రక్షణ మంత్రిత్వ శాఖ
వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ-DRDO
Posted On:
03 JAN 2022 6:04PM by PIB Hyderabad
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) జనవరి 01, 2022న 64వ DRDO దినోత్సవాన్ని జరుపుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి R&D, ఛైర్మన్ DRDO డాక్టర్ జి. సతీష్ రెడ్డి జనవరి 03, 2022న న్యూఢిల్లీలో DRDO ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. DRDO దేశం కోసం కీలకమైన భూమిక నిర్వహిస్తోంది. ఏరోనాటిక్స్, ఆయుధాలు, పోరాట వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇంజనీరింగ్ సిస్టమ్స్, క్షిపణులు, మెటీరియల్స్, నావికా వ్యవస్థలు, అధునాతన కంప్యూటింగ్, సిమ్యులేషన్, సైబర్, హైపర్‌సోనిక్ టెక్నాలజీస్, క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్ తోపాటు రక్షణ కోసంఉపయోగించే ఆధునిక సాంకేతికతలు.
సెక్రటరీ డిడిఆర్ అండ్ డి, డిఆర్‌డిఓతో పాటు డిఆర్‌డిఓ ప్రధాన కార్యాలయ డైరెక్టర్ జనరల్స్, ఇతర డైరెక్టర్లు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభను ఉద్దేశించి DRDO ఛైర్మన్ ప్రసంగిస్తూ DRDO ఉద్యోగులకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రాజెక్ట్ బృందాల ఉత్సాహం, పట్టుదల మరియు అంకితభావం, సమర్థ నాయకత్వం ద్వారా డిఆర్‌డిఓ అనేక విజయాలు సాధించిందని ఆయన అన్నారు. లక్ష్యాలను సాధించడంలో ఆర్థిక సలహాదారులు, కార్పొరేట్ బృందాలు, పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వ వాటాదారులు వంటి వారి కృషి వల్ల ఇది సాధ్యమైంది అని ప్రస్తావించారు..
సెక్రటరీ DDR&D 2021లో 175 ట్రాన్స్‌ఫర్ ఆఫ్ టెక్నాలజీ (ToT) లైసెన్స్ పై సంతకం చేశామని, DRDO అభివృద్ధి చేసిన వ్యవస్థల ఉత్పత్తి విలువ ఇప్పటివరకు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉందని వెల్లడించారు. ప్రాజెక్ట్‌లలో అభివృద్ధి ఉత్పత్తుల భాగస్వామిగా (డిసిపిపి), ఉత్పాదక సంస్థల (పిఎ) పరిశ్రమల భాగస్వామ్యాన్ని డిఆర్‌డిఓ నిర్ధరిస్తున్నదని ఆయన అన్నారు. పరిశ్రమల కోసం DRDO పరీక్షా సౌకర్యాలను తెరిచారు. GOCO (ప్రభుత్వ యాజమాన్యం-కంపెనీ నిర్వహణ) కోసం మార్గదర్శకాలు ప్రకటించారు.
డాక్టర్ జి సతీష్ రెడ్డి పేర్కొన్న అంశాలలో 2021లో కొత్తతరం క్షిపణి భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాన్ని ఛేదించే –ఆకాష్ (NG SAM), భూమి నుంచి భూమ్మీద లక్ష్యాన్ని గురిచూసే కొత్త తరం క్షిపణి -ప్రళయ్, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ విమానం, స్వదేశీ ఎయిర్ ఫ్రేమ్‌ల వంటి DRDO సాధించిన అనేక మైలురాళ్లను ప్రస్తావించారు. క్షిపణి, వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ SAM, స్టాండ్-ఆఫ్ యాంటీ-ట్యాంక్ (SANT) క్షిపణి, టార్పెడోలను విడుదల చేసే సూపర్సోనిక్ క్షిప అనేక ఇతర వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఆకాష్ క్షిపణి వ్యవస్థ, బ్రహ్మోస్, ఆయుధ స్తావరాలను గుర్తించే రాడార్, టార్పెడోలు, సోనార్లు మొదలైన వ్యవస్థలకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అందించిన సాంకేతిక నైపుణ్యం ఎంతో విశిష్టమైనది.
కోవిడ్ రెండవ వేవ్ సమయంలో DRDO సాంకేతికత యొక్క సామాజిక సహకారం కూడా ఎన్నదగినది. దేశవ్యాప్తంగా 869 ప్రాంతాల్లో తొమ్మిది వందల ముప్పై ఒక్క మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు అయ్యాయి. 7,400 కంటే ఎక్కువ పడకలతో 13 కోవిడ్ ఆసుపత్రులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దేశవ్యాప్తంగా DRDO సహకారంతో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పాటు అయ్యాయి. మహమ్మారి సమయంలో 2-డియోక్సీ-డి-గ్లూకోన్ (2డిజి) చికిత్సా అప్లికేషన్ రూపంలో యాంటీ కోవిడ్ ఔషధ అభివృద్ధిలో కీలకమైన పురోగతి సాధ్యం అయ్యింది.
యూజర్ ట్రయల్స్ సమయంలో సాయుధ దళాలతో సన్నిహిత సమన్వయంతో పనిచేసిన DRDO శాస్త్రవేత్తలు ఇతర సిబ్బందిని అభినందిస్తూ, కార్యదర్శి DDR&D వారికి అనేక లక్ష్యాలను నిర్దేశించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘మేక్ ఇన్ ఇండియా అండ్ మేక్ ఫర్ ద వరల్డ్’ లక్ష్యాల సాధన కోసం శాస్త్రవేత్తలు అత్యాధునిక వ్యవస్థలు సాంకేతికతల అభివృద్ధిని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడానికి అధునాతన భవిష్యత్తు సాంకేతికతలపై కలిసి పనిచేయడానికి పరిశ్రమలు, విద్యా సంస్థలు, పరిశోధన, అభివృద్ధి సంస్థలతో కూడిన దేశంలో రక్షణ పర్యావరణాన్ని ప్రోత్సహించడంలో DRDO పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను డాక్టర్ జి సతీష్ రెడ్డి నొక్కి చెప్పారు.
DRDO డే ఈవెంట్‌ను పురస్కరించుకుని సిస్టమ్స్ ఇంజనీరింగ్‌పై మోనోగ్రాఫ్‌తో పాటు నాలుగు అంతర్గత ఆటోమేషన్ పోర్టల్‌లు మరియు రెండు పత్రాలు ప్రారంభించారు. DRDO దినోత్సవ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం DRDO సోదరులు అంతర్గత నెట్‌వర్క్ ద్వారా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.
DRDO 1958లో డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ (DSO)తో ఇండియన్ ఆర్మీకి చెందిన అప్పటి ఇప్పటికే పనిచేస్తున్న టెక్నికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (TDEలు), డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్‌మెంట్ & ప్రొడక్షన్ (DTDP) కలయికతో ఏర్పడింది. DRDO అప్పుడు 10 సంస్థలు లేదా ప్రయోగశాలలతో కూడిన ఒక చిన్న సంస్థ. సంవత్సరాలుగా, వివిధ రకాల సబ్జెక్ట్ విభాగాలు, ప్రయోగశాలల సంఖ్య, విజయాలను బట్టి ఇది అనేక దిశలలో పెరిగింది.
***
(Release ID: 1787283)
Visitor Counter : 343