బొగ్గు మంత్రిత్వ శాఖ

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కొత్త పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌ & పునరావాస విధానాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి


- ప్రాజెక్ట్ ప్రభావిత కుటుంబాల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఇది దోహ‌దం చేస్తోంద‌న్న‌ మంత్రి

Posted On: 17 JAN 2022 2:47PM by PIB Hyderabad

బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ గత ఆరు దశాబ్దాల పనితీరుతో భారతదేశ ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి  అన్నారు. ఎన్ఎల్‌సీఐఎల్ గనుల ప్రాంతంలోని భూ యజమానులకు వర్తించేలా నూత‌న
పున‌ర్వ‌వ‌స్థీక‌ర‌ణ‌ & పునరావాస విధానాన్ని (ఆర్ అండ్ ఆర్‌) మంత్రి  వ‌ర్చువ‌ల్ విధానంలో ప్రారంభించారు. బాధిత ప్రజలకు అందుబాటులో ఉన్న బహుళ ఎంపికలతో చాలా సౌకర్యవంతమైన పునరావాస విధానాన్ని రూపొందించడంలో ఎన్ఎల్‌సీఐఎల్ మరియు తమిళనాడు ప్రభుత్వాలు చేస్తున్న చ‌ర్య‌ల‌ను  ప్రశంసిస్తూ బాధిత గ్రామస్తులకు న్యాయమైన,  పారదర్శకనె  ప్రక్రియ ఆధారంగా పరిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టుగా మంత్రి శ్రీ జోషి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు చాలా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కొత్త విధానంలో నిబంధనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఎన్‌ఎల్‌సీఎల్ ఎంవోయూ కుదుర్చుకున్నట్లు శ్రీ జోషి సూచించారు. కొత్త ఆర్‌ఆర్ పాలసీ సుస్థిర జీవనోపాధికి మార్గం సుగమం చేస్తుందని మరియు ప్రతి గ్రామాన్ని ఆత్మ నిర్భర్‌గా మారుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వర్చువల్ విధానంలో  మంత్రి  ప్రసంగిస్తూ, బొగ్గు, గనులు మరియు రైల్వేల శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దన్వే మాట్లాడుతూ కొత్త  విధానం గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా ఎన్ఎల్‌సీఐఎల్ ద్వారా ఇంధన ఉత్పత్తిని మరింత పెంచడానికి కూడా ఇది దారి తీస్తుందని అన్నారు.
ఈ కార్య‌క్ర‌మంలో త‌మిళ‌నాడుకు చెందిన వ్య‌వ‌సాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎం.ఆర్.కె.పన్నీర్ సెల్వం, కార్మిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సి.వి.గణేశన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రామస్తులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎన్ఎల్‌సీఐఎల్‌ను కోరారు. స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, బొగ్గు మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారులు, ఎన్‌ఎల్‌సీఎల్‌, గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సామాజిక బాధ్యత కలిగిన కార్పొరేట్ సంస్థ‌గా
ఎన్ఎల్‌సీ వాటాదారుల సంక్షేమాన్ని పరిష్కరించడానికి చురుకైన చర్యలను చేప‌డుతోంది, ముఖ్యంగా ప్రభావితమైన ప్రజలను
పున‌ర్వవ‌స్థీక‌ర‌ణ‌ & పునరావాస కార్యక్రమాల ద్వారా వివిధ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంది.  సీఎస్ఆర్ పథకాల‌తో పాటు ప‌లు నైపుణ్యాభివృద్ధి, నీటి వనరుల పెంపుదల వంటిఅనేక ఇతర చర్యలు వంటి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేస్తోంది. ఎన్ఎల్‌సీఐఎల్‌
తమిళనాడులో 1956లో లిగ్నైట్ మైనింగ్ మరియు లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో తన కార్యకలాపాలను ప్రారంభించింది.
ఆరు దశాబ్దాలకు పైగా కాలంలో, కంపెనీ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక శక్తి ప్రధానంగా సోలార్ మరియు బొగ్గు గనుల తవ్వకాలుకూ విస్తరించింది. ఈ ప్రక్రియలో, కంపెనీ 50.60 ఎంటీపీఏ మైనింగ్ మరియు 6,061 మెగా వాట్ల  విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంతో భార‌త దేశ వ్యాప్తంగా ఉనికిని సాధించింది.

***

 



(Release ID: 1790608) Visitor Counter : 139