూ. విభాగాలకు చెందిన ఉద్యోగుల పిల్లలందరి నుండి అద్భుతమైన స్పందన లభించింది.
ఎన్.టి.పి.సి., కోల్డం, యువతీ యువకులకు క్విజ్ తో పాటు వకృత్వ పోటీలను కూడా నిర్వహించింది. ఈ రెండు పోటీలలో చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ పోటీల్లో పాల్గొన్న వారిని ప్రోత్సహించి, ఉత్సాహపరచడం కోసం, వారికి వివిధ బహుమతులు అందజేశారు.
*****
(Release ID: 1792276)
Visitor Counter : 181