కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని సౌత్ ఎక్సటెన్షన్ పార్ట్1లో తొలి ఇ-వాహన చార్జింగ్ స్టేషన్‌ను ఎస్‌డిఎంసి మద్దతుతో ప్రారంభించిన టిసిఐఎల్
Posted On:
20 JAN 2022 6:17PM by PIB Hyderabad
ఎస్‌డిఎంసి మద్దతుతో సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ శాఖ కింద ఉన్న మినీ రత్న కేటగిరీ -1 కంపెనీ అయిన టిసిఐఎల్ తొలి ఇ-వాహన చార్జింగ్ స్టేషన్‌ను దక్షిణ ఢిల్లీలోని సౌత్ ఎక్స్‌టెన్షన్ పార్ట్ 1ను 20.01.2022న ప్రారంభించింది. కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షీ లేఖి, టిసిఐఎల్ సిఎండి శ్రీ సంజీవ్ కుమార్, ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖుల సమక్షంలో ప్రారంభించారు.
రానున్న నాలుగు నెలల్లో ఢిల్లీ పౌరులకు అందుబాటులో ఉండేందుకు దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో క్రమంగా టిసిఐఎల్ ఏర్పాటు చేయనున్న 65 ఇ-రీచార్జింగ్ స్టేషన్ల శ్రేణిలో ఈ ఇ-వెహికిల్ చార్జింగ్ స్టేషన్ తొలిది. ప్రతి చార్జింగ్ స్టేషన్ 6 ద్విచక్రవాహనాలను/ త్రిచక్ర వాహనాలను, నాలుగు చక్రవాహనాలను ఒకేసారి చార్జి చేయగలదు.
సామాన్య ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా వైఫై సౌకర్యాన్ని, సిసిటివి పర్యవేక్షణను చార్జింగ్ స్టేషన్ల లో అమర్చారు. ఇది 6కెడబ్ల్యు సోలార్ పానెల్ ద్వారా ఇంధనాన్ని పొందుతుంది.
ఇ-వాహనానాల వాడకానికి ప్రచారం కల్పించేందుకు ఇ-చార్జింగ్ స్టేషన్ తోడ్పడమే కాక, మెట్రో నగరమైన ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది.
****
(Release ID: 1791344)
Visitor Counter : 146