సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

2047 నాటికి ఊహకి అందని విధంగా అభివృద్ధి సాధించనున్న భారతదేశం .. డాక్టర్ జితేంద్ర సింగ్


పరిస్థితులు గతంతో పోలిస్తే వేగంగా మారుతున్నాయి.. ఇదే వేగం కొనసాగితే 25 సంవత్సరాల తరువాత భారత్ సాధించే అభివృద్ధిని అంచనా వేయడం కష్టం.. డాక్టర్ జితేంద్ర సింగ్

శతాబ్ది స్వాతంత్ర ఉత్సవాల నాటికి దేశం సాంకేతిక, ఆర్థిక శక్తిగా మారుతుంది

విజన్ ఇండియా @ 2047 రూపకల్పన కోసం పరిపాలనా సంస్కరణలు,ప్రజా సమస్యల మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించిన డాక్టర్ జితేంద్ర సింగ్

ఒక దేశం ఒక రేషన్ కార్డు, ఈ-ఆఫీస్, సీపీ గ్రామ్స్ , పాసుపోర్టు సేవా కేంద్రాలు, ఈ-హాస్పిటల్ లాంటి కార్యక్రమాలు 'బిల్డింగ్ టు స్కేల్ బిల్డింగ్ టు లాస్ట్' విధానంలో అమలు జరుగుతున్నాయి

ఏదైనా సాధించగల సత్తా ఉన్న ప్రస్తుత తరం లక్ష్యాలను సాధించి 2047 నాటికి భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలుపుతుంది.. డాక్టర్ జితేంద్ర సింగ్

సమావేశంలో అభిప్రాయాలు తెలిపిన వివిధ రంగాలకు చెందిన నిపుణులు

Posted On: 15 JAN 2022 6:32PM by PIB Hyderabad

2047 నాటికి భారతదేశం ఊహకి అందని రీతిలో అభివృద్ధి సాధించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతికభూగర్భ శాస్త్రసిబ్బంది వ్యవహారాలు పెన్షన్లుప్రజా ఫిర్యాదులుఅణుశక్తిఅంతరిక్ష శాఖ సహాయ ( స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఈ దిశలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయని మంత్రి అన్నారు. ఇదే వేగం కొనసాగితే 25 సంవత్సరాల తరువాత దేశం ఏ స్థానంలో ఉంటుందన్న అంశం ఊహకి అందని అంశమని అన్నారు. అయితే, 100 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకునే సమయానికి భారతదేశం సాంకేతికఆర్థిక రంగాల్లో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండడం ఖాయమని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. 

 

  విజన్ ఇండియా @ 2047 రూపకల్పన కోసం ఈ రోజు పరిపాలనా సంస్కరణలు,ప్రజా సమస్యల మంత్రిత్వ శాఖ వివిధ రంగాలకు చెందిన నిపుణులతో  ఏర్పాటు చేసిన మొదటి సమావేశానికి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. విజన్ ఇండియా @ 2047 నివేదిక రూపకల్పన కోసం ఈ సమావేశం ఏర్పాటు అయింది. సమావేశంలో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ గత ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలుకార్యక్రమాలుపథకాలు నూతన శకానికి నాంది పలికాయని అన్నారు.  ఆత్మ నిర్భర్ భారత్ ఆవిర్భావానికి ప్రభుత్వ కార్యక్రమాలువిధానాలుకార్యక్రమాలుపథకాలు దోహద పడతాయని పేర్కొన్నారు. 

ప్రజలకు ప్రభుత్వాన్ని చేరువ చేసే లక్ష్యంతో విజన్ ఇండియా @ 2047 కు రూపకల్పన చేస్తున్నామని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు డిజిటల్ సంస్థలు వేదికగా నిలుస్తాయని అన్నారు. 21 వ శతాబ్ద పరిపాలనయాజమాన్య విధానాలను అనుసరించడం ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్ గా డాక్టర్ జితేంద్ర సింగ్ వర్ణించారు. ఈ సవాల్ ను స్వీకరించి  లక్ష్యాన్ని చేరుకొనేందుకు  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ప్రతిష్టాత్మకమైన విజన్‌ ఇండియా@2047 రూపకల్పనకు  శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.

 

2021 ఆగస్టు 15 వ తేదీన ఎర్ర కోట బురుజుల నుంచి చేసిన ప్రసంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏదైనా సాధించగల సత్తా కలిగిన తరాన్ని భారతదేశం కలిగి ఉందని ప్రకటించిన శ్రీ నరేంద్ర మోదీ " 2047 లో మనం స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటాము . 25 సంవత్సరాల తరువాత  ఆ సమయానికి ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారో తెలియదు. అయితే, ఒక విషయాన్ని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. 25 సంవత్సరాల తరువాత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే అతడు/ఆమె ఈ రోజు మనం తీసుకున్న ప్రతిజ్ఞ కార్యరూపం దాల్చేందుకు దారి తీసిన పరిస్థితులను తప్పక వివరిస్తారు అన్న నమ్మకం నాకు ఉంది. దేశం సాధించే విజయం పట్ల నాకు ఉన్న దృఢమైన విశ్వాసం ఇది" అని వ్యాఖ్యానించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

దేశంలో ప్రతి పౌరుడికి ప్రభుత్వం డిజిటల్ మౌలిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒక ప్రధాన ప్రయోజనంగా అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఒక్కరికి  ప్రత్యేక డిజిటల్ గుర్తింపు ఇచ్చి సేవా కేంద్రాలు, వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ శాఖలు అందిస్తున్న వేలాది సేవలను అందుబాటులోకి తెచ్చిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అమలు చేయాల్సిన చర్యలను చర్చించి అమలు చేసేందుకు 2019 డిసెంబర్ నెలలో నాగపూర్ లో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించి దేశ ప్రజలకు డిజిటల్ సాధికారతను కల్పించాలని కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

  ఒక దేశం ఒక రేషన్ కార్డుఈ-ఆఫీస్సీపీ గ్రామ్స్ పాసుపోర్టు సేవా కేంద్రాలుఈ-హాస్పిటల్ లాంటి కార్యక్రమాలు 'బిల్డింగ్ టు స్కేల్ బిల్డింగ్ టు లాస్ట్విధానంలో అమలు జరుగుతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బలమైన పునాదులతో ఎక్కువ కాలం మన్నేలా ఈ సంస్కరణలు అమలు జరుగుతున్నాయని అన్నారు. 

పటిష్టమైన పరిపాలనా సంస్కరణలను అమలు చేసేందుకు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ వివరించారు. సమగ్ర సంపూర్ణ ప్రభుత్వ పరిపాలన రూపకల్పన కోసం 2021 లో మంత్రిత్వ శాఖ మూడు కీలక కార్యక్రమాలను అమలు చేసిందని అన్నారు. త్వరితగతిన నిర్ణయాలను సమర్ధంగా తీసుకోవడం,  సమర్పణ దశలను  తగ్గించడంఆర్థిక అధికారాల వికేంద్రీకరణ ఇ-ఆఫీస్ వెర్షన్ 7.0 ను అమలులోకి తీసుకుని రావడం,   సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ల డిజిటలైజేషన్ మరియు అన్ని మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో  డెస్క్ ఆఫీసర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలను అమలు తీసుకుని వచ్చామని ఆయన వివరించారు. 

ఇండియా విజన్ @47 రూపకల్పన కోసం  వివిధ రంగాలకు చెందిన నిపుణులు అభిప్రాయాలు తెలిపారు.   మాజీ కేబినెట్ కార్యదర్శి  ప్రభాత్ కుమార్, మాజీ సీవీసీ   సంజత్ కొఠారి, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్,  ప్రొఫెసర్ ఎరోల్ డియో జా, ప్రొఫెసర్ హిమాన్షు రాయ్, ప్రొఫెసర్ అభయ్ కరాండీకర్,ప్రొఫెసర్ సచిన్ చతుర్వేది, డాక్టర్ ఆర్. బాలసుబ్రమణ్యం, ప్రొఫెసర్ నిర్మల బాగ్చి, డాక్టర్ సి. చన్మౌళిడాక్టర్ మహాదేవ్  జైస్వాల్, ఎస్ ఎన్  త్రిపాఠి తదితరులు తమ అభిప్రాయాలను వివరించారు. 

***



(Release ID: 1790215) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi , Punjabi