ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
డిఒఎన్ఇఆర్ మంత్రిత్వ శాఖ కింద అరుణాచల్ ప్రదేశ్‌లోని చాంగ్లాంగ్ కమ్యూనిటీ ఆధారిత సంస్థలు (సిబిఒ) ద్వారా సరఫరా లంకె నిర్వహణ పెంపు
Posted On:
12 JAN 2022 2:25PM by PIB Hyderabad
గ్రామీణ ప్రాంతాలలో క్రమబద్ధత లేని మార్కెట్లు, సక్రమంగా లేని డిమాండ్, రవాణా ఆటంకాలు వంటి సవాళ్ళు తరచుగా రైతులు, వ్యవస్థాపకులు తమ ఉత్పత్తులకు సరైన, నిజమైన విలువను పొందకుండా అడ్డుపడుతుంటాయి. ఈ సవాళ్ళను అధిగమించేందుకు, నార్త్ ఈస్టర్న్ కమ్యూనిటీ రీసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (ఎన్ఇఆర్‌సిఎంఎస్), చాంగ్లాంగ్ కమ్యూనిటీ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సొసైటీ (సిసిఆర్ ఎం ఎస్) కమ్యూనిటీ ఆధారిత సంస్థలుగా (సిబిఓ) ఏర్పడ్డాయి. ప్రస్తుతం, ఈ సిబిఒలు జిల్లాస్థాయిలో సరఫరా లంకె నిర్వహణను పెంచే దిశగా పని చేస్తున్నాయి.
మధ్యవర్తుల విషవలయం స్థానంలో, సిబిఒలు అల్లం, పసుపు వంటి ముడి ద్రవ్యాలను వ్యక్తిగత రైతుల నుంచి ప్రత్యక్షంగా సేకరిస్తున్నాయి. రైతులు పోటీ మార్కెట్ ధరలకు (కాంపిటీటివ్ మార్కెట్) తమ ఉత్పత్తిని విక్రయించేందుకు ఇది ఒక వేదికను అందిస్తుంది. ముడి సరుకును పొలం నుంచి నేరుగా ప్రాసెసింగ్ యూనిట్‌కు పంపడంతో, వాటి నాణ్యత, తాజాదానం కోల్పోకుండా ఉండడమే కాకుండా, మార్కెట్‌లో ఇతర పోటీదారులకన్నా ఒక మెట్టుపైన ఉండే విధమైన అంతిమ ఉత్పత్తి తయారవుతుంది.
ఉత్పత్తి అనంతరం, లేబిలింగ్ తర్వాత సిసిఆర్ఎంఎస్ - చాంగ్లాంగ్ కోఆపరేటివ్ సొసైటీ (సహకారం సంఘం )లిమిటెడ్ తో కలిసి, స్థానిక విక్రేతదారులు, నాబార్డ్‌కు చెందిన గ్రామీణ మార్టులు &హాట్‌ల ద్వారా ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నాయి. వోకల్ ఫర్ లోకల్ అన్న ప్రచారానికి జోడించడం ద్వారా, ఈ చొరవ స్థానిక ఉత్పత్తులను భారీ ఎత్తున ప్రోత్సహించడమే కాకుండా జిల్లా స్థాయిలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేస్తోంది.
మియో-ఖాగం బ్లాక్‌లోని నాంఫాయ్ సర్కిల్‌లోని నియోతన్ గ్రామంలో ప్రాసెసింగ్ యూనిట్ వద్ద అల్లాన్ని సేకరిస్తున్న కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్లు (సిబిఒ).
***
(Release ID: 1789502)
Visitor Counter : 178