బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేలా భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని కోరిన కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి
Posted On:
07 JAN 2022 4:32PM by PIB Hyderabad
ఛత్తీస్‌గఢ్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్‌కు సంబంధించిన వివిధ భూసంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలని
కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఒక ట్వీట్‌లో కోరారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ భూపేష్ బఘెల్‌తో ఈరోజు నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ విషయమై మాట్లాడుతూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తే చత్తీస్‌గఢ్ నుండి బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచే వీలుంటుందని సూచించారు. ఖనిజ రంగంలో ఇటీవల తీసుకొచ్చిన పలు సంస్కరణల ప్రకారం బొగ్గు బ్లాకుల వేలాన్ని వేగవంతం చేయాలని శ్రీ జోషి ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
దేశంలో బొగ్గు లభ్యత స్థితిని సమీక్షించేందుకు బొగ్గు, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర మంత్రి శ్రీ జోషి మాట్లాడుతూ వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు శ్రామిక శక్తిని మరింత ప్రోత్సహించాలని యాజమాన్యాలను కోరారు. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు కట్టుబడి ఉండాలని శ్రీ జోషి అధికారులకు సూచించారు. థర్మల్ పవర్ ప్లాంట్‌లకు బొగ్గు సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆయన నొక్కి చెప్పారు. భద్రతతో కూడిన ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని మంత్రి ఈ సందర్భంగా మరోసారి పునరుద్ఘాటించారు.
****
(Release ID: 1788473)
Visitor Counter : 135