జల శక్తి మంత్రిత్వ శాఖ
గంగా పరిశుభ్రత జాతీయ మిషన్ కు డైరక్టర్ జనరల్ గా బాధ్యతలు స్వీకరించిని శ్రీ జి అశోక్ కుమార్
Posted On:
03 JAN 2022 7:23PM by PIB Hyderabad
జలశక్తి మంత్రిత్వశాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్న శ్రీ జి .అశోక్ కుమార్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ కు కొత్త డైరక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయన 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు చెందిన తెలంగాణా కాడర్ అధికారి. గతంలో ఆయన పౌర విమానయాన శాఖలో జాయింట్ సెక్రటరీగా, విద్యుత్ మంత్రిత్వశాఖలో డైరక్టర్‌గా కీలక పదవులు నిర్వహించారు. గతంలో ఆయన నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా కార్యక్రమానికి సంబంధించి ఎక్జిక్యుటివ్ డైరక్టర్,ప్రాజెక్ట్స్ గా కూడా పనిచేశారు.
జలవనరుల రంగంలో ఆయన విస్తృతంగా పనిచేశారు. ఎన్.ఎం.సి.జిలో పనిచేయడానికి ముందు ఆయన నేషనల్ వాటర్ మిషన్ కు సంబంధించి మిషన్ డైరక్టర్ గా పనిచేశారు. అక్కడ ఆయన జలశక్తి అభియాన్ : వర్షపునీటిని ఒడిసిపడదాం ప్రచారం తో దేశవ్యాప్తంగా 9.5 లక్షల వర్షపునీటి నిల్వనిర్మాణాలు చేపట్టడానికి , వర్షపునీటి సంరక్షణకు వీలు కల్పించింది. దీనితో ఆయనకు రెయిన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు వచ్చింది. అలాగే ఆయన నెలవారీ గా నీటి ప్రసంగాలు, నీటి సాంకేతిక ప్రసంగాల వంటి పలు చర్యలు చేపట్టారు. అన్ని రాష్ట్రాలకు నీటి బడ్జెట్‌లు రూపొందించారు. వివిధ పారిశ్రామిక రంగాల యూనిట్లకు నీటి ఆడిట్ వంటి వాటిని చేపట్టారు. నీటిపారుదల ప్రాజెక్టులు నీటిని సమర్ధంగా వినియోగించుకోవడం వంటి వాటిపై కృషి చేశారు. దీనికి తోడు, 2002లో జిల్లా కలెక్టర్‌గా నిజామాబాద్ జిల్లాలోని వెయ్యి పాఠశాలల్లో 0.14 మిలియన్ టాయిలెట్స్ నిర్మాణానికి మద్దతునిచ్చారు. 2008లో హైదరాబాద్‌లో 3 మిలియన్ల మందికిపైగా ప్రజలకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు కృషి చేశారు.
శ్రీ అశోక్ కుమార్ పలు ఇతర రంగాలలో కూడా పనిచేశారు. మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రణాళిక, పౌర విమానయానం, విద్యుత్, క్రీడలు, సంక్షేమం, ఆరగ్యం, విద్య, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలలో కూడా పనిచేశారు. 162 కిలోమీటర్ల 8 లైన్ల ఔటర్ రింగ్ రోడ్, 90 ఎంజిడి కృష్ణా రెండో దశ మంచినీటి ప్రాజెక్టు, 90 ఎంజిడి గోదావరి తాగునీటి ప్రాజెక్టు , మురుగునీటి శుద్ధి ప్లాంట్లు వంటి పలు ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేశారు. భారతదేశపు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోను నెలకొల్పడంలో కీలక పాత్ర వహించారు. ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం కు ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు. శ్రీ అశోక్ కుమార్ పలు అవార్డులు గెలుచుకున్నారు. 2021 లో ప్రజాసేవలకు ఎస్ కెఒసిహెచ్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జల మిత్ర అవార్డు, ప్రజా పాలనా రంగంలో విశేష కృషి చేసినందుకు తెలంగాణా ప్రభుత్వం నుంచి తొలి తెలంగాణా ఎక్సలెన్సు అవార్డు ను పొందారు.
***
(Release ID: 1787411)
Visitor Counter : 257