సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

పాలనపై సెక్టోరల్ నిపుణులతో రేపు డిఎఆర్ పిజి విజన్ India@2047 సమావేశానికి అధ్యక్షత వహించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ఇ-గవర్నెన్స్ ఉపయోగించి పౌరులు ,ప్రభుత్వాన్ని దగ్గరగా తీసుకురావడం పై దృష్టి కేంద్రీకరించనున్న చర్చలు
సమావేశం లో

Posted On: 14 JAN 2022 3:27PM by PIB Hyderabad

ఈ దశాబ్దానికి సంబంధించిన దీర్ఘకాలిక లక్ష్యాలు , సంబంధిత ఫలితాలను కాలవ్యవధులు , మైలురాళ్లతో గుర్తించడానికి భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/ అన్ని విభాగాలు విజన్ India@2047 కోసం ఒక పత్రాన్ని రూపొందించాలని ప్రధాన మంత్రి ఆదేశించారు. పరిపాలనపై విజన్ India@2047 సాధించడానికి అవసరమైన నిర్మాణాత్మక ,సంస్థాగత సంస్కరణలను సూచించడానికి, డిఎఆర్ పిజి జనవరి 15, 2022 న సెక్టోరల్ నిపుణులు, విద్యావేత్తలు,  శాస్త్రీయ సమాజంతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయం , సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పరిపాలన సమస్యలపై సెక్టోరల్ నిపుణులతో జరిగే ఈ  తొలి సమావేశానికి అధ్యక్షత

వహిస్తారు.

 

కేంద్ర సచివాలయం లో నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థతను మెరుగుపరచడం, పెండింగ్ తగ్గించడం, మంత్రిత్వ శాఖలు/ విభాగాల పనితీరును హేతుబద్ధం చేయడం, ప్రజా సేవలో నైతికత, పారదర్శకత , జవాబుదారీతనం, సమర్థవంతమైన కార్యనిర్వాహక సంస్థల సృష్టి, ప్రభుత్వంలో సంస్కరణల ప్రధాన సూత్రాలు, రాష్ట్రాల్లో బెంచ్ మార్కింగ్ పాలన, 21వ శతాబ్దపు పాలనలో నిర్వహణ విధానాలు, పౌర కేంద్రిత పాలన, రాష్ట్ర సెక్రటేరియట్ లు, జిల్లా కలెక్టరేట్ల లో సంస్కరణలు, , పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం,

ఎక్స్ లెన్స్ సంస్థల శఏర్పాటు పై సమావేశం లో చర్చిస్తారు.

 

మాజీ క్యాబినెట్ కార్యదర్శులు, డిఒపిటి మాజీ కార్యదర్శులు, ఎంపిక చేసిన ఐఐటిలు , ఐఐఎం,  ఎ ఎస్ సి ఐ,  కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ డైరెక్టర్లు చర్చల్లో పాల్గొంటారు. కార్యదర్శి డిఎఆర్ పిజి వి.శ్రీనివాస్, డైరెక్టర్ జనరల్ ఐఐపిఎ డాక్టర్ ఎస్.ఎన్.త్రిపాఠి ఈ సమావేశానికి హాజరు కానున్నారు.

 

సెక్టోరల్ నిపుణులతో సంప్రదింపుల సమావేశాల తరువాత, డిఎఆర్ పిజి విజన్ India@2047 ను రూపొందిస్తారు. 

 

 

*****



(Release ID: 1790076) Visitor Counter : 121