వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సేవల ఎగుమతులను ఏడాదికి ట్రిలియన్ డాలర్లకు పెంచ‌డానికి ఐటీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది - శ్రీ పీయూష్ గోయల్


- ఐటీ సంస్థలకు ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి సహాయానైనా అందజేస్తుంది - మంత్రి శ్రీ గోయల్

- కొత్త సాంకేతికతలపై దృష్టి సారించడం ద్వారా ఐటీ పరిశ్రమ పెద్ద గ్లోబల్ ప్లేయర్‌గా మారుతుంది- కేంద్ర మంత్రి శ్రీ గోయల్

- ఈ సమావేశంలో నాస్కామ్ , ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఫ్రాక్టల్ అనలిటిక్స్; ఎంఫసిస్‌, విప్రో, జెన్‌ప్యాక్ట్, డ‌బ్ల్యుఎన్ఎస్ గ్లోబ‌ల్ స‌ర్వీసెస్‌, మాస్టెక్ ,టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) త‌దిత‌ర ఐటీ దిగ్గ‌జ సంస్థలు పాల్గొన్నాయి

Posted On: 16 JAN 2022 5:35PM by PIB Hyderabad

భారత  అగ్రశ్రేణి ఐటీ కంపెనీల‌ నాయకులకు, వృద్ధిని వేగవంతం చేయడానికి ద‌శాబ్ద కాలంలో భారతదేశ‌ సేవల ఎగుమతుల‌ను ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచ‌డానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం త‌న‌వంతుగా పూర్తి సాయాన్ని అందిస్తుందని..  వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజాపంపిణీ, జౌళి మంత్రిత్వ శాఖల‌ మంత్రి  శ్రీ పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు.
భారతదేశం ఈ సంవత్సరం 400 బిలియన్ల డాల‌ర్ల సరుకుల ఎగుమ‌తి లక్ష్యాన్ని సాధించే దిశగా పయనిస్తోందని, అదే మాదిరిగా సేవల ఎగుమతుల‌నుమ దాదాపు $240 బిలియన్ నుండి $250 బిలియన్ల వరకు ఉండే అవకాశం ఉందని వివ‌రించారు. ఇది చాలా తక్కువగా ఉందని అయితే వేగంగా వృద్ధి చెంది సరుకుల ఎగుమతులను అందుకోవచ్చని మంత్రి శ్రీ గోయల్ వివ‌రించారు.
"నేను వీటి పథాన్ని చూసినప్పుడు - ఇది అగ్రస్థానానికి చేరుకోగలదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. మ‌నం ట్రిలియ‌న్ డాల‌ర్ల ల‌క్ష్యాన్ని చేరుకుంటాము. అది మ‌న ఆశయం, లక్ష్యం కావాలి. దీనిని చేరుకునేందుకు మీరు చేయాల్సింది కొంచెం ఉంది. మీరు వాటి కంటే వేగంగా ట్రిలియన్ డాలర్లు దాటితే నేను సంతోషిస్తాను,” అని మంత్రి ఐటీ పరిశ్రమ నాయకులతో అన్నారు. టైర్ -2,  టైర్-3 పట్టణాల్లో ఐటీ హబ్‌లను ప్రారంభించాలన్న ఐటీ పరిశ్రమ ప్రతిపాదనను శ్రీ గోయల్ స్వాగతించారు, ఇది అనేక  ర‌కాల ఉద్యోగాలను సృష్టించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఐటీ పరిశ్రమ పట్టణాలను గుర్తించాలని, వారికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు కల్పించడంలో కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. కొత్త సాంకేతికత, ఉత్పత్తులపై దృష్టి సారించడం ద్వారా ఐటీ పరిశ్రమ సేవల ఎగుమతులకు పెద్ద సహకారాన్ని అందించగలదని ఆయన అన్నారు. గ‌త వారాంతంలో జరిగిన వర్చువల్ సమావేశంలో హైటెక్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని మంత్రి ఐటీ పరిశ్రమ నాయకులతో అన్నారు. ఐటీ పరిశ్రమ తనంతట తానుగా అద్భుతంగా అభివృద్ధి చెందిందని, స్టార్టప్‌లకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడంపై కూడా భారత దేశం దృష్టి సారించని సమయంలో చాలా అగ్రశ్రేణి కంపెనీలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఐటీ పరిశ్రమల ప్రోత్సాహం  అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికి,భారతదేశం యొక్క సేవల ఎగుమతిలో దోహదపడేందుకు అవసరమైన సహాయాన్ని అందజేస్తుందని శ్రీ గోయల్ చెప్పారు. వర్చువల్ సమావేశానికి నాస్కామ్ ప్రెసిడెంట్ శ్రీ దేబ్జానీ ఘోష్, ఇన్ఫోసిస్ సీఈఓ శ్రీ సలీల్ పరేఖ్, టెక్ మహీంద్రా సీఈఓ & ఎండీ శ్రీ సి.పి. గుర్నాని; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ స్టార్టప్ ఫ్రాక్టల్ అనలిటిక్స్ సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ శ్రీ శ్రీకాంత్ వెలమకన్ని; ఎంఫ‌సిస్ సీఈఓ శ్రీ నితిన్ రాకేష్; విప్రో చైర్మన్ శ్రీ రిషద్ ప్రేమ్‌జీ; జెన్‌పాక్ట్ సీఈఓ శ్రీ ఎన్‌.వి. త్యాగరాజన్; డ‌బ్ల్యుఎన్ఎస్‌ గ్లోబల్ సర్వీసెస్ గ్రూప్ సీఈఓ శ్రీ కేశవ్ ఆర్‌ మురుగేష్; మాస్టెక్ సీఈఓ శ్రీ హిరాల్ చంద్రనా మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌)లో బిజినెస్ మ‌రియు టెక్నాలజీ సర్వీసెస్ ప్రెసిడెంట్ మరియు హెడ్ శ్రీ కృష్ణన్ రామానుజం త‌దిత‌రులు పాల్గొన్నారు. గత ఏడాది ఈ రంగం బలమైన వృద్ధిని సాధించిందని, గత వారంలో, కంపెనీలు నివేదించిన బలమైన ఆదాయాలు రాబోయే సంవత్సరాల్లో సానుకూల స్వరాన్ని సెట్ చేశాయని ఐటీ పరిశ్రమ అధినేత‌లు తెలిపారు. 

***



(Release ID: 1790391) Visitor Counter : 138