రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్- చైనా సైనిక కమాండర్ స్థాయి 14వ రౌండ్ చర్చలపై సంయుక్త పత్రికా ప్రకటన
Posted On:
13 JAN 2022 6:00PM by PIB Hyderabad
భారత్ - చైనా సైనిక దళ కమాండర్ (కార్ప్స్ కమాండర్) స్థాయి సమావేశం చైనీస్ వైపుగా ఉన్న చుషుల్- మోల్దో సరిహద్దుల్లో 12 జనవరి 2022న జరిగింది. ఇరు పక్షాలకు చెందిన రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ సెక్టార్‌లో ఎల్ఎసి పొడవునా ఉన్న సహేతుక సమస్యల పరిష్కారానికి లోతైన, నిర్మొహమాటమైన అభిప్రాయాలను ఇరు పక్షాలు మార్చుకున్నాయి. దేశ నాయకులు అందించే మార్గదర్శనాలను ఇరువైపులూ అనుసరించాలని, మిగిలిన సమస్యల పరిష్కారాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకునేందుకు పని చేయాలని వారు అంగీకారానికి వచ్చారు. పశ్చిమ సెక్టార్‌లో ఎల్ఎసి పొడవునా శాంతి, నిశ్చలతను పునరుద్ధరించేందుకు ఇది తోడ్పడమే కాక ద్వైపాక్షిక సంబంధాలు పురోగమించేందుకు సహాయపడుతుందని గుర్తించారు. గత ఫలితాలను సంఘటితం చేసి, పశ్చిమ సెక్టార్‌లో భద్రత, సుస్థిరతను సమర్ధవంతంగా, శీతాకాలంలో సహా నిర్వహించాలని ఇరు పక్షాలూ అంగీకరించాయి. ఇరు పక్షాలూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండి, సైనిక, దౌత్యపరమైన మార్గాల ద్వారా చర్చలు నిర్వహిస్తూ, సాధ్యమైనంత త్వరగా మిగిలిన సమస్యల పరిష్కారానికి ఇరువురికీ ఆమోదయోగ్యమైన మార్గం కనుగొనేందుకు పని చేయాలని ఇరు పక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా, కమాండర్ స్థాయి చర్చల తదుపరి రౌండ్‌ను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని కూడా అంగీకారానికి వచ్చారు.
***
(Release ID: 1789826)
Visitor Counter : 208