భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

''మధ్యప్రదేశ్ నుండి స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపుకు నోచుకోని వీరులు'' అనే అంశంపై ప్రదర్శనను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన - శ్రీ అరుణ్ గోయెల్


“ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్” ను నిర్వహిస్తున్న - భోపాల్ లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ సంస్థ

ఐకానిక్ అకామ్ వీక్ - 2022 జనవరి 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు

Posted On: 13 JAN 2022 3:18PM by PIB Hyderabad

కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎం.హెచ్.ఐ) ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సి.పి.ఎస్.ఈ), భోపాల్ లోని భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్ - బి.హెచ్.ఈ.ఎల్.,  2022 జనవరి 10 నుండి 16వ తేదీ వరకు “ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్”ను జరుపుకుంటోంది.  "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" వేడుకల్లో భాగంగా, భోపాల్‌ లోని బి.హెచ్.ఈ.ఎల్. ''స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపుకు  నోచుకోని వీరులు'' అనే శీర్షికతో ఒక ఎగ్జిబిషన్ను ప్రారంభించడంతో పాటు;  సంరచ్నా పోర్టల్‌ లో "ఐడియా జనరేషన్ ఛాలెంజ్" పై ప్రదర్శనను దృశ్య మాధ్యమం ద్వారా నిర్వహించింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, ఎం.హెచ్.ఐ. కార్యదర్శి, శ్రీ అరుణ్ గోయెల్, ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్నారు.  ఇంకా, డా. నలిన్ సింఘాల్, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; ఫంక్షనల్ డైరెక్టర్ తో పాటు, బి.హెచ్.ఈ.ఎల్. యూనిట్ల కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు; జనరల్ మేనేజర్లు; ఇతర సీనియర్ అధికారులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

భోపాల్ లోని బి.హెచ్.ఈ.ఎల్. జనరల్ మేనేజర్ మరియు అధిపతి శ్రీ సుశీల్ కుమార్ బవేజా ప్రారంభోపన్యాసం చేశారు.  అనంతరం, బీ.హెచ్‌.ఈ.ఎల్. గీతాన్ని ఆలపించారు.  కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మరియు ఏ.కె.ఏ.ఎం. పై భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే సందేశాన్ని ఏ.జి.ఎం(హెచ్.ఆర్) శ్రీ బినోయ్ కుమార్ చదివారు.  ఆ తర్వాత   "స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపుకు  నోచుకోని వీరులు'' అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ ను, శ్రీ అరుణ్ గోయెల్ మధ్యప్రదేశ్ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  అనంతరం - స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపుకు  నోచుకోని వీరులు - తాంతియా భిల్; అవంతీబాయి లోధి; సదాద్ ఖాన్;  ఝల్కారీ బాయి; భగీరథ్ సిలావత్;  రాజా శంకర్ షా;  భీమా నాయక్; కువార్ రఘునాథ్ షా; శ్రీమతి సహోదర బాయి రాయ్; రాజా భక్తవర్ సింగ్ ల జీవిత విశేషాల గురించి సంక్షిప్తంగా వ్యాఖ్యానంతో పాటు స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపుకు  నోచుకోని వీరుల చిత్రాలతో ప్రగతి దీర్ఘ (ప్రగతి గ్యాలరీ) వద్ద ఏర్పాటు చేసిన గ్యాలరీ ని  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో ఉంచిన బి.హెచ్.ఈ.ఎల్. సంస్థ లో అంతర్గత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన వివిధ భారీ పారిశ్రామిక ఉత్పత్తుల ప్రతిరూపాలు లేదా నమూనాల గురించి ఏ.జి.ఎం.(హెచ్.ఆర్.డి) శ్రీ అమితాబ్ దూబే; సీనియర్ ఇంజనీర్ (హెచ్.ఆర్.డి) శ్రీ అరవింద్ తివారీ; వివరించారు.   "ఐడియా జనరేషన్ ఛాలెంజ్" అనే అంశంపై కార్పోరేట్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసిన ప్రెజెంటేషన్ అనంతరం కార్యక్రమం ముగిసింది.

భారతదేశం 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.  "ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్" అనేది 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశం మరియు దాని ప్రజలు, సంస్కృతి, విజయాల అద్భుతమైన చరిత్ర ను జరుపుకోవడానికి, స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమం.  భారతదేశాన్ని దాని పరిణామ ప్రయాణంలో ఇంత దూరం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించడం తో పాటు,  భారతదేశం 2.0 ని సక్రియం చేయాలనే గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశయాన్ని సాకారం చేయగల శక్తి, సామర్థ్యాలను కూడా కలిగి ఉన్న, ఆత్మ నిర్భర్ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహిస్తున్న భారతదేశ ప్రజలకు ఈ మహోత్సవం అంకితం చేయబడింది. 

 

*****


(Release ID: 1789850) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Hindi , Tamil