ఆయుష్

సూర్య నమస్కార్: మకర సంక్రాంతి రోజు నిర్వ‌హించ‌నున్న‌ మొట్టమొదటి విశ్వ‌వ్యాప్త ప్రదర్శనలో పాలుపంచుకోనున్న కోటి మంది

Posted On: 13 JAN 2022 6:26PM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా మకర సంక్రాంతి పండుగ రోజున  ఆయుష్ మంత్రిత్వ శాఖ తొలిసారిగా సూర్య నమస్కార్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించ‌నుంది, ఇందులో సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు పాల్గొన‌నున్నారు. ఈ సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ మంత్రి  శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రజలను ఉద్దేశించి సూర్య నమస్కారం గురించి సందేశం ఇవ్వ‌నున్నారు. ఆ తర్వాత ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్రభాయ్ కాళూభాయ్ ఈ సూర్య‌న‌మ‌స్కార‌
కార్యక్రమం గురించి తన ఆలోచనలను పంచుకోనున్నారు. ఇటీవలి కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఇంటి నుండి 'సూర్య నమస్కార్' చేయాలని మరియు రిజిస్ట్రేషన్ కోసం ఉపయోగించే లింక్‌లపై వీడియోలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. ఉదయం 7:00 నుండి 7:30 వరకు 13 రౌండ్లలో ప్రత్యక్ష సూర్య నమస్కార్ దూర‌ద‌ర్శ‌న్‌లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా మాస్టర్లు మరియు విశ్వ‌వ్యాప్త యోగా సంస్థ‌ల‌ గురువులు కూడా తమ సందేశాలను పంచుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వైద్య రాజేష్ కొటేచా, ఎండీఎన్ఐవై  సంస్థ‌
డైరెక్టర్ డాక్టర్ ఐ.వి. బసవరడ్డి కూడా ప్రసంగించ‌నున్నారు.

 

***



(Release ID: 1789848) Visitor Counter : 174