పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అటవీ అధికారులు నోరు లేని జీవాలకు గొంతుకగా ఉండాలి, అదేవిధంగా, దేశం లోని అపారమైన సహజ వనరులకు యజమానులుగా కాకుండా ధర్మకర్తలుగా వ్యవహరించాలి: శ్రీ భూపేందర్ యాదవ్


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన - కేంద్ర అటవీ శాఖ మంత్రి

Posted On: 17 JAN 2022 5:29PM by PIB Hyderabad

 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈ రోజు మాట్లాడుతూ అటవీ అధికారులు నోరు లేని జీవాలకు ప్రతినిధిగా, స్థానిక సమాజం యొక్క ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా, చిత్తశుద్ధితో, మానవత్వంతో, సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, పేర్కొన్నారు.  డెహ్రాడూన్‌ లోని ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ లో శిక్షణ పొందుతున్న 2020 బ్యాచ్‌ కు చెందిన 64 మంది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐ.ఎఫ్.ఎస్) ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి కేంద్ర మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

యువ అధికారులను ఉద్దేశించి శ్రీ యాదవ్ మాట్లాడుతూ, ప్రస్తుత జాతీయ నాయకత్వంలో దేశం వాతావరణ మార్పు, భూమి క్షీణత, కాలుష్యం, జీవవైవిధ్య నష్టం వంటి వివిధ పర్యావరణ సరిహద్దుల్లోని సవాళ్లు, సంక్షోభాలతో పాటు, వాటి వ్యక్తీకరణలను ఏకకాలంలో ఎదుర్కొంటూనే అభివృద్ధి కి చెందిన అన్ని రంగాల్లో పరివర్తనాత్మక పురోగతిని కోరుకుంటోందని, అందువల్ల ప్రస్తుత యుగంలో వాటి పాత్ర స్థిరమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో, సాధన చేయడంలో మరింత ముఖ్యమైనదని, పేర్కొన్నారు. 

కర్బన ఉద్గారాలను దూరంగా ఉంచడం; కర్బన ఉద్గారాలను నిర్ణీత సమయంలో నిర్మూలించడం; ఇంధన మిశ్రమంలో సౌర విద్యుత్తు తో పాటు ఇతర పర్యావరణ సమర్థవంతమైన వనరుల నిష్పత్తి; జీవవైవిధ్య పరిరక్షణ, భూములు ఎడారులుగా మారకుండా ఎదుర్కోవడం; క్షీణించిన భూమి పునరుద్ధరణ మొదలైన వాటి కోసం నిబద్ధత, లక్ష్యాల గురించి పర్యావరణ మంత్రి, ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాటిని సాధించడానికి సృజనాత్మక, వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని, ఆయన, అధికారులను కోరారు.

ప్రభుత్వ వ్యవస్థలో సాధికారత, సామర్థ్యం, సమర్థత కలిగిన కార్మిక శక్తి గా, యువ ఐ.ఎఫ్.ఎస్. అధికారులందరూ కూడా, తమ అధికార పరిధి లోని అటవీ ప్రకృతి పరిసరాల్లోని సమాజాలతో, ఇతర పౌరులతో వ్యవహరించడం లో సమాజ హితంగా / పౌరులే ఆధారంగా, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించే వ్యవస్థ గా వ్యవహరించాలని ఆయన పునరుద్ఘాటించారు. 

కేంద్ర సహాయ మంత్రి శ్రీ అశ్వినీ కుమార్ చౌబే కూడా ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ,  అడవుల్లో నివసించే సమాజాలు, ఇతర వ్యక్తులతో పరస్పరం చర్చించుకునేందుకు అనేక రంగాలకు సంబంధించిన అంశాలు ఉంటాయనీ, అటువంటి సందర్భాల్లో, సానుభూతి, ప్రతిస్పందనలతో పాటు ఆయా అంశాలను సులభతరం చేసే విధానంలో, మన ప్రవర్తన ప్రధాన పాత్ర పోషిస్తుందని, పేర్కొన్నారు. విధులను క్రియాత్మకంగా నిర్వర్తించే సమయంలో, ఈ మొత్తం ప్రక్రియను అత్యంత చిత్తశుద్ధితో, మానవీయ దృక్పథం తో,  పౌర కేంద్రీకృత విధానాన్ని అనుసరించవలసిన అవసరం ఉందని, ఆయన, సూచించారు. 

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, శ్రీమతి లీలా నందన్ మరియు ఎం.ఓ.ఈ.ఎఫ్.సి.సి., ప్రత్యేక కార్యదర్శి; డైరెక్టర్ జనరల్ (ఫారెస్ట్), శ్రీ సి.పి. గోయల్, ప్రొబేషనర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

*****



(Release ID: 1790721) Visitor Counter : 167


Read this release in: English , Urdu , Hindi , Tamil