జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో త్వరలో 'హర్ ఘర్ జల్‌'కు హామీ ఇవ్వనున్నారు

Posted On: 04 JAN 2022 12:41PM by PIB Hyderabad

 

గుజరాత్ విజయగాథ

గుజరాత్‌లోని ఆనంద్, బొటాడ్, గాంధీనగర్, మెహసానా, పోర్ బందర్ మరియు వడోదర వంటి ఆరు జిల్లాల్లోని 100% గ్రామీణ కుటుంబాలకు వారి ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను నిర్ధారించిన తర్వాత  రాష్ట్రంలోని 17 జిల్లాలు మోర్బి, జామ్‌నగర్, పటాన్, బరూచ్, డాంగ్, జునాగఢ్, గిర్ సోమనాథ్, కచ్ఛ్, రాజ్‌కోట్, అహ్మదాబాద్, నవ్‌సారి, అమ్రేలి, బనాస్ కంఠా, భావ్‌నగర్, సూరత్, సురేందర్ నగర్ మరియు ఖేడాల్లో 90% కంటే ఎక్కువ గృహాలకు సరఫరా అవుతుంది. రాష్ట్రంలో దాదాపు 90% గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటి సరఫరా అందుబాటులో ఉంది. అక్టోబర్, 2022 నాటికి రాష్ట్రం 100% సంతృప్తతను సాధించాలని యోచిస్తోంది.

 

image.png



భావ్‌నగర్ జిల్లాలోని గ్రామాలు ద్వంద్వ  ప్రణాళికను కలిగి ఉన్నాయి. వానాకాలం బాగా కురువడంతో ఈ ఏడాది అక్టోబర్‌లో 8-18 అడుగులకు చేరిన బహిరంగ బావుల నీటిని తాగునీటి సరఫరాకు వినియోగిస్తున్నారు. పొడి నెలలలో గ్రామాలు మహి పరియేజ్ ప్రాంతీయ నీటి సరఫరా పథకం నుండి నీటిని తీసుకుంటాయి (అవసరమైనప్పుడు ఈ పథకం మహి నది నుండి అలాగే నర్మదా నుండి నీటిని పొందుతుంది). జిడబ్లుఎస్‌ఎస్‌బి  గ్రామ స్థాయి వరకు నీటి సరఫరాను అందిస్తుంది. జిల్లాలో పెద్ద సంఖ్యలో గ్రామీణ కుటుంబాలు కూడా వర్షపు నీటి సంరక్షణను పాటిస్తున్నారు.

గ్రామ స్థాయిలో నీరు మరియు పారిశుద్ధ్య నిర్వహణ సంస్థ (డబ్లుఏఎస్‌ఎంఓ) జేజేఎం అమలులో సాంకేతిక భాగానికి నాయకత్వం వహిస్తోంది. భావ్‌నగర్ జిల్లాలోని తలజా మరియు మహువ బ్లాక్‌లలో గుజరాత్‌కు చెందిన కోస్టల్ లవణీయత నివారణ సెల్ (సిఎస్‌పిసి), గుజరాత్‌లోని గ్రామీణ వర్గాలతో తాగునీటి సరఫరా మరియు యాక్సెస్ సమస్యలు, వర్షపు నీటి సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణలో సుదీర్ఘ అనుభవంతో ఐఈసీ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తోంది.అలాగే  కమ్యూనిటీ సమీకరణ, మరియు పాణి సమితులు మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తోంది.

ఆగస్ట్, 2019లో జేజేఎం ప్రారంభించబడినప్పుడు భావ్‌నగర్‌లో దాదాపు 85% గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నాయి. కుళాయి నీటి సరఫరా లేని గ్రామాల్లో కూడా భాగస్వామ్య ప్రణాళికా విధానం కమ్యూనిటీలకు సుపరిచితం. గ్రామంలో నీటి సరఫరా పనులకు 10% ఖర్చు మరియు నెలవారీ ఓ అండ్ ఎం ఛార్జీల చెల్లింపుపై సంఘం ఏకాభిప్రాయం లేకపోవడం లేదా పథకాన్ని కొనసాగించడంలో ప్రేరణ లేకపోవడం వల్ల ఈ గ్రామాలు ఇంటి పైపుల ద్వారా తాగునీటి సరఫరాకు మునుపటి అవకాశాలను కోల్పోయాయి. ఈ గ్రామాలు ఇప్పుడు వారి జేజేఎం ఇన్-విలేజ్ స్కీమ్‌లను పొందడానికి స్పష్టంగా ఆసక్తిని కలిగి ఉన్నాయి మరియు వారి ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ సపోర్ట్ ఏజెన్సీ మరియు ప్రభుత్వంతో చురుకుగా పని చేస్తున్నాయి.

సిఎస్‌పిసి దాని కమ్యూనిటీ సమీకరణ, అవగాహన మరియు సామర్థ్య నిర్మాణ కార్యక్రమం ద్వారా కీలక పాత్ర పోషించింది. కోవిడ్-19 మహమ్మారి నియంత్రణల సమయంలో ప్రారంభ దశల్లో సిఎస్‌పిసి ప్రోగ్రామ్ భాగాలు, పానీ సమితుల పాత్రలు మరియు బాధ్యతలు, ఇంటింటికి తాగునీరు సరఫరా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మొదలైన వాటిపై వాట్సాప్ గ్రూప్‌లు, యానిమేషన్ ఫిల్మ్‌ల వంటి డిజిటల్ మీడియా ద్వారా అవగాహన పెంచింది.

సిఎస్‌పిసి కమ్యూనిటీ సహకారాన్ని సమీకరించే ప్రచారాలను చేపట్టింది మరియు గ్రామ పంచాయతీ ద్వారా ప్రోగ్రామ్ యాజమాన్యాన్ని నిర్ధారించింది. సిఎస్‌పిసి ఫీల్డ్ మేనేజర్‌లు మరియు ట్రైనర్‌ల ప్రకారం ఎఫ్‌హెచ్‌టిసి లేని గ్రామాలు కూడా మునుపటి కార్యక్రమంలో వారి పానీ సమితిలను ఏర్పాటు చేశాయి.  సిఎస్‌పిసి వారి ప్రోగ్రామ్ అవగాహన మరియు శిక్షణ ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా జేజేఎం ప్రోగ్రామ్ కింద గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థలను అమలు చేయడానికి ఈ పానీ సమితిలను సక్రియం చేసింది. పంచాయతీ ఎన్నికలు జరిగిన కొన్ని గ్రామాలలో సిఎస్‌పిసి గ్రామ పంచాయితీలు వారి పాణి సమితిలను ఏర్పాటు చేయడంలో సహాయపడింది.

భావ్‌నగర్‌లో సిఎస్‌పిసి కమ్యూనిటీ సమీకరణలో పానీ సమితిలకు శిక్షణ ఇచ్చింది; గ్రామ నీటి సరఫరా వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం అవసరం; పార్టిసిపేటరీ రూరల్ అప్రైజల్ (పిఆర్‌ఏ) విధానం ద్వారా గ్రామ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయడం; సంఘం సహకారం పెంచడం; నీటి వినియోగదారు ఛార్జీలను నిర్ణయించడం; వాటర్‌వర్క్స్ నిర్మాణ నిర్వహణ మరియు ఓ& ఎం మొదలైనవి. సిఎస్‌పిసి కూడా సాంకేతిక సర్వేలు, టెండర్ ప్రక్రియ, వ్యయ విశ్లేషణ మరియు జాతీయ బ్యాంకులో పానీ సమితి యొక్క బ్యాంక్ ఖాతా తెరవడంతో సహా గ్రామంలో నీటి సరఫరా పథకం యొక్క అన్ని వ్రాతపని ద్వారా పానీ సమితులకు మద్దతు ఇచ్చింది.

ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను ఉపయోగించి నీటి నాణ్యత పరీక్ష, పర్యవేక్షణ మరియు నిఘాలో పానీ సమితులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం డబ్లుఏఎస్‌ఎంఓ నీటి నాణ్యత ప్రయోగశాలల ద్వారా రుతుపవనాల ముందు మరియు అనంతర నీటి నాణ్యత అంచనాలను నిర్వహిస్తుంది. ఇప్పుడు పానీ సమితి ద్వారా పథకాలు నిర్వహించబడుతున్న గ్రామాల్లో గృహాలు కనీస నెలవారీ వినియోగదారు ఛార్జీలను చెల్లిస్తాయి. కొన్ని పానీ సమితులు నెలవారీ ప్రాతిపదికన వినియోగదారు ఛార్జీలను సేకరిస్తాయి. అయితే కొన్ని సమితులు దీపావళి లేదా హోలీ సమయంలో నీటి ఛార్జీల అర్ధ-వార్షిక సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేశాయి.

గుజరాత్‌లో గ్రామీణ పైపుల తాగునీటి సరఫరా వేగంగా పెరగడంలో కొన్ని అంశాలు ఉత్ప్రేరక పాత్ర పోషించాయి:

గ్రామ మహిళలతో ప్రత్యక్ష సంభాషణ

సిఎస్‌పిసి మరియు డబ్లుఏఎస్‌ఎంఓ అధికారుల ప్రకారం గుజరాత్‌లో పనిచేసిన ఒక అంశం ఏమిటంటే..తాగునీటి సరఫరా పథకాల గురించి గ్రామీణ మహిళలతో నేరుగా కమ్యూనికేట్ చేయడం, ఎక్కువగా మహిళలు తమ ఇళ్లకు నీటిని సేకరించే బాధ్యత వహిస్తారు. మహిళలు త్రాగునీటి పైపుల నీటి సరఫరా యొక్క ఆరోగ్యపరమైన అంశాలకు మరింత ప్రతిస్పందిస్తారు మరియు వారి స్థితిని మెరుగుపరచుకోవడం కోసం నిశ్చయమైన స్థితిని తీసుకుంటారు.

జిల్లా యంత్రాంగం మరియు స్థానిక మీడియా

గుజరాత్‌లోని జిల్లా మంచినీటి మరియు పారిశుద్ధ్య పరిపాలన మరియు స్థానిక మీడియా ఉమ్మడిగా పని చేస్తూ గ్రామస్తులు మరియు గ్రామ పంచాయతీలను కార్యాచరణలోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి. జిల్లా పరిపాలన ద్వారా మంజూరు చేయబడిన గ్రామంలోని పథకాల వివరాలను స్థానిక వార్తాపత్రికలు మరియు ఇతర మాధ్యమాలు ప్రచురించాయి. గ్రామస్తులు మరియు పంచాయతీలను కార్యక్రమ లక్ష్యాల వైపు సమీకరించడంలో ఇది సానుకూల ప్రభావాన్ని చూపింది. మీడియా ప్రస్తావన సర్పంచ్‌లను వారి గ్రామంలోని పథకాలకు నాయకత్వం వహించేలా ప్రోత్సహించింది.

పానీ సమితులకు గుర్తింపు

గ్రామంలో నీటి సరఫరా మరియు నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలలో పానీ సమితులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా గుజరాత్ ప్రభుత్వం వారి పని మరియు ప్రయత్నాలను వార్షిక అవార్డులు మరియు గుర్తింపు ద్వారా ప్రోత్సహిస్తోంది. ప్రపంచ నీటి దినోత్సవం నాడు వారి గ్రామంలో నీటి పథకం యొక్క ఓ&ఎంలో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న పానీ సమితి తన గ్రామంలోని పథకం ఖర్చులో 10%కి సమానమైన అవార్డును మూడేళ్ల లాక్-ఇన్ పీరియడ్‌తో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా పొందుతుంది. పానీ సమితులలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరొక రివార్డ్ ద్వారా గుజరాత్ ప్రభుత్వం మొత్తం మహిళా పానీ సమితుల పనిని కూడా గుర్తిస్తుంది. నీటి రంగంలో మహిళల ప్రోత్సాహం నీటి పంపిణీ నిర్వహణలో పోటీ స్ఫూర్తిని ప్రోత్సహించింది మరియు గుజరాత్‌కు మంచి ఫలితాలు వచ్చాయి.

ఎఫ్‌హెచ్‌టిసి సంతృప్త గ్రామాలలో తదుపరి శిక్షణ

భవిష్యత్ విధానాన్ని అవలంబిస్తూ డబ్లుఏఎస్‌ఎంఓ గ్రామాల్లోని పథకాల ఓ&ఎం సమాచారాన్ని సేకరించడం మరియు విశ్లేషించడంలో గ్రామాల పానీ సమితి/గ్రామ పంచాయతీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఒక వ్యూహాన్ని రూపొందించింది; నీటి నాణ్యత పరీక్షకు సంబంధించిన ఎంఐఎస్‌ డేటా ధృవీకరణ మరియు ఎంఐఎస్‌లో డేటాను అప్‌లోడ్ చేయడం; పంప్ ఆపరేటర్లు, ప్లంబర్లు మరియు ఎలక్ట్రీషియన్ల శిక్షణ; గుజరాత్ డొమెస్టిక్ వాటర్ (రక్షణ) చట్టానికి సంబంధించి వాటర్ ఆడిట్ నిబంధనలను  పేర్కొనడం; గ్రేవాటర్ నిర్వహణ; 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద తాగునీరు మరియు పారిశుద్ధ్య నిబంధనలు; గ్రామ తాగునీటి పంపిణీ వ్యవస్థ క్లోరినేషన్; మరియు రోజువారీ నీటి సరఫరా ప్రయోజనాలు మొదలైనవి ఉన్నాయి. శిక్షణ కార్యక్రమం కింద, శిక్షణ సందేశాలను బలోపేతం చేయడానికి సిఎస్‌పిసి వీధి నాటకాలను నిర్వహిస్తుంది. ఇందులో పానీ సమితిలను మరింత బాధ్యతాయుతంగా మరియు ప్రతిస్పందించేలా చేయడానికి ఇటువంటి జోక్యాలను సులభతరం చేయడానికి భావ్‌నగర్‌లోని 100 గ్రామాల కోసం సిఎస్‌పిసి డబ్లుఏఎస్‌ఎంఓతో భాగస్వామ్యం కలిగి ఉంది.


 

****


(Release ID: 1787528) Visitor Counter : 145


Read this release in: English , Urdu , Hindi , Gujarati