ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రేపు నాసిక్‌లో సిజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
ముంబై, పూణే మరియు నాగ్‌పూర్ తర్వాత మహారాష్ట్రలో సిజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను కలిగి ఉన్న నాల్గవ నగరం నాసిక్ కానుంది
Posted On:
02 JAN 2022 11:04AM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ రేపు అనగా 3 జనవరి 2022న నాసిక్‌లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద వెల్‌నెస్ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జరిగే సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ పవార్ కూడా ప్రసంగించనున్నారు. ఈ సమావేశానికి నాసిక్ సంరక్షక మంత్రి శ్రీ ఛగన్ భుజ్‌బల్, నాసిక్ మేయర్ శ్రీ సతీష్ కులకర్ణి, ఎంపీ డాక్టర్ సుభాష్ భామ్రే, ఎంపీ శ్రీ హేమంత్ గాడ్సేతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.
ముంబై, పూణే మరియు నాగ్‌పూర్ తర్వాత మహారాష్ట్రలో నాసిక్ సిజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించిన నాల్గవ నగరం కానుంది. ఇందులో మరిన్ని నగరాలను చేర్చడానికి మరియు సిజిహెచ్‌ఎస్ సేవల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 10 జూన్ 2021న నాసిక్‌లో కొత్త అల్లోపతిక్ వెల్‌నెస్ సెంటర్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్న 74 సిజిహెచ్‌ఎస్‌ల పరిధిలో 38.5 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.
నాసిక్‌లోని సిజిహెచ్‌ఎస్ వెల్‌నెస్ సెంటర్ ప్రభుత్వ కార్యాలయాలు మరియు నివాసాల మధ్య ఉంది. మరియు రోడ్డు మరియు రైల్వే నెట్‌వర్క్ ద్వారా కూడా బాగా అనుసంధానించబడి ఉంది. నాసిక్‌లోని వెల్‌నెస్ సెంటర్ ఔషధాల సమస్యను తీర్చడంతో పాటు ప్రభుత్వ మరియు ఎంపానెల్డ్ ఆసుపత్రులలో ఇండోర్ ట్రీట్‌మెంట్, ప్రభుత్వ మరియు ఎంపానెల్డ్ కేంద్రాలలో పరిశోధనలు, పెన్షనర్లు మరియు ఇతర గుర్తించబడిన లబ్ధిదారులకు ఎంపానెల్డ్ సెంటర్‌లలో చికిత్స కోసం నగదు రహిత సదుపాయం, పొందిన చికిత్స ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌తో సహా ఓపిడీ చికిత్సను అందిస్తుంది. అలాగే ప్రభుత్వంలో /ఎమర్జెన్సీ కింద ప్రైవేట్ హాస్పిటల్స్, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు మొదలైన వాటి కొనుగోలు కోసం చేసిన ఖర్చుల రీయింబర్స్‌మెంట్ మరియు కుటుంబ సంక్షేమం, ప్రసూతి మరియు శిశు ఆరోగ్య సేవలను కూడా అందిస్తుంది.
ఈ వెల్‌నెస్ సెంటర్ నగరంలోని సుమారు 71,000 మంది ప్రస్తుతం పనిచేస్తున్న మరియు పెన్షనర్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సహా 1.6 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ముంబై లేదా పూణే వెళ్లి అక్కడి వెల్ నెస్ సెంటర్ లో చికిత్స పొందాల్సి వచ్చేది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు సమగ్ర వైద్యం అందించాలనే లక్ష్యంతో 1954లో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ప్రారంభించబడింది. సిజిహెచ్‌ఎస్ భారతదేశంలో ఏర్పాటు చేసిన ప్రజాస్వామ్యానికి సంబంధించిన నాలుగు స్తంభాలైన శాసనసభ, న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక మరియు పత్రికా విభాగాలను కవర్ చేసే అర్హతగల లబ్ధిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్‌లకు మోడల్ హెల్త్ కేర్ ఫెసిలిటీ ప్రొవైడర్ మరియు పెద్ద మొత్తంలో లబ్దిదారుల సంఖ్య మరియు ఆరోగ్య సంరక్షణను అందించే ఉదారమైన విధానం కారణంగా సిజిహెచ్‌ఎస్ అనేది ప్రత్యేకమైనది.
***
(Release ID: 1787007)
Visitor Counter : 185