ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతుల సమీక్షా సమావేశం


తగిన మూలధనాన్ని సమకూర్చుకుని , భవిష్యత్తులో ఎలాంటి ఒత్తిడి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రికి తెలిపిన పీఎస్‌బీలు

Posted On: 07 JAN 2022 4:04PM by PIB Hyderabad

ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకుల పనితీరును కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు వర్చువల్ విధానంలో బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్‌లతో సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిసాన్ రావు కరోడ్, ఆర్థిక సర్వీసుల శాఖ కార్యదర్శి శ్రీ  దేబాశిష్ పాండా, శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

 

కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం, భారత రిజర్వు బ్యాంకు రూపొందించిన చర్యల అమలు తీరును మంత్రి సమావేశంలో సమీక్షించారు. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్న కోవిడ్-19 వల్ల  భవిష్యత్తులో ఎదురయ్యే  అంతరాయాలను ఎదుర్కోవడానికి బ్యాంకులు ఏ మేరకు సిద్ధంగా ఉన్నాయన్న అంశాన్ని కూడా శ్రీమతి నిర్మలా సీతారామన్ సమీక్షించారు. 

ఈసీఎల్ జీఎస్ అమలు చేసే అంశంలో బ్యాంకులు సాధించిన ప్రగతి పట్ల ఆర్థిక మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అయితే, సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉన్న రంగాలను ఆదుకునేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. వ్యవసాయ రంగం, రైతులు, రిటైల్ రంగం, ఎంఎస్ఎంఈ రంగాలకు అవసరమైన సహకారం అందించాలని బ్యాంకులకు శ్రీమతి సీతారామన్ సూచించారు. 

ప్రపంచ అభివృద్ధి ,  ఒమిక్రాన్ వ్యాప్తి రూపంలో అవాంతరాలు ఎదురవుతున్న సమయంలో కూడా వ్యాపార దృక్పథం క్రమంగా మెరుగుపడుతుందని సీతారామన్ పేర్కొన్నారు.  మహమ్మారిపై పోరాడటంలో సహాయపడటానికి కాంటాక్ట్ ఇంటెన్సివ్ రంగాలకు బ్యాంకుల నుంచి మరింత సహకారం అవసరముంటుందని  అవసరమని ఆర్థిక మంత్రి అన్నారు.

పరపతి రంగ అవసరాలను ప్రస్తావించిన ఆర్థిక మంత్రి  రిటైల్ విభాగాల్లో కనిపిస్తున్న వృద్ధిమొత్తం స్థూల ఆర్థిక అవకాశాల మెరుగుదల మరియు రుణగ్రహీతలు ఆర్థిక స్థితిగతులు  మెరుగుపడటం వంటి కారణాలతో క్రెడిట్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని  తెలిపారు.

దేశంలో రుణాల చెల్లింపులు పెరుగుతున్నాయని సమీక్షా సమావేశంలో మంత్రికి ప్రభుత్వ రంగ బ్యాంకుల అధిపతులు వివరించారు. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, కోవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిడి నుంచి ఆర్థిక వ్యవస్థకు బ్యాంకుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందిందని సమావేశంలో పేర్కొనడం జరిగింది. 

ప్రభుత్వ రంగ బ్యాంకుల ( పీఎస్‌బీ  పనితీరు -

·  2020-21 ఆర్థిక సంవత్సరంలో   పీఎస్‌బీ లు 31,820 కోట్ల రూపాయల  నికర లాభాన్ని నమోదు చేశాయి  , ఇది గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఇదే  అత్యధికం.

·  2021-22 ఆర్థిక సంవత్సరం  మొదటి అర్ధ భాగంలో ఆర్జించిన  31,145 కోట్ల రూపాయల  నికర లాభం  2020-21 ఆర్థిక సంవత్సరం నికర లాభానికి సమానం. 

·   గత 7 ఆర్థిక సంవత్సరాల్లో   పీఎస్‌బీ లు   5,49,327 కోట్ల రూపాయల రుణాలను తిరిగి రాబట్టాయి.

·   పీఎస్‌బీలు తగినంత  మూలధనాన్ని కలిగి ఉన్నాయి.  2021 సెప్టెంబర్  నాటికి బ్యాంకుల సీఆర్ఏఆర్  14.4%గా ఉంది, నియంత్రణ నిబంధనల మేరకు ఇది  11.5% (సీసీబీ తో సహా) గా ఉండవలసి ఉంది. .

·  సెప్టెంబర్ 2021 నాటికి బ్యాంకుల  CET1 10.79% గా  ఉందినిబంధనల మేరకు ఇది  8%.గా ఉండాలి. 

·  2021  సెప్టెంబర్  నాటికి వ్యక్తిగత రుణాలలో 11.3%, వ్యవసాయ రుణాలలో 8.3% మరియు మొత్తం క్రెడిట్ వృద్ధి 3.5% వార్షికంగా క్రెడిట్ వృద్ధిని నమోదు చేశాయి.

·  అక్టోబర్ 2021లో ప్రారంభించబడిన క్రెడిట్ ఔట్రీచ్ ప్రోగ్రామ్ కింద  ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం  61,268 కోట్ల రూపాయల రుణాలను అందించాయి.  .

·  కోవిడ్ -19  మహమ్మారి సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు  ECLGS (మే 2020లో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ఎంఎస్ఎంఈ  రంగానికి ఉపశమనాన్ని అందించడానికి ప్రారంభించబడ్డాయి), LGSCAS మరియు పీఎం స్వానిది వంటి వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాయి. 

·   పెంచిన పరిమితిలో ప్రభుత్వం అందించిన 4.5 లక్షల కోట్ల రూపాయలలో  ECLGS కి  64.4% లేదా 2.9 లక్షల కోట్ల రూపాయలు  నవంబర్ 2021 వరకు మంజూరు చేయబడ్డాయి. ECLGS కారణంగా 13.5 లక్షలకు పైగా చిన్న యూనిట్లు మహమ్మారి నుంచి రక్షణ పొందాయి. దీనివల్ల   1.8 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే  విలువైన  ఎంఎస్ఎంఈ    రుణాలు నిరర్థక ఆస్తుల లోకి చేరలేదు.  ఈ చర్య వల్ల సుమారు  6 కోట్ల కుటుంబాలు జీవనోపాధి రక్షించబడింది. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు తగినంత మూలధనాన్ని కలిగి,  భవిష్యత్తులో ఎదురయ్యే  ఎలాంటి ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొనేందుకు  బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయని సమీక్షా సమావేశంలో అవగాహన కలిగింది. 

కోవిడ్-19 మహమ్మారి ప్రారంభం నుంచి దేశానికి అసాధారణంగా సహకారం అందించిన బ్యాంకర్లకు  ఆర్థిక మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ECLGS విజయానికి బ్యాంకింగ్ వ్యవస్థ  సమిష్టి కృషి కారణమని ఆమె పేర్కొన్నారు.  సిబ్బంది, వారి కుటుంబ భద్రత కోసం కోవిడ్ -19 అనుగుణ  ప్రవర్తనను అమలు చేయాలని, ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకునేలా చూడాలని బ్యాంకర్లకు శ్రీమతి నిర్మలా సీతారామన్ సూచించారు. 

సమావేశంలో ప్రసంగించిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ పీఎస్‌బీలు  ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందిస్తున్నాయని అన్నారు.  మహమ్మారి కాలంలో బ్యాంకులు కనబరిచిన  పనితీరుకు అభినందనలు తెలిపారు. కాలంతో పాటు మారుతున్న బ్యాంకింగ్ వ్యవస్థ ఖాతాదారులకు అవసరమైన సేవలు అందిస్తున్నదని  డాక్టర్ కరాద్ అన్నారు.

సమావేశానికి ముందు మహమ్మారి రాక ముందు, వచ్చిన తరువాత దేశ బ్యాంకింగ్ రంగ వ్యాపారంపై ఎస్బీఐ చైర్ పర్సన్ సమగ్ర నివేదిక అందించారు. వివిధ బ్యాంకుల సీఎండీలు/ఎండీలు బ్యాంకింగ్ రంగంపై సమగ్ర వివరాలు అందించి వ్యాపార అభివృద్ధికి అమలు చేయాల్సిన చర్యలపై సూచనలు అందించారు. 

***



(Release ID: 1788472) Visitor Counter : 137