శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు అందుబాటులోకి రానున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన బ్రెయిలీ మ్యాప్‌లు

Posted On: 10 JAN 2022 3:56PM by PIB Hyderabad

అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించిన బ్రెయిలీ మ్యాప్‌లు త్వరలో దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ ఎంబాసింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేసిన ఈ మ్యాపులు నాణ్యత కలిగి  సులువుగా ఎక్కువ కాలం మన్నే విధంగా ఉంటాయి. 

  ప్రింటింగ్ ప్లేట్లుఅచ్చులురసాయనాలు మరియు ద్రావకాల అవసరాన్ని డిజిటల్ ఎంబాసింగ్ సాంకేతిక పరిజ్ఞానం తొలగిస్తుందిడిజిటల్ ఎంబాసింగ్ సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వల్ల కాలుష్యం, వృధా, ఇంధన వినియోగం తగ్గుతాయి. భారతదేశంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న పనిచేస్తున్న నేషనల్ అట్లాస్ & థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ రూపొందించి అభివృద్ధి చేసి వినియోగానికి సిద్ధం చేసింది. 

డిజిటల్ ఎంబాసింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి  బ్రెయిలీ  మ్యాపులను వేగంగా సిద్ధం చేసేందుకు వీలవుతుంది. సంవత్సరాల తరబడి ఎక్కువ మంది ఈ మ్యాపులను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో సిద్ధం చేస్తున్న బ్రెయిలీ  మ్యాపులు అతి తక్కువ సమయంలో అరిగి పోయి చదవడానికి పనికి రాకుండా పోతున్నాయి. వీటిని చేతితో తడిమి చూసి అర్ధం చేసుకోవడం కష్టసాధ్యం అవుతోంది.  దృష్టి లోపం ఉన్న విద్యార్థులునిపుణులు నుంచి అందిన సూచనలు, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం పనిచేసి బ్రెయిలీ మ్యాప్‌లను అభివృద్ధి చేసే అంశంపై దృష్టి సారించి నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ పరిశోధనలు చేపట్టింది. మ్యాపుల పరిమాణాన్ని తగ్గించి చదివేందుకు ఎక్కువ సౌకర్యాలు కల్పించి, సులువుగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లేందుకు వీలుగా వీటిని నేషనల్ అట్లాస్ & థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ రూపొందించింది. 

1997లో నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ ప్రారంభమయింది. దృష్టి లోపం కలిగి ఉన్నవారి సౌకర్యం కోసం 2017లో బ్రెయిలీ అట్లాస్ (ఇండియా)ను విడుదల చేసి సంస్థ వెలుగులోకి వచ్చింది. సంస్థ విడుదల చేసిన బ్రెయిలీ అట్లాస్ (ఇండియా)కు దృష్టి లోపం ఉన్న వారి నుంచి ఆదరణ లభించింది. ఎంబాసింగ్ విధానంలో స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సంస్థ ఈ ప్రతులను సంస్థ రూపొందించింది. 2017 ఫిబ్రవరి 10న ఈ ప్రతి ఢిల్లీలో అధికారికంగా విడుదల అయ్యింది. దృష్టి లోపం ఉన్నవారికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ అవార్డును ప్రధానం చేశారు. 

బ్రెయిలీ అట్లాస్‌ల కోసం  అన్ని ప్రాంతాల నుంచి నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ కు పెద్దఎత్తున ఆర్డర్లు లభించాయి. బ్రెయిలీ లిపిలో అత్యున్నత సంస్థగా నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ గుర్తింపు పొందింది. హిందీ ఇతర ప్రాంతీయ భాషల్లో బ్రెయిలీ లిపి మ్యాపులను సంస్థ అభివృద్ధి చేసి విడుదల చేసింది. నిపుణులు, సంస్థలను సంప్రదించి రాష్ట్రాల  కోసం  సంస్థ బ్రెయిలీ అట్లాస్‌లను రూపొందించింది. 

శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ నుంచి అందిన సహకారంతో నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అత్యాధునిక సౌకర్యాలతో బ్రెయిలీ యూనిట్ ను నెలకొల్పింది. డిజిటల్ విధానంలో ఎంబాసింగ్ చేసేందుకు కృత్రిమ మేధస్సు(ఏఐ), స్పాట్ యూవీ కోటింగ్ సౌకర్యాలను కల్పించింది. డిజిటల్ వేదికలో ఈ యూనిట్ లో వివిధ దశల్లో పని పూర్తి అవుతుంది. 

జీఐఎస్ పరిజ్ఞానాన్ని వినియోగించి థీమాటిక్ మ్యాప్‌లు సిద్ధమవుతాయి. దీని తరువాత హార్డ్ కాపీ ఉత్పత్తులను  మృదువైన షీట్లతో లామినేట్ చేయడం జరుగుతుంది. లామినేట్ చేసిన షీట్లను ఎంబాసింగ్ డిజిటల్ పరికరాలపై ఉంచి యూవీ కోటింగ్ చేస్తారు. సాఫ్ట్ కాపీలో గుర్తించిన ప్రాంతాలను ఎంబాసింగ్ చేసి తుది మ్యాపులను ఏఇ పరిజ్ఞానాన్ని ఉపయోగించి సిద్ధం చేయడం జరుగుతుంది. దృష్టి లోపం ఉన్న విద్యార్థులు సులువుగా ఉపయోగించేందుకు వీలుగా పూర్తి మ్యాప్ ను స్పైరల్ బైండింగ్ చేస్తారు. 

దేశంలో 323 బ్రెయిలీ అట్లాస్ ఆఫ్ ఇండియాను పంపిణీ చేయడం జరిగింది. అట్లాస్ ను విడుదల చేయడంతో పాటు  నేషనల్ అట్లాస్ అండ్  థిమాటిక్ మ్యాపింగ్ ఆర్గనైజేషన్ అంధ విద్యార్థుల కోసం వర్క్ షాపులు, సదస్సులను నిర్వహించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, శిక్షకుల్లో అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వీటిని నిర్వహించడం జరిగింది. 2017 నుంచి 2019 వరకు  సంస్థ నిర్వహించిన వర్క్ షాపులు, సదస్సుల్లో 22 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 97 పాఠశాలకు చెందిన 1409 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దృష్టి లోపంతో భాధ పడుతున్న విద్యార్థుల కోసం సంస్థ రూపొందించిన వినూత్న సౌకర్యాన్ని త్వరలో జాతీయ స్థాయిలో విడుదల చేయడం జరుగుతుంది. 

 ***


(Release ID: 1789073) Visitor Counter : 235